Online Puja Services

కుళుత్త పుళ శ్రీ బాలశాస్తా

3.136.97.64
హరి హర పుత్రుడు శ్రీ ధర్మశాస్తా కథలు నo 19
 
ఈ నాటి శాస్త కథలలో మనం కుండలిని శక్తికి సంభందించిన ఆరు కోవెలలో నాలుగవది, పంచ శాస్తా ఆలయాలలో మూడవది  కుళుత్త పుళ శ్రీ బాలశాస్తా గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
 
    ఈ ఆలయం ఆర్యంకావు నుండి 25 కి.మీ దూరమున నున్నది. ఈ ఆలయము అరణ్య మధ్యలో నున్నది. ఇచట స్వామి వారు బాలశాస్తా రూపములో దర్శనం ఇస్తారు. అరణ్యంలో పుట్టిన హరిహర తనయుడు, బాలరూపము లోనే ఇచ్చటి అరణ్య కోవెలలో శివ విష్ణువులతో పాటు కొలువై వుంటారు. 
 
        బాలశాస్తా ఆలయం కుడి వైపు,దగ్గరలోనే తల్లి మొహాని అవతార శ్రీ కృష్ణుడు, తండ్రి అవతార పరమ శివుడు, ఆలయo ఎడమ వైపు కొలువై వుంటారు.
 
   ఈ ఆలయ దర్శనం మన కుoడలిని లోని అనాహత  చక్రాన్ని మేల్కొలుప బడుతుంది. 
 
ఇక్కడ భక్తులు తమ బిడ్డలతో పాటు వచ్చి స్వామిని పూజించు కుంటారు. ఈ బాలశాస్తా పసివారిని కాచే దైవము  గా కొలుస్తారు. సంతాన హీనులు సంతానార్థం స్వామిని వేడు కొంటారు. పిల్లల పరీక్షల సమయమున వారికి మనోస్థితి స్థిరమునకై వచ్చి ఇచట ప్రార్థనలు చేస్తారు.
 
ఈ బాలశాస్తా విగ్రహమును పరశురాముని ప్రతిష్ట అని అంటారు. స్వామిని ఇచట స్వయంభువుగా కొలుస్తారు. స్వామి విగ్రహం చాలా చిన్నదిగాను, ఏడు చిన్న చిన్న రూపములను ధరించిన స్వయంభువుగా దర్శనమిస్తారు. చేత విల్లంబులు ధరించిన విగ్రహమూర్తిగా ఈ బాలశాస్తా శబరిమల చేరు భక్తులకు దర్శన భాగ్యమిస్తారు.  
      
ఇట్లు
భవదీయుడు
 
L. రాజేశ్వర్ 

Quote of the day

Everything comes to us that belongs to us if we create the capacity to receive it.…

__________Rabindranath Tagore