ఆవుపాలతో ఆరోగ్యం

100.24.115.215
కొలెస్ట్రాల్‌ తక్కువ, జీర్ణశక్తి దోహదం
 
శక్తి, మానసిక వికాసానికి ఉపయోగకరం పిల్లల్లో మేధాశక్తికి తోడ్పాటు
 
ఆవు పాలు తాగడం వలన పటిష్టమైన దేహదారుఢ్యం, మేధోశక్తి పెడుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదని నిపుణులు తెలుపుతున్నారు. రోజూ పాలు తాగడం ఏంతో మంచిదే...కానీ నేడు మార్కెట్‌లో లభ్యమవుతున్న పాలు ఎంత శ్రేయస్కారమన్నదే ప్రశ్న. వీటన్నింటికంటే అందుబాటులో ఉంటే ఆవుపాలు తాగడమే మేలు స్వచ్ఛమైన ఆవుపాలలో ప్రోటీన్లు ఆధికంగా ఉంటాయి.
 
ఆరోగ్యం
 
ఆరోగ్యంగా ఉండాలంటే ఆవుపాలు తప్పనిసరిగా తాగాలి. ఆరోగ్యంగా ఉన్న పశువు నుంచి వచ్చే పాలు మనిషికి అన్ని విధాలా ఉపయోగపడతాయి. సంపూర్ణ ఆహారంలో భాగంగా రోజూ గ్లాసు అవుపాలు తాగితే పూర్తి ఆరోగ్యం మీసొంతమే. ఇవి ఒక ఔషదం లాగా పనిచేస్తాయి. ఆవు పాలలో వెన్నశాతం తక్కువగా ఉండడంతో మనిషికి తొందరగా జీర్ణమవుతాయి. అందుకే డాక్టర్లు ఆవుపాలను పసిపిల్లల దగ్గర్నుంచి వయోవృద్ధుల వరకు తాగమని సిఫారసు చేస్తారు.
 
పాలలో ఉండె పదార్థాలు 
 
స్వచ్ఛమైన పాలలో సుమారు 83 నుంచి 89 శాతం వరకు నీరు ఉంటుంది. 11నుంచి 17 శాతం వరకు ఘన పదార్థాలు ఉంటాయి. పాలలో ఉండే ముఖ్యమైన పదార్థాలు కొవ్వు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులను బట్టి గణ పదార్థాల శాతం
మారుతుంది. 
 
లక్షణాలు 
 
ఆవు పాలలో ఎరోటిన్‌ అనేట వర్ణపదార్థం కలిగి ఉండడం వల్ల లేత పసుపు రంగులో ఉంటాయి. ఆవు పాలలో తక్కువ శాతం ఘన పదార్థాలు ఉండడం వల్ల పలుచగా ఉంటాయి.
 
ఖనిజ లవణాలు :
 
వివిధ రకాల ఖనిజ లవణాలు ఆవుపాల నుంచి లభిస్తాయి. ముఖ్యంగా కాల్షియం, పొటాషియం, భాస్వరం, మెగ్నిషియం, క్లోర్తెడ్‌లు పాలలో ఉండడం వలన జీర్ణశక్తికి తోడ్పడతాయి.
 
మాంసకృత్తులు 
 
పాలలో కెసిన్‌, అల్బుమిన్‌, గ్లోబ్యూమిన్‌ మాంసకృత్తులు ఉంటాయి. పాలలో 85-95 శాతం కెసిన్‌ ఉంటుంది. ఈ రకమ్తెన ప్రోటీన్‌ పాలలో మాత్రమే ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటిన్‌లు చాలా అవసరం
 
ఉపయోగాలు 
 
ఆవు పాలలో మనకు కావాల్సిన ప్రోటీన్‌లు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు, ఎంజ్తెమ్‌లు కెరోటిన్‌ అనే ప్రత్యేక రసాయనం తగు పాల్లలో ఉన్నందున మంచి శక్తిని ఇస్తాయి. ఆవు పాలలో సెరప్రాయిడ్‌తత్వం ఉన్నందువల్ల మానసిక వికాసానికి తోడ్పడతాయి. ఎముకలు గుల్లబారిపోవడం వంటి సమస్యలను నివారించవచ్చు. వీటిలో ఏ విటమిన్‌ అధికంగా ఉండటం వలన రేచీకటి రాకుండా ఉపయోగపడుతుంది. అందులో బీటాకెరోటిన్‌ మంచి దృష్టికి తోడ్పడుతుంది. అల్సర్‌, దాహం, వేడి ఉన్న వారికి ఎంతో శ్రేష్టం. ప్రతి ఒక్కరూ ఆవు పాలు తప్పనిసరిగా తాగాలి.
 

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna