ఆత్మలు పూజించే అమ్మవారి ఆలయం.

3.236.221.156

ఆత్మలు పూజించే అమ్మవారి ఆలయం. 
-లక్ష్మీరమణ 

ఆత్మలు సంచరించేచోట అడుగుపెట్టాలంటే, గుండెధైర్యం ఉంటె సరిపోతుంది.  ఆత్మ భక్తిగా  దేవిని పూజించుకోవాలనుకుంటే కూడా , ఆ ఆత్మకి గుండెధైర్యమే కావాలి .  అటువంటి దైర్యమున్న రెండు ఆత్మలు పూజించే శారదాదేవి ఆలయం ఇది . 

ఆమధ్య ఒకసినిమాలో దయ్యాలూ , ఆత్మలూ చూపించమన్న హీరోయిన్ ని చెంపదెబ్బకొట్టి , ఏదీ నీ నొప్పి చూపించు అని అడుగుతాడు కదా! అలాగే దేవుడు ఉన్నాడు . ఆత్మలూ ఉన్నాయి .  స్వామీ నిగమానంద ఇలా చెబుతారు . ‘ చనిపోయిన తర్వాత అసంతృప్తిగల ఆత్మ పొందే వాయురూపమే ఆత్మ . దీన్నే భూతం , ప్రేతం అని కూడా అంటారు . మోహగ్రస్తమైన స్థితిలో చనిపోయిన ఆత్మ, చాలా కాలం వరకూ, తానూ శరీరాన్ని వదిలేశానన్న విషయాన్ని గుర్తించలేదు .  గాఢమైన సుషుప్తి నుండీ మేల్కొని  బాష్ప రూపాన్ని పొందగలుగుతుంది. ఆ తర్వాత అది మనుష్యరూపాన్ని పొందగల్గుతుంది’ . 

తిరిగి మనం శారదా దేవి దగ్గరకి వచ్చేద్దాం . ఇలా మనుష్యరూపంలో ఆ అమ్మవారిని అర్చించేందుకు రెండు ఆత్మలు నిత్యం ఈ ఆలయానికి వస్తాయట .  ఈ ఆలయం మధ్యప్రదేశ్‏లోని భోపాల్ సమీపంలో ఉన్న పాట్నా జిల్లాలో ఉంది . దీనిని  మైహర్ దేవాలయం అని పిలుస్తారు .  అందులో శారద అమ్మవారు కొలువై ఉన్నారు. 

అమ్మవారి ఆలయం త్రికూట్ అనే కొండల మధ్య ఉంది. ప్రతి సంవత్సరం శారద దేవిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. కానీ రాత్రిపూటమాత్రం ఇక్కడ ఒక్క పురుగు కూడా కనిపించదు .  రాత్రిపూట ఇక్కడ ఉండాలంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే అని చెబుతుంటారు. రాత్రిళ్ళు ఇక్కడికి వచ్చేవారి అడ్రస్సులు గల్లంతవుతాయని స్థానికుల విశ్వాసం .
 
అయితే దీనివెనుక ఒక కథ ఉంది. శారద దేవి భక్తులైన ఆలహ, ఉదమ్ అనే ఇద్దరు సోదరుల ఆత్మలు అక్కడ తిరుగతాయట. పూర్వం వీరిద్ధరి ఆత్మలతో పృథ్వీరాజ్ చౌహాన్ సైతం పోరాడారని కథనం . అంతేకాకుండా వీరిద్దరె మైహర్ దేవాలయాన్ని కనుగొన్నారట. అందుకే రాత్రిళ్లు ఈ ఆలయాన్ని మూసివేస్తారట. ఇక రాత్రి సమయంలో ఆ ఇద్దరు సోదరులు అమ్మవారిని పూజిస్తారని  విశ్వాసం . 

Quote of the day

Bondage is of the mind; freedom too is of the mind. If you say 'I am a free soul. I am a son of God who can bind me' free you shall be.…

__________Ramakrishna