Online Puja Services

ఈ చిన్న శ్లోకం నాగదోషాన్ని హరించి సంతానాన్ని ఇస్తుంది

3.12.34.178

ఈ చిన్న శ్లోకం నాగదోషాన్ని హరించి సంతానాన్ని ఇస్తుంది . 
- లక్ష్మి రమణ 

తెలుగు నిఘంటువులు నాగులు సప్తగాణాలైన ఋషులు, గంధర్వులు, నాగులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, దేవతలలో ఒకరు . నాగులు అంటే, కేవలం మనకి కనిపించేవి మాత్రమే కాదు . దివ్యమైన నాగులు . అవి భువిలో , అంతరీక్షంలో, దివ్య లోకాలకి చెందినటువంటివి .  నాగులని అర్చించడం, వారిని జ్ఞాన ప్రదాయకాలుగా అర్చించడం మన  సంప్రదాయంలో ఒక భాగం . దేవతా మూర్తులైన నాగుల ఆరాధనకు సంబంధించిన  ఒక చిన్న శ్లోకం రోజూ చదువుకుంటే, ప్రత్యేకించి ఉదయం పూట చదువుకుంటే , నాగ దోషాలు హరించుకుపోతాయి. సంతానం కలుగుతుంది . సర్పాలు కనిపించినప్పుడు స్మరిస్తే, విష భయం ఉండదు.  సర్వకార్యాలలో జయం సిద్ధిస్తుంది . ఆ దివ్యమైన శ్లోకం ఏమిటో చూద్దాం . 

నవనాగ నామ స్తోత్రం (శ్రీ నాగ స్తోత్రం ) 

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!

 ఫలశృతి: 

ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!

సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!

సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!

ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి

ఇతి శ్రీ నవనాగ స్తోత్రం.

(ఇది శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర నిధి పుస్తకం నుండీ గ్రహించబడింది . )

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha