Online Puja Services

Om Tryambhakam Yajamahe

 Sugandhim Pushtivardhanam |

Urvarukamiva Bandhanan

 Mrityor Mukshiya Maamritat ||

విభూదిని ఈ మంత్రంతో ధరిస్తే, ఆరోగ్యమూ , సంపద సిద్ధిస్తాయి .
- లక్ష్మి రమణ 

విభూదిని ధరించడం వలన పాపాలన్నీ నశించిపోతాయి. ఆ విభూది తయారయ్యే విధానం మీద కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది . సరైన పద్ధతిలో విభూదిని ధరిస్తే, అటువంటి వారిని  సాక్షాత్తూ శివునితో సమానమైన వారిగా  భావించాలని స్కాందపురాణం చెబుతోంది .  ఆవిశేషాలని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నాం చేద్దాం రండి .  

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ || 

అందరికి శక్తిని ఇచ్చే ఆ ముక్కంటి , సుగంధ భరితమైన  శివున్ని మేము పుజిస్తున్నాము. పండు తొడిమ నుండి వేరుపడు విధముగా, మేము కూడా మరణము నుండి, మర్త్యత్వము నుండి విడుదల పొందాలి. అని త్రయంబకం మంత్రాన్ని పఠిస్తూ , విభూదిని ధరించాలి . ఆ విధంగా 

పవిత్రమైన విభూదిని ధరించేవారు సాక్షాత్తు శివస్వరూపులే అవుతారు. అని స్కాంద పురాణం చెబుతోంది .   

అటువంటి పవిత్రమైన విభూదిని తయారు చేసే విధానాన్ని కూడా ఈ పురాణం మనకి వివరిస్తుంది . కపిల వర్ణంలో ఉండే ఆవు పేడ నేల మీద పడకుండానే దాన్ని గ్రహించాలి. ఆ పేడను ఎండబెట్టి బాగా ఎండాక కాలిస్తే దాని నుంచి భస్మం వస్తుంది. అదే నిజమైన విభూది, శివ ప్రీతికరమైనది.  అలాంటి విభూదిని ధరించిన వారికి సకల పాపాలు నశిస్తాయి. 

ఈ విభూదిని ఎలా ధరించాలి అంటే, నుదుటిమీద ముందుగా బొటని వేలుతో రేఖను ఏర్పరిచి, ఆ తరువాత మధ్య వేలు మడిచి, రెండు వేళ్ళతో మూడు రేఖలను ఏర్పరచుకోవాలి. ఈ విధంగా మూడు రేఖలతో ఎవరైతే విభూదిని ధారణ చేస్తారో వారిని శివస్వరూపునిగా భావించాలి. ఈ విధంగా త్రిపుండ్రాలను ధరించిన వారిని చూస్తే చాలు, పాపాలన్నీ కూడా నశిస్తాయి. 

 శివోహిదాతా  లోకానాం కర్త చైవానుమోదితా | 
శివశక్యాత్మకం విశ్వం జానీద్వంహి  ద్విజోత్తమా||  

శివేతిద్యక్షరం నామ త్రాయతే మహతో భయాత్ | 
తస్మాఛ్చివ శ్చిత్యతాం వై స్మక్యతాంచ ద్విజోత్తమా || 

శివుడి కన్నా ఈ లోకంలో మించిన దైవం వేరెవ్వరూ లేరు. శాస్త్రాలలో చెప్పిన విషయసారమంతా శివతత్వమే. లోకాలన్నిటికీ దాత, కర్త, అనుమతించేవాడు అన్ని శివుడే.  ఈ విశ్వమంతా శివ శక్తి రూపాత్మకమైనదే  అని గ్రహించండి.  శివ అనే రెండు అక్షరాలే భయం నుంచి అందరినీ రక్షిస్తాయి.  కనుక అందరూ శివనామాన్ని జపించాలి, ధ్యానించాలి. ఆ రకంగా శివధ్యానం చేసి, విభూది ధారణ చేసి శివానుగ్రహాన్ని పొందుదాం . కుబేరుడు కూడా ఆ శివుని అనుగ్రహం వల్లనే సంపదలు పొందాడు . సంపదలకు అధిదేవుడయ్యాడు . అందువల్ల శివుని అనుగ్రహం సంపదల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది . 

శుభం .  

Videos View All

అర్ధ నారీశ్వర అష్టకం
శ్రీ శరభేశాష్టకమ్
చంద్రశేఖరాష్టకం
శ్రీ కాలభైరవాష్టకం
లింగాష్టకం | Lingastakam
విభూదిని ఈ మంత్రంతో ధరిస్తే,

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi