Online Puja Services

Shuklambaradharam Vishnum 
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye

ఇంట్లో వచ్చే మున్సిపల్ నీటిని పూజకి వాడుకోవచ్చా ?
- లక్ష్మి రమణ 

పురాతన కాలంలో నదుల నుండీ నీటిని మడిగా వెళ్లి తెచ్చుకునే వారు . లేదా బావుల నుండీ తోడుకొని వాడుకొనే వారు . పంపుల ద్వారా భూగర్భజలాలని పైకి తీసి వాటిని శుద్ధజాలాలుగా పూజకి వినియోగించేవారు . కానీ, ఇప్పుడు భూగర్భ జలాలు అంతగా అందుబాటులో ఉండడం లేదు .  ఇంటికి వచ్చే మున్సిపల్ నీరు మాత్రమే దిక్కు . వాటినే సంపులో నింపుకొని రోజూవారీ వాడకానికి కూడా వినియోగించుకోవాల్సిన పరిస్థితి .  ఇలాంటప్పుడు పూజకి శుద్ధమైన జలాలు ఎలా లభిస్తాయి ? గ్రామాలతో పోలిస్తే  సిటీల్లో ఉండేవారి పరిస్థితి ఈ విషయంలో మరీ దుర్భరం కదా అప్పుడు అనుష్ఠానం ఎలా అన్నది సందేహం . 

ఆచారం, నియమం ఖచ్చితంగా పాటించాల్సినవే . అందులో సందేహం లేదు .  కానీ అది మన శక్తికి మించినదై ఉన్నప్పుడు ఉన్న వనరులని సమర్థవంతంగా వినియోగించుకొనే ప్రయత్నం చేయాలి . శక్తి ఉన్నప్పుడు , వనరులు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం , ఇలా చేసుకొనే వెసులుబాటు ఉన్నది కదా ఆలాగే చేసుకొందాం అనుకోకూడదు . 

ఇక , జలం అనేది అమృతంతో సమానం . మనకి దొరికే నీటిని, మనం త్రాగే శుభ్రమైన నీటినే పూజకి వినియోగించాలి . ఇంకా సందేహం ఉన్నప్పుడు మంత్రయుక్తంగా గంగ , యమున, కృష్ణ , కావేరీ తదితర నదులని స్మరించి, ఆహ్వానించి  నీటిని స్పృశిస్తే ఆ నీరు పవిత్రం అవుతుంది . ఇష్టదేవతా ప్రార్థన చేసి , అప్పుడు ఆ నీటితో పూజాది కార్యక్రమాలని నిర్వహించుకోవడం ఉత్తమమైన పని . 

అంతేకానీ, ఖచ్చితంగా నిత్యకర్మానుష్ఠానాన్ని మాత్రం వదులుకోకూడదు. ఈ విధంగా దొరికిన జలాలతోనే చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు .  

శుభం . 

Municipal water, tap, water, pooja, puja

#puja #pooja

Videos View All

గర్భవతులు దేవాలయానికి వెళ్లకూడదా ?
దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ?
పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏంచేయాలి ?
అర్థరాత్రి 12 గంటలకి తేదీ మారుతుంది కదా! ఒక రోజు గడిచినట్టేనా ?
ఇంట్లో వచ్చే మున్సిపల్ నీటిని పూజకి వాడుకోవచ్చా ?
మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda