Online Puja Services

ధర్మపురి క్షేత్ర మహిమ

18.116.63.174
భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస..
 
తెలంగాణ రాష్ట్రంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ధర్మపురి.. దక్షణ భారతదేశంలో ఉన్న నవ నరసింహ క్షేత్రాలలో ఇది ఒకటి. గోదావరి నదీతీరాన ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ నరసింహ స్వామి లక్ష్మి సమేతంగా యోగసినుడై యోగానంద నరసింహునిగా కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 

ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించడం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. ఈ దేవాలయం వెనుక ఉన్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు ఇక్కడి ప్రాంతాన్ని పాలించడం వలన దీనికి ధర్మపురి అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దైవమైన నరసింహుడిని క్షేత్రపాలకుడైన ఆజనేయుడు అష్టదిగ్భందన చేసి ఉంటాడు. అందువల్లే ఈ క్షేత్రం భూత, ప్రేత, పిశాచాల నుంచి బాధింపబడే వారికి ఉపశమనం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం.. "భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస... ద్రుష్టసంహార నరసింహ దురితదూర" అని స్మరిస్తూ భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. 
 
మరొక స్థల పురాణం ప్రకారం

శ్రీ మంత్తా దేవి భర్త శాప కారణం గా పాము శరీరం లోకి వచ్చింది.. ధర్మపురి వస్తే వచ్చిన కారణం గా నిజ శరీరం పొందాడు..అది చూసి నవ్విన కొందరికోసం దేవి ఇసుక తో స్తంభం చేసింది..ఇప్పటికి కూడా ఆ స్తంభాన్ని మనం చూడవచ్చు..

ఇక్కడ ఆలయం లో అరుదుగా కనించే యమా దర్శనం..బ్రహ్మ దేవుడి దర్శనము పొందవచ్చు.. సాక్ష్యత్తు శ్రీ రాముడు చేసిన ఇసుక లింగాన్ని మనం ఇక్కడ నేటికి చూడవచ్చు..
 
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మూల విరాట్ గా ఉండే ఈ ఆలయం లో పక్కన ఉన్న ఉగ్ర నరసింహ స్వామి ఆలయం కూడా ఉంది..స్వామి పైన దశావతార చరిత్ర విగ్రహాల రూపం లో ఉండటం గమనిస్తారు..
 
ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత స్వామి వారి ఆలయం బైట ఉన్న రాయి పైన ఏదైనా సంకల్పం చేసుకొని ఒక్క కాయిన్ ఉంచితే అది అలాగే నిలబడితే మనం అనుకున్న సంకల్పం నెరవేరుతుంది..
 
పిల్లల కోసం చూసే దంపతులు స్వామి వారి దర్శనము చేసుకోవడం ఉత్తమం..

మరిన్ని ప్రత్యేకతలు :

♦ ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది, సాక్ష్యాత్తు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది.
♦ ఇదే ఆలయంలో ఉన్న ఉగ్రనరసింహ స్వామిని కూడా భక్తులు దర్శించుకుంటారు.
♦ ఈ ఆలయానికి అతి సమీపంలో రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడు కాబట్టి దీనికి రామలింగేశ్వర లింగం అని పేరు వచ్చిందని పురాణాలూ చెబుతున్నాయి. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వారికీ పునర్జన్మ ఉండదని చెబుతారు.
♦ ఇక్కడ వందల ఏళ్లనాటి ఇసుక స్తంభం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
♦ ఇక్కడి భక్తులు యమధర్మరాజును కూడా దర్శించుకుంటారు. అందువల్లే ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదనే నానుడి ఉంది.
♦ ధర్మపురి క్షేత్రం హైదరాబాద్‌ నగరానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో, కరీంనగ ర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.
 
- శ్రీనివాస్ గుప్తా వనమా 
 
 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha