అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారు ?

3.235.105.97

చంద్రుని యొక్క అష్టమికళ ఏ తిధిన ఉంటుందో అది అష్టమి తిధి అనబడుతుంది.అష్టమిరోజున చంద్రుడు సమంగా ఉంటాడు. అంటే అర్ధచంద్రుడు. అగ్నిపురాణంలో అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది. చంద్రుడికి పదహారు కళలున్నాయి. పాడ్యమి దగ్గరనుంచి పూర్ణిమ వరకు తిథులు పదిహేను పదహారవకళ సాక్షాత్తూ సచ్చిదానందస్వరూపిణి అయి ఉన్నది. చంద్రుని యొక్క పదహారుకళలు సూర్యునిలో దాగి ఉంటాయి. శుద్ధపాడ్యమి అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి చంద్రునిలో ప్రవేసిస్తుంది. ఆరకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజును పూర్ణిమ అంటారు. ఆ తరువాత ప్రతిరోజూ ఒక్కొక్క కళ చంద్రుని నుంచి విడిపోయి సూర్యునిలో చేరిపోతుంది. ఈ రకంగా పదిహేను కళలు చంద్రుని వదలి వెళ్ళిపోయిన రోజును అమావస్యా అంటారు. ఆ రోజు చంద్రుడు కళావిహీనుడు. ఇవే శుక్ల కృష్ణ పక్షాలు. ఈ రెండింటిలోనూ కూడా అష్టమినాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు. 

అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు. ఇతడే అర్ధచంద్రుడు. తిథులు నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. నిత్యలు మొత్తం పదహారు. వీటిని గురించి వసిష్టసంహితలో వివరించబడింది.  ఈ నిత్యల గురించి వామకేశ్వరతంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది. కామేశ్వరి, భగమాలినీ, నిత్యక్తిన్న భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,

శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ,
జ్వాలామాలినీ, విచిత్ర, మహానిత్య

ఇవి పదహారునిత్యలు. ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతుండటంచేతనే
చంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతున్నాయి. శుక్ల కృష్ణ పక్షాలయందున్న తిధులు నిత్యలు
ఈ దిగువ ఇవ్వబడ్డాయి.

శుక్లపక్షము తిథి, నిత్యాదేవత కృష్ణపక్షము తిథి

1. పాడ్యమి ,కామేశ్వరి. 1. పాడ్యమి, చిత్ర

2. విదియ, భగమాలిని. 2 జ్వాలామాలిని
3. తదియ ,నిత్యక్షిన్న 3 సర్వమంగళ
4. చవితి , భేరుండా. 4 విజయ

5. పంచమి, వహ్నివాసిని 5 నీలపతాక
6. షష్టి ,మహావజ్రే్ేశ్వరి 6. నిత్య

7. సప్తమి ,శివదూతి 7 కులసుందరి
8. అష్టమి, త్వరిత 8 త్వరిత

9. నవమి, కులసుందరి. 9 శివదూతి
10. దశమి ,నిత్య 10. మహావజ్రేేశ్వరి
11. ఏకాదశి ,నీలపతాక 11. ఏకాదశి వహ్నిివాసిని
12. ద్వాదశి ,విజయ 12. ద్వాదశి భేరుండా
13. త్రయోదశి | సర్వమంగళ 13. త్రయోదశి | నిత్యకిన్న
14. చతుర్దశి, జ్వాలామాలిని 14. చతుర్దశి భగమాలిని
15. పూర్ణిమ ,చిత్ర 15. కామేశ్వరి


చంద్రుని యొక్క కళలు ఈ రకంగా మారినప్పుడు తిథి ఒకటే అయినప్పటికీ శుక్ల
కృష్ణ పక్షాలలో నిత్యాదేవతలు వేరుగా ఉంటాయి. ఆ విషయం పైన పట్టిక చూస్తే
తెలుస్తుంది. కాని రెండు పక్షాల యందు అష్టమినాడు మాత్రం “త్వరిత” అనబడే
నిత్యాదేవతయే ఉంటుంది. దాన్నే త్వరితాకళ అని కూడా అంటారు. అనగా ఎటువంటి
మార్పులేనివాడు అష్టమినాటి చంద్రుడు. అందుచేతనే అష్టమినాటి చంద్రునితో దేవి
ముఖాన్ని పోల్చటం జరిగింది.

గుండ్రని ముఖానికి పైన కిరీటము పెట్టటంచేత, దేవి యొక్క లలాటము అర్థచంద్రాకారంగా అష్టమినాటి చంద్రునిలాగా కనిపిస్తుంది.

శ్రీ మాత్రే నమః

భానుమతి అక్కిశెట్టి 

Quote of the day

Democracy and socialism are means to an end, not the end itself.…

__________Jawaharlal Nehru