Online Puja Services

పదునాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?

3.134.87.95

పదునాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?
- లక్ష్మి రమణ 

పదునాలుగు భువనాలు ఈ జగతిలో ఉన్నాయని సనాతన ధర్మంలోని అనేక పురాణాలు వివరంగా చెబుతున్నాయి. పదునాలుగు లోకాలలోనూ మనుషులైతే  ఉండరు కదా ! మరి ఎవరుంటారు? పదునాలుగు భువనాల్లో ఎవరుంటారనే విషయాలని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

భూలోకం , భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం,జనలోకం, తపోలోకం, సత్యలోకం, అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం , రసాతలం, పాతాళలోకం అనేవి ఆ పదునాలుగు భువనాలు . ఈ 

పదునాలుగు లోకాల్లోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, సువర్లోకాలను ”కృతకలోకాలు” అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడులోకాల్లొనూ ఉంటారు.

నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకంలో  కల్పాంత జీవులు ఉంటారు.

అయిదోవది అయిన జనలోకంలో  బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

ఆరోవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.

ఏడోలొకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరది అయిన సత్యలోకం మరణదర్మం లేని పుణ్య లోకం. ఇందులొ సిద్ధాది మునులు నివసిస్తారు.

ఎనిమిదొవ లోకం అయిన అతలంలో మయుడు అనే దానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.

తొమ్మిదొవది అయిన వితలంలో హోటకేస్వరుడు, ఆయన పరివారం ఉంటారు.

పదోవది అయిన సుతలంలో బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.

పదకొండవది  అయిన తలాతలంలో త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు , మహాదేవ రక్షితుడై ఉంటాడు.

పన్నెండో వది అయిన మహాతలం లో కద్రువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణుడు మొదలైనవారు ఉన్నారు .

పదమూడవ లోకం రసాతలం. ఇందులో   “పణి ” అనబడే దైత్యులు , రాక్షసులు నివశిస్తూ ఉంటారు. నిరత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు వీరే .

పదనాలుగది పాతాళలోకం. ఇక్కడ శంఖుడు, మహాశంఖుడు, శ్వేతుడు , ధనంజయుడు, శంఖచూడుడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలయిన సర్వజాతుల వారు నివశిస్తు ఉంటారు.

14 lokas

#14lokas

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore