Online Puja Services

వైశాఖమాస స్నాన సంకల్పము

3.136.26.20

వైశాఖమాస స్నాన సంకల్పము

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||

సర్వపాపహరం పుణ్యం స్నానం వైశాఖకాలికం |
నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||

వైశాఖః సఫలోమాసః మధుసూదన దైవతః |
తీర్థయాత్రా తపోయజ్ఞ దానహోమఫలాధికః ||

వైశాఖః సఫలం కుర్యాత్ స్నానపూజాదికం |
మాధవానుగ్రహేణైవ సాఫల్యంభవతాత్ సదా ||

మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరరౌ |
ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ||

ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే  శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా/గంగా/గోదావర్యోః మధ్యదేశే అస్మిన్(ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ఉత్తరాయనే, వసంతఋతౌ, వైశాఖమాసే, ....పక్షే , ....తిధౌ, ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం, ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు, జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్ధాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వే షాంపాపానాం అపనోద నార్ధంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్ధం, కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం, సర్వపాపక్షయార్ధం, ఉత్తరోత్తరాభివృద్ధ్యర్ధం మేషంగతేరవౌ మహాపవిత్ర వైశాఖమాస ప్రాతః స్నానం కరిష్యే.

సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము

గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||

పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకాభయంకరి
మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్దం ప్రకల్పయ ||

అంబత్వద్దర్శనాన్ముక్తిర్నజానే స్నానజంఫలం
స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||

విశ్వేశం మాధవండుంఢిం దండపాణీం చ భైరవం
వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||

అతితీక్షమహాకాయ కల్పాంత దహనోపమ
భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||

త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||

యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః
సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||

నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ ||

భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే
స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||

సమస్త జగదాధార శంఖచక్ర గదాధర
దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||

నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే
నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||

మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ
ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నంకురు మాధవ ||

స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ, ప్రవాహానికి యెదురుగా, వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి, తరువాత మడి/పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన/గృహమున దైవమును అర్చించాలి. స్నానము చేయుచు క్రింది శ్లోకములను చదువుచు శ్రీహరికి - యమునికి అర్ఘ్యమునీయవలెను.

వైశాఖే మేషగే భానౌ ప్రాతఃస్నాన పరాయణః |
అర్ఘ్యం తేహం ప్రదాస్వామి గృహాణమధుసూదన ||

గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |
ప్రగృహ్ణీత మయాదత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీదధ ||

ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |
గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||

దానమంత్రం

ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్షయార్థం, శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను.

దాన పరిగ్రహణ మంత్రం

ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిగృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.

పురాణ ప్రారంభమున వైష్ణవులు చదువదగిన ప్రార్థనా శ్లోకములు

యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||

యత్ర యోగీశ్వరః కృష్ణః యత్రపార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయోభూతిః ధ్రువానీతిః మతిర్మమ ||

లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||

అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ
ఆ కర్ణపూర్ణ ధన్వానౌ రక్షతాం రామలక్ష్మణౌ ||

సన్నద్ధః కవచీఖడ్గీ చాపబాణధరోయువా
గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతుసలక్ష్మణః ||

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ||

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యమ్
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||

ఉల్లాస పల్లవితపాలిత స్పతలోకీం నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం
శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః ||

పురాణము ముగించునప్పుడు చదువదగిన ప్రార్థనా శ్లోకములు

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ||

వందేలక్ష్మీం పరశివమయీం శుద్దజాంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం స్వర్ణ భూషోజ్జ్వలాంగీం ||

బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానాం
ఆద్యాంశక్తీం సకలజననీం విష్ణువామాంకసంస్థాం ||

కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయచ
విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః ||

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః
గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||

కాలేవర్షతు పర్జన్యః పృధివీసస్యశాలినీ
దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు నిర్భయాః ||

స్వకాలే భవితావృష్టిః దేశోస్తునిరుపద్రవః
సమృద్ధా బ్రాహ్మణాస్సంతు రాజాభవతు ధార్మికః ||

సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||

అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః
అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||

పురాణ ప్రారంభమున శివ సాంప్రదాయము వారు చదవవలసిన ప్రార్థనా శ్లోకములు

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ||

వందే శంభు ముపాపతీం సురుగురం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిం ||

వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం ||

తప్త స్వర్ణవిభా శశాంకమకుటా రత్నప్రభాభాసురా
నానావస్త్ర విరాజితా త్రిణయనాభూమీరమాభ్యాం యుతా ||

దర్వీహాటక భాజనం చదధతీరమ్యోచ్చపీనస్తనీ
నృత్యంతం శివ మాకలయ్య ముదితాధ్యేయాన్నపూర్ణేశ్వరీ ||

భవానీ శంకరౌవందే శ్రద్దా విశ్వాసరూపిణో
యాభ్యాంవినాన పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం ||

ఉక్షం విష్ణుమయం విషాణకులిశంక రుద్ర స్వరూపంముఖం
ఋగ్వేదాది చతుష్టయంపద యుతం సూర్యేందు నేత్ర ద్వయం ||

నానాభూషణ భూషితం సురనుతం వేదాంత వేద్యంపురం
అండం తీర్థమయం సుధర్మ హృదయం శ్రీనందికేశంభజే ||

పురాణం ముగించునపుడు చదవదగిన ప్రార్థనా శ్లోకములు

సాంబోనః కులదైవతం పశుపతే సాంబత్వదీయా వయం
సాంబం స్తౌమిసురాసురోగగణాః సాంబేన సంతారితాః ||

సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే
సాంబస్యామ చరోస్మ్యహం మమరతిః సాంబే పరబ్రహ్మణి ||

ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం
ఆగమవిపిన మయూరీం ఆర్యామంతర్వి భావయే గౌరీం ||

యశ్శివోనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయ మంగళం ||

నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్థమనుజ్ఞాం దేహిమే ప్రభో ||

వేదపాదం విశాలాక్షం తీక్ష్ణ శృంగంమహోన్నతం
ఘంటాంగళే ధారయంతాం స్వర్ణరత్న విభూషితం
సాక్షాద్ధర్మ తనుందేవం శివవాహం వృషంభజే ||

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీంమహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||

కాలేవర్షతు పర్జన్యః పృధివీ సస్యశాలినీ
దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు నిర్భయాః ||

స్వకాలే భవితావృష్టిః దేశోస్తునిరుపద్రవః
సమృద్ధా బ్రాహ్మణాస్సంతు రాజాభవతు ధార్మిక ||

సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ || 

అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః
అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||

సేకరణ 

 

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore