కపోతేశ్వర లింగం కధ

3.236.212.116
ఓం నమఃశివాయ 🙏
 
🌷🌷 హర హర మహాదేవ శంభో శంకర 🌷🌷
⚜️🚩శ్రీ కపోతేశ్వర స్వామి🙏
♦️మహాభారతంలోని కథ...
మాంధాత కుమారుడైన "శిబి" చక్రవర్తికి
మేఘదాంబరుడు, జీ మూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు.
♦️మేఘదాంబరుడు అన్న అనుమతితో 1500 మంది పరివారం వెంటబెట్టుకొని కాశ్మీర దేశం విడచి తీర్ధయాత్రలకు బయలుదేరాడు.
♦️అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలసి తపోదీక్షనాచరించి కాలం చేశాడు.
కొండపై అతని శరీరం దహనం చేయగా
ఆ భస్మం ఒక "లింగరూపం" ధరించింది.
♦️అన్న తిరిగి రానందున అతనిని వెదుకు.తూ "జీమూతవాహనుడు" అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వచ్చాడు.
అన్నకు జరిగిన విషయం విని ఆ కొండపైనే తపమాచరించి తానూ మరణించాడు.
♦️తమ్ముళ్ళను వెతుక్కుంటూ శిబి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు.
⚜️🚩అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు.
నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని
పరీక్షింపదలచారు.
👉"శివుడు" ఒక వేట గాని వలెను,
👉"బ్రహ్మ" అతని బాణం లాగాను,
👉"విష్ణువు" ఒక కపోతం లాగాను అక్కడికి వచ్చారు.
♦️వేటగానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తి శరణు జొచ్చింది.
శిబి ఆపక్షికి అభయమిచ్చాడు.
♦️అక్కడికి వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని చెప్పాడు.
♦️శిబి ఇరకాటంలో పడ్డాడు.
చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి,
♦️త్రాసులో పావురాన్ని ఒక వైపు ఉంచి, తన శరీరంలో కొంత మాంసాన్ని కోసి రెండవవైపు ఉంచాడు. అయినా అవి సరి తూగలేదు.
♦️చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి
దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు.
♦️తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు.
♦️అలా తల లేని శిబి మొండెమే "కపోతేశ్వర"🙏 లింగమైందని స్థల పురాణం.
⚜️🚩కపోతేశ్వర లింగం స్వయంభువుగా చతురస్రాకారపు వేదికపై దర్శనమిస్తుంది.
♦️ఈ లింగము గుండ్రంగా కాకుండా కరచరణములు, శిరస్సు లేని మనిషి మొండెము వలే పలకగా ఉంటుంది.
♦️ఈ లింగాకృతి చుట్టు మాంసము తీసి యిచ్చినట్లు గుంటలు ఉంటాయి.
♦️శిబిచక్రవర్తి తన భుజాలను నరికి యిచ్చినట్లుగా లింగాకృతికి కుడి ఎడమల రెండు బిలాలుంటాయి. యిందులో కుడిబిలములో ఒక బిందె నీరు మాత్రమే పడతుంది. ఎడమ బిలంలో ఎన్ని నీళ్ళు పోసినా నిండదు.
అంతేకాకుండా కుడిబిలంలో పోసిన నీరు మరుసటి రోజుకు పచ్చిమాంసపు వాసన వస్తుందని చెపుతారు. ♦️ఈ నీటిని ప్రతిరోజు కుంచెకోలతో తీస్తారట. అందుకే దీన్ని శల్యలింగంగా చెపుతారు.
లింగానికి సహజ యజ్ఞోపవీతం కనిపిస్తుంది.
🌷🌷
ఓం నమఃశివాయ
 
సత్య వాడపల్లి 

Quote of the day

The Way is basically perfect. It doesn't require perfecting.…

__________Bodhidharma