పరమాత్మ తో తండ్రి పుత్రుల బంధం

3.239.58.199
ఓం నమో నారాయణాయ 🙏
🚩 జై శ్రీ రామ్ 🚩
🚩ఒక రామాయణ కథ ఉంది.
సీత కోసం శ్రీరాముడు, లక్ష్మణుడు దండకారణ్యంలో వెతుకుతున్నప్పుడు వారికి "జటాయువు" కనిపించింది.
🚩రావణుడి నుంచి సీతను విడిపించే ప్రయత్నంలో తన రెక్కలు విరిగి నిస్సహాయురాలినయ్యానని వారికి చెప్పింది.
🚩జటాయువును శ్రీరాముడు ఒడిలోకి తీసుకొని ‘‘నన్ను ఏదైనా కోరుకో!’’ అని అడిగాడు.
🚩‘‘ప్రభూ! మీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏదీ లేదు’’ అంది జటాయువు.
🚩‘‘జటాయూ! నువ్వు జీవనదానం చెయ్యాలని కోరుకున్నా నీకు ప్రసాదిస్తాను’’ అన్నాడు శ్రీరాముడు.
🚩‘‘ప్రభూ! మీరు నాకు అన్నీ ఇచ్చేశారు.
ఇక ఇవ్వడానికి ఏదీ మీ దగ్గర మిగలలేదు. అందుకే మీ నుంచి నేనేదీ కోరుకోను’’ అంది.
🚩ఇది విన్న లక్ష్మణుడికి కోపం వచ్చింది.
‘‘నువ్వు ఒక పక్షివి. పక్షి బుద్ధితో... మీ దగ్గర ఇవ్వడానికేదీ లేదని భగవంతుడితో ఎంత సంకుచితంగా చెబుతున్నావ్‌!’’ అన్నాడు.
🚩అప్పుడు జటాయువు ‘‘ఒక సంపన్నుడికి కొడుకు పుడితే అందరికీ మిఠాయిలు పంచుతాడు.
కానీ ఆ శిశువుకు మిఠాయి తినిపించడు.
అయితే, అతని సంపద స్వతహాగా ఎవరికి చెందుతుంది?’’ అని అడిగింది.
🚩‘‘అతని పుత్రుడికే కదా ఆ సంపదంతా లభించేది’’ అన్నాడు లక్ష్మణుడు.
🚩‘‘మరి నేను నా తండ్రి ఒడిలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నదంతా నాకు లభించింది.
ఇప్పుడు వేరేగా నాకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఏం మిగిలింది?’’ అని జటాయువు ప్రశ్నించింది.
⚜️🚩ఇష్ట దైవంతో తండ్రి, పుత్రుల బంధాన్ని పెనవేసుకొనేలా భక్తి ఉండాలి.
భగవంతుణ్ణి ‘సర్వవ్యాపి’ అన్నారు.
అంటే అనుభవానికి అతీతమైనవాడు. నామరూపాలకు అతీతమైనవాడు.
ఆయనే ఈశ్వరుడు.
ఆయన అందరికీ పరమ పిత🙏
⚜️🚩ఒక రోగి ఆరోగ్యవంతుడు కావడానికి
👉 ఔషధం, శక్తి, పథ్యం అవసరం.
అలాగే మనోవికారాలనే రోగాన్ని నిర్మూలించడానికి "సహజ జ్ఞానం" అనే ఔషధం,
"సహజ యోగం"అనే శక్తి,
"సాంగత్యదోషం నుంచి రక్షించడం"అనే పథ్యం అవసరం.
⚜️🚩పరమాత్మతో తండ్రీ, పుత్రుల బంధాన్ని ఏర్పరచుకుంటే... అన్ని చింతల నుంచీ, సమస్యల నుంచీ విముక్తులం అవుతాం.
♦️ఈశ్వరుడి మీద పూర్తి నమ్మకం ఉంచి, ఆయనతో సర్వ సంబంధాలూ ఏర్పరచుకుంటే... కర్మలో ఆయన సహాయకారి అవుతాడు.
♦️కోరికలకు అతీతంగా ఉంటేనే ఈశ్వరుడితో సంబంధాలను అనుభవంలోకి తెచ్చుకోగలం.
🌷🌷ఓం నమో భగవతే వాసుదేవాయ 🌷🌷
🌷🌷 ఓం నమో నారాయణాయ
 
- సత్య వాడపల్లి

Quote of the day

The mind is the root from which all things grow if you can understand the mind, everything else is included.…

__________Bodhidharma