Online Puja Services

గృహప్రవేశానికి ఆవు లేకపోతే ఏమవుతుంది ?

18.118.150.80

గృహప్రవేశానికి ఆవు లేకపోతే  ఏమవుతుంది ?
లక్ష్మీ రమణ 

గృహప్రవేశం సమయంలో  ఆవును తీసుకొచ్చి , ఇల్లంతా తిప్పుతారు . అలా ఆవు మొదటగా గృహములోకి ప్రవేశించడము అంటే, సాక్షాత్తూ కామధేనువు ప్రవేశించినట్టే అని భావిస్తారు . దీని వెనుక చాలా గొప్ప విషయమే దాగుంది. ఈ ఆచారాన్ని వీలైనంతవరకూ ఇప్పటికీ మనం చక్కగా ఆచరిస్తూ ఉంటాము కూడా ! అయితే, ప్రస్తుతం మనకొచ్చిన చిక్కల్లా , అపార్టుమెంట్లతోటి. బహుళ అంతస్థుల భావంనాల్లోకి ఆవుని తీసుకుని వెళ్లడం కాస్త కష్టం.  పోనీ ఆ సంప్రదాయాన్ని  పక్కబెట్టి, అలాగే కానిచ్చేద్దాం అనుకుంటే, లోపల ఏదొక శంక, అసంతృప్తి ఉండిపోతాయి . అలంటి సమయాల్లో ఇలా చేస్తే సరి అంటున్నారు పండితులు . 

గోమాత  పృష్ఠ భాగం (వెనుక భాగం ) లక్ష్మిదేవి నివాసస్థానం.  తోక చివర ఉండే నలుపు రంగు వెంట్రుకలు సూర్య కిరణములు. ఆమె  రెండు కన్నులు సూర్యు, చంద్రులు .  ఉదరంలో ( కడుపులో) సరస్వతి దేవి కొలువుంటుంది . సప్తర్షులు నివసిస్తూ ఉంటారు. గోమాత పాల పొదుగు అమృత సాగరము. వెన్ను భాగము లో ఎత్తుగా ఉండేటటువంటి మూపురములో బ్రహ్మ దేవుడు నివసిస్తారు. ఆమె  నాలుగు కాళ్ళ పాదములు - ధర్మ, అర్థ, కామ,మోక్షములు.  గోమాత ముందు కాళ్ళలో మోకాలి భాగములో శ్రీహనుమంతులవారు నివసిస్తారు. గోమాత  పాద ధూళి కూడా చాలా పవిత్రమైనది. గోమాత రూపములో మన పూర్వీకులు తిరుగుతూ ఉంటారు .  అంటే, ఒక్క గోవు మనఇంట్లో ప్రవేశం చేస్తే, ఇంతమంది దేవీ దేవతలూ , మహర్షులు , మన పూర్వీకులతో సహా మన ఇంట్లో గృహప్రవేశం చేసినట్లే కదా ! అది కూడా స్వయంగా . 

దేవీదేవతలనీ పితృదేవతలనీ కూడా తన ద్వారా మన ఇల్లు పావనం చేయడానికి ఆ గోమాత తనతో తీసుకొస్తుంది. ఆ శక్తి ఆమెకే ఉందిమరి . అందుకే , గోమాతని తీసుకొనే గృహప్రవేశము తలపెడతారు . గోవు ఇంట్లో ప్రవేశించాకే, యజమానులు ఇంట్లో అడుగుపెడతారు. ఆ సమయంలో ఆ గోమాత పేడవేసినా, విసర్జన చేసినా అది మరింత శుభప్రదమే అవుతుంది . ఇంట్లో ఒకవేళ ఏవైనా దుష్టమైన పీడలున్న కూడా తొలగిపోతాయి. శుభం జరుగుతుంది. దేవతల, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. 

అందువల్ల గోవు వెళ్లకుండా గృహప్రవేశం చేయడం అనేది అంత శుభంకాదు . కానీ, అపార్టుమెంట్లలో, కాంక్రీట్ జంగిల్స్ లో ఆవులు ప్రవేశించడం ఒక్కొక్కసారి అంత సులువు కాదు . అటువంటి సందర్భాలలో మన అపార్ట్మెంట్ గ్రౌండ్ లో ఆ గోమాతని ఇతోధికంగా పూజించి, చక్కని ఆహార సదుపాయానికి , పోషణకీ సాయం చేసి, ఆఆవు పోషకుడైన యజమానికి సంతృప్తిని కలిగించి , గోమూత్రాన్ని , గోమయాన్ని చక్కగా మన అపార్టుమెంట్లో కనుక జల్లుకున్నట్లయితే, ఆవుని ఇంట్లోకి తీసుకువెళ్లిన ఫలం , ఫలితం దక్కుతుందని పండితుల సలహా ! 

Quote of the day

A small body of determined spirits fired by an unquenchable faith in their mission can alter the course of history.…

__________Mahatma Gandhi