వినాయక పూజలో పత్రి వల్ల ఆరోగ్య ఉపయోగాలు

44.192.25.113
వినాయక చవితి నందు పూజలో ఉపయోగించు మూలికల విశేషాలు - సంపూర్ణ వివరణ . 

ప్రాణులకు వర్షఋతువులో ఎక్కువ రోగాలు వస్తాయి. కనుక పరిసరాల్లో దొరికే ఎక్కువ మూలికలు వినాయకుని పూజలో ఉపయోగిస్తాము. ఇది మన పూర్వీకుల ముందు చూపు. ఇప్పుడు మీకు ఆయా మూలికల ఉపయోగాలు సంపూర్ణంగా వివరిస్తాను. 

మాచిపత్రి  - 

దీని ఆకులు , కొమ్మలు మంచి సువాసన కలిగి ఉండును. స్త్రీలు జడలలో ధరిస్తారు. ఇది వేడిచేయు స్వభావం కలిగి ఉండును. దీని నూనెని తీసుకున్న యెడల అన్నము బాగుగా జీర్ణం అగును. ఆకలి పుట్టించును . మనోవైకల్యము , అలసట నివారించును. 

పెద్ద ములక  - 

దగ్గు , ఆయాసములను తగ్గించును . ఆకలిని పుట్టించును . మూత్రమును జారీ అగునట్లు చేయును . కండరములుకు పుష్టిని ఇచ్చును . వీర్యవృద్ధిని , పుష్టిని ఇచ్చును . పెద్దములక వేసి కాచిన ఆముదం తాగించిన గృదసీవాతం తగ్గును . నేల ములక వేరు రసం , తేనె కలిపి సేవించిన దగ్గు తగ్గును. 
 
 *  మారేడు  - 

ఈ చెట్టు అన్ని భాగాలు ఔషధాలుగా ఉపయోగపడును . దీని కాయలలోని గుజ్జు అతిసారరోగము అనగా డయేరియాని తగ్గించుటలో ఉపయోగపడును. విషాన్ని హరించుటకు కూడా ఉపయోగపడును. దీని ఆకుల రసం మధుమేహవ్యాధి నివారణలో ఉపయోగపడును. మారేడు గుజ్జు కాంజికములో నానబెట్టి సేవించవలెను . జఠరాగ్ని వృద్దిపొందించును . మొలలనొప్పితో బాధపడువారు మారేడు వేరు పైన పట్ట ( బెరడు ) చితగ్గొట్టి నీటిలో వేసి కషాయం కాచి ఆ కషాయం ఒక పెద్ద వెడల్పాటి పళ్లెము నందు పోసి మొలల ప్రాంతం తగులునట్లు రోగిని అందులో కుర్చోపెట్టవలెను దీనివల్ల మొలల నొప్పి నివారణ అగును. 
 
 *  గరిక  - 

ఈ జాతి మొక్క ఎక్కువుగా మొండిజాతి కలుపు మొక్కగా పేరుపొందింది. ఇది మంచి క్రిమిసంహారిణి . అంటురోగాల నుండి కాపాడును . చర్మరోగాలు నివారణలో ఉపయోగపడును. రక్తపిత్తరోగం అనగా ముక్కు , నోరు మొదలగు రంధ్రాల నుండి రక్తం బయటకి వచ్చు సమస్య నివారణ అగును. గజ్జి , ఎగ్జీమా వంటి చర్మవ్యాధుల్లో ఇది ఉపయోగకారి . దీని రసం వాంతులు , విరేచనములు తగ్గించును . రక్తము కారు గాయాలకు దీని రసము ఉపయోగిస్తారు . దీని వేర్ల కషాయం గనేరియా వ్యాధిలో పై పూతకు వాడతారు . 
 
 *  నల్ల ఉమ్మెత్త  - 

ఇది ఉపవిషములలో చేరినది . తేలు మొదలగు విషజంతువుల విషానికి విరుగుడుగా పనిచేయును . దీని విత్తనాలు మత్తును కలిగించును. దీని ఆకుల నుండి ఉబ్బసం , కోరింతదగ్గు మొదలగు వ్యాధులను నయం చేయుటకు వాడతారు. కీళ్లనొప్పుల నివారణకు దీని ఆకుతో కాపడం పెడతారు . పాదరస శుద్ధిలో దీని ఆకును కూడా ఉపయోగిస్తారు. ఇది విషద్రవ్యం శుద్ది చేయకుండా , అనుభవం లేనిదే వాడరాదు. 
 
 *  రేగు  - 

ఈ వృక్షాలు భారతదేశం అంతటా లభ్యం అగును. హిమాలయాల్లో బదరీనాధ్ క్షేత్రం నందు ఈ వృక్షాల యొక్క వనం ఉండటం చేత ఈ క్షేత్రానికి బదరీ ( రేగు ) నాధ్ అని పేరు వచ్చింది. ఇది గొప్ప ఔషధ గుణములు కలిగి ఉన్నది . పిల్లలకు వచ్చు పూతనారోగము ( గృద భాగము పేలినట్లు అయ్యి వ్రణాలు ఏర్పడుట ) యందు రేగుచెక్క కషాయముతో ఆసనం శుద్ది చేయాలి . మొలల సమస్య ఉన్నవారు రేగుచెక్క కషాయములో కూర్చుండబెట్టాలి.వాతనొప్పులకు మునగచెక్క , రేగుచెక్కలను పులికడుగు ( బియ్యం కలిపిన నీళ్లను 2 రోజులపాటు నిలువ ఉంచినది ) కలిపి నూరి నొప్పుల భాగమున పట్టువేయవలెను . మూత్రములో రాళ్లు కరుగుటకు రేగు వేరు కషాయం నందు రేగు బెరడు చూర్ణం కలిపి తాగవలెను . రేగు వేరు పైన బెరడు మేకపాలతో కలిపి నూరి పూసిన మంగు తగ్గును. 
 
 *  ఉత్తరేణి  - 

దీనివేరుతో పళ్లు తోముకున్న దంతరోగాలు పోవును . దీని విత్తనాల చూర్ణం నశ్యముగా ముక్కులోకి పీల్చిన ముక్కు నుండి చీముకారుట తగ్గును. దీని ఆకుల రసం , దిరిసెన ఆకురసం కలిపి తాగించిన క్రిములు నశించును. తేనెటీగలు కుట్టినచోట దీని ఆకురసం పూయవలెను . 
 
 *  తులసి  - 
 
చిన్నపిల్లలో వచ్చు కఠినమైన దగ్గులకు ఇది అద్బుతముగా పనిచేయును . తేలు కుట్టినచోట తులసివేరుని పైనుంచి క్రిందికి పలుమార్లు తిప్పిన విషం దిగును .   వాతవ్యాధుల వలన దెబ్బతిన్న అవయవాలకు తులసిరసము పూసిన ఫలితం కనిపించును. ఆకురసం తలకు పట్టించి కొంచంసేపటి తరువాత తలస్నానం చేసిన పేలు చచ్చిపడిపోవును 
 
 *  మామిడి  - 
 
మామిడి చిగుళ్ల రసమును తేనెతో కలిపి తీసుకున్న పైత్యం హరించును . అతిసారమునకు చెట్టు బెరడులోని కండ నుండి రసం తీసి తాగించవలెను . మాంసం తినిన అది అరగనపుడు మామిడి టెంక రసము తాగవలెను . చేపలకూర జీర్ణం కానప్పుడు మామిడికాయ రసం తాగవలెను . మామిడి చెట్టు నుండి కారు జిగురు కాలిపగుళ్ళకు పూసిన కాలిపగుళ్లు తగ్గును. కంట వ్యాదులు అనగా డిప్తీరియా సమస్య నందు ఈ పండ్ల రసం పనిచేయును . దీని ఆకుల కషాయంలో తేనె కలిపి సేవించిన గొంతు పూడుకుపోయే సమస్య నివారణ అగును. 
 
 *  గన్నేరు  - 
 
దీని పువ్వులు వివిధ రంగుల్లో పూస్తాయి. దీని బెరడు గుండెజబ్బులకు , మూత్రవ్యాధుల్లో ఉపయోగిస్తారు . దీని వేరు అరగదీసి వచ్చిన గంధమును చర్మవ్యాదులలో , కుష్టు మొదలగు వాటికి పూస్తారు . చిత్రమూలం , గన్నేరు కలిపి దంచి గడ్డలపైన లేపనం చేసిన పక్వానికి వచ్చి గడ్డలు పగులును. 
 
 *  రత్నపురుష  - 
 
దీని సర్వాంగములు కషాయం కాచి వాడిన ఙ్ఞాపకశక్తి పెరుగును . జ్వరం తగ్గించును . నరాల బలహీనత తగ్గించును . క్రిములను హరించునదిగా పనిచేయును . వ్రణములను హరించును . 
 
 *  దానిమ్మ  - 
 
ముక్కు నుంచి రక్తం కారుచున్న దానిమ్మ పువ్వు రసం ముక్కులో పిండిన రక్తం కారటం ఆగును. విరేచనాలలో రక్తం పడుచున్న దానిమ్మ చెక్క , కొడిశ విత్తనాల కషాయం తేనేతో కలిపి తాగవలెను . నోరు రుచి తెలియని సమస్య యందు దానిమ్మ పండ్ల రసము నందు తేనె కలిపి తాగిన నోటికి రుచి తెలియును  . నోటి నుంచి రక్తం పడుచున్న దానిమ్మ బెరడు చూర్ణం నందు పంచదార కలిపి సేవించవలెను . దానిమ్మ వేఱు కషాయం క్రిములను చంపును. 
 
 *  దేవదారు  - 
 
దీని ఆకు క్రిమి సంహారముగా పనిచేయును . దీని బెరడు జ్వరములను , విరేచనాలను కట్టును . 
 
 *  మరువము  - 
 
ఇది సుగంధద్రవ్యపు మొక్క . దీని ఆకులు కీళ్లనొప్పి తగ్గించుటకు ఉపయోగపడును. ఇది ఉష్ణం చేయు స్వభావం కలిగినది . వాతమును , కఫమును హరించును . తేలు , జర్రి వంటి కీటకాల విషాన్ని హరించును . విషజ్వరాలను హరించును . హుద్రోగము , శ్వాస , శోషరోగము హరించును .దీనిని పసుపుతో కలిపి పైపూతగా వాడిన గజ్జి , చిడుము వంటి చర్మరోగాలు నయం అగును. 
 
 *  వావిలి  - 
 
వావిలి వేరును నేతిలో నూరి గుడ్డలో వేసి రసము తీసి ఆ రసమును ముక్కులో పిండిన గండమాలలు తగ్గును. వావిలాకు వేసి కాచిన నీటిలో స్నానం చేయించిన ప్రసవానంతరం స్త్రీకి కలిగిన ఒళ్ళు నొప్పులు తగ్గును.  చెవిలో చీముకారుతున్న వావిలాకు రసము , సైన్ధవ లవణము , బెల్లము తో తయారయిన నూనెని చెవిలో వేసిన చెవిలో కారు చీము తగ్గును.  పొట్లపాము , కట్లపురుగు కరిచిన వావిలి వేరు నీటితో నూరి తాగించిన విషము హరించును . 
 
 *  జాజి పత్రం  - 
 
చెవిలో నుంచి చీము కారుతున్నచో జాజి పువ్వుల ఆకులు నూరి కొంచం వెచ్చచేసి చెవిలో 4 నుంచి 5 చుక్కలు పిండిన చీముకారుట ఆగిపోయి చెవిలో కురుపు నయం అగును. స్త్రీలలో ఋతుచక్రం సరిగ్గా లేనపుడు దీని పువ్వులు మెత్తగా నూరి "కలి " తో కలిపి తాగించవలెను . 
 
 *  కామంచి  - 
 
దీని ఆకు ముద్దగా నూరి కుష్ఠురోగపు మచ్చలపై వేసి కట్టిన మచ్చలు నయం అగును. ఉబ్బు రోగము నందు దీని ఆకును కూరగా వండిపెట్టవలెను . ఉరుస్తంభ ( తొడలు పట్టుకుపోయే సమస్య ) రోగము నందు దీని ఆకును నీళ్లతో ఉడికించి నూనెతో వేయించి తినవలెను . ఎలుక విషమునకు దీని ఆకురసం పైకి రాసి లోపలికి తాగుటకు ఇవ్వవలెను . దీని ఆకురసము చెవిలో చుక్కలుగా వేసిన చీము , నొప్పి తగ్గును. 
 
 *  జమ్మి  - 
 
దీనిని భస్మప్రక్రియలలో వాడతారు . దంతములు సులభముగ ఊడతీయుటకు దీని రసం 5 చుక్కలు వేసిన నొప్పి తగ్గి సులభముగా ఉడును . 
 
 *  రావి  - 
 
స్త్రీ , పురుషుల్లో సంతానోత్పత్తికి అద్బుతముగా పనిచేయును . దీని ఆకులు , పండ్లు , బెరడు అన్ని కూడా జీర్ణశక్తిని పెంపొందించుటకు ఉపయోగపడును . చర్మవ్యాధులకు , సుఖవ్యాధులలో మంచీగా పనిచేయును . దీని పాలు పాదాల పగుళ్ళకు , చర్మపు పగుళ్లకు బాగుగా పనిచేయును . 
 
 *  తెల్ల మద్ది  - 
 
దీని బెరడు గుండె జబ్బులలో పనిచేయును . రక్తపిత్త రోగము నందు దీని కషాయం వాడవచ్చు . వ్రణములపైన దీని ఆకులు వేసి కట్టు కట్టిన త్వరగా మానును . క్షయ దగ్గు నందు మద్ది బెరడు చూర్ణం , అడ్డసరపు ఆకు , తేనె కలిపి తీసికొనవలెను . 
 
 * జిల్లేడు   - 
 
వాతమును హరించు ముఖ్య ద్రవ్యములలో ఇది ఒకటి ప్రబలమగు క్రిమిరోగములను , దుష్టవ్రణములను , శ్వాస , కాసలను హరించును . అండవృద్ధి సమస్యకు జిల్లేడు వేరు పైపొట్టు " కలి" తో నూరి పూతగా రాసిన అండవృద్ధి నయం అగును. బోదకాలుకు కూడా ఇదేవిధముగా చేయవలెను . చర్మరోగాలకు జిల్లేడు ఆకు రసము , ఆవనూనె , పసుపు కలిపి రాయవలెను . తేలు కుట్టిన ప్రదేశములో జిల్లేడు ఆకు మెత్తగా నూరి కట్టి గుగ్గిలం పొగవేసిన విషము విరుగును. చెంప వాపులకు జిల్లేడు ఆకు పైన ఆముదము రాసి వేడి చూపించి ఆ ఆకును వాపులపైన అణిచిపెట్టి కట్టిన వాపులు తగ్గును.  
 
 
పైన చెప్పిన 21 రకాల మూలికలు వినాయక చవితి నాడు పుజ యందు ఉపయోగించు అత్యంత ప్రధాన మూలికలు . వీటిని బాగుగా గమనించిన వర్షాకాలం నందు వచ్చు వ్యాధులలో ఉపయోగించ తగిన మూలికలుగా గమనించవచ్చు  . మన పూర్వీకుల జ్ఞానానికి , ముందుచూపుకు మనం కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 
 
ఈ మూలికలతో మరెన్నొ గొప్పగొప్ప ఆయుర్వేద యోగాలు కలవు . వాటన్నింటిని ఈ పోస్టు నందు వివరించటం సాధ్యం కాదు కారణం పోస్టు పెద్దగా అవ్వడం మూలాన వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం నా గ్రంథాలలో ఇవ్వడం జరిగినది. 
 
    గమనిక  -
 
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
 
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
 
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
 
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
 
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
 
కాళహస్తి వేంకటేశ్వరరావు 
9885030034 
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna