Online Puja Services

శ్రీకృష్ణుడికి సంతానం ఎంతమంది ?

3.139.62.103

శ్రీకృష్ణుడికి అంతమంది భార్యలున్నారా కదా ? మరి ఆయన సంతానం ఎంతమంది ? 
సేకరణ: లక్ష్మి రమణ  

శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలు , ఎనిమిదిమంది పట్టపురాణులూ ఉన్నారుకదా! మరి ఆయన సంతానం ఎంతమంది ఉండొచ్చు ? ఒక రాజ్యమంతా ఆయన సంతానమే ఉండిపోతుందేమో ! అసలు శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ద్వారకా పూరి సముద్రగర్భంలో మునిగిపోయింది. ఆ తర్వాత శ్రీకృష్ణుని వారసత్వాన్ని నిలిపిందెవరు ? ముసలం పుట్టి వంశనాశనం చేసేశాక ఇంకా ఎవరైనా మిగిలారా ? వీటికి వివరణలు వెతికే ప్రయత్నం చేద్దాం . 
 
శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడికి ఆ భార్యల వల్ల కలిగిన సంతానం ఎంత? పట్టపు రాణులైన ఎనిమిది మంది భార్యలతోటీ  ఆయనకు ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.

రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు.

కృష్ణుడికి సత్యభామ వల్ల భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.

జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.

నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.

కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.

లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.

మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.

కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. 
 
వీరు తక్క కృష్ణుని సంతానానికి చెందిన వివరాలు లభించడం లేదు . మగిలిన విషయాలపైనా మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది . 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi