Online Puja Services

దుఃఖాలని నాశనం చేసి, ఐశ్వర్యాన్నిచ్చే గణేశ నోము

52.14.240.178

దుఃఖాలని నాశనం చేసి, ఐశ్వర్యాన్నిచ్చే గణేశ నోము !!
- లక్ష్మి రమణ 

 గణేశుడంటే కేవలం విఘ్నాలని నాశనం చేసే గణనాయకుడు ముందుగా గుర్తొస్తారు. కానీ ఆయన అపారమైన కృప ఎలాంటిది అంటే, విఘనాలని నాశనం చేయడమ్ మాత్రమే కాదు, ఆయన అనుగ్రహం చేత దుఃఖాలు సమూలంగా తొలగిపోతాయి .  అలా దుఃఖాలు తొలగి పోవడానికి ఆ గణనాధుని ఈ పూజని మహిళలు చేసుకుంటే చక్కని పొందవచ్చు . ఈ పూజా విధిని నిర్వహించిన ఒక పుణ్యవతి కథ ని ఇక్కడ తెలుసుకుందాం . 

పూర్వం ఒక ఊరిలో ఒక పుణ్యవతి ఉండేది.  ఆమె గొప్ప గణేశుని భక్తురాలు. అయితే,  గత జన్మలో గణేశుని నోము నోచి, వ్రతమును నియమాను సారము ముగించకుండా, నియమోల్లంఘనం చేసింది .  అందువల్ల ఆమెకి ప్రస్తుత జన్మలో అకారణ దుఃఖం సంప్రాప్తించింది. తినడానికి , ఉండటానికి , సౌభాగ్యానికి ఈ జన్మలో ఆ గణేశుని దయవలన ఏ లోటూ లేదు .  అయినా సరే, అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది . ఆమెకి అలా దుఃఖం పొంగుకొని వచ్చేది .  

రోజూ కడుపారా తిన్నా, ఎంతటి వేడుకలో పాల్గొన్నా ఆమెకు ఏమి తోచేదికాదు.  స్థిమితం కలిగేది కాదు.  దు:ఖం ముంచుకొస్తూ ఉండేది.  అందువల్ల ఒక్కత్తే కూర్చుని ఎడుస్తుండేది.  అలా దుఃఖించడం అశుభమని తోటి మగువలందరూ ఆమెను దూషిస్తూ వుండేవారు.   

దాంతో ఆమె అరణ్యానికి పోయి దుఃఖించసాగింది. అటుగా వచ్చిన ఆదిదంపతులు కారణం తెలియకుండా దు:ఖిస్తున్న ఆమెను చూసి, కారణం లేకుండానే ఏడవడం కదా నీ సమస్య. కారణం సృష్టించుకొని ఏడువు అని చెప్పారు . ఈ ఉపాయం బాగుందనుకొని ఆమె  ఒక పామును తీసుకుపోయి, తన కొడుకు పడుకున్న పక్కమీద పడేసింది. అది కరచి  కొడుకు బాధపడితే, బాగా ఏడవాలి అనుకుంది . అప్పుడు సరైన కారణం ఉంటుంది కనుక తననెవరూ  నిందించారు అని భావించింది. కానీ, ఆమె కొడుకుమీద విసిరిన పాము గణేశుని కృప వలన అతనికి  బంగారు మొలత్రాడు అయ్యింది. ఆమెకున్న ఆ దుఃఖించాలనే కోరిక కన్నప్రేమని కూడా పక్కనే    

నా ఏడుపు కారణం దొరకలేదని అడవికి పోయి ఏడవసాగింది.  పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై ఏమి జరిగినది అని ప్రశ్నించారు. నా కొడుకు పైన పాము విశిరాను.  అది కాస్తా నా బిడ్డ కి బంగారు మొలత్రాడై పోయినది.  అందువల్లనా ఏడుపుకు కారణం దొరకలేదని భోరుమని విలపించసాగింది . సరే అని  పార్వతి పరమేశ్వరులు ఆమెకు ఒక తేలును ఇచ్చి “దానిని నీ మనుమరాలు  బొట్టు పెట్టెలో పెట్టు.  పెట్టె తెరవగానే  నీ మనుమరాలిని  తేలు  కుడుతుంది.  ఆమె ఏడ్చినప్పుడు  నువ్వు కూడా  ఆ కారణంగా  ఏడువవచ్చు  అన్నారు .  ఆ ప్రకారం  ఆమె ఆ తేలును బొట్టు పెట్టెలో పెట్టింది .  మనుమరాలు  ఆ పెట్టెని  తెరవగానే  ఆ తేలు  గణేశుని కృపతో బంగారు బొట్టు చుక్కగా మారిపోయింది .  ఈ పర్యాయం  కూడా తన ఏడుపుకు కారణం దొరకలేదని అడవికి వెళ్లి రోదించసాగింది.  

పార్వతి పరమేశ్వరులు తిరిగి ప్రత్యక్షమై సంగతి తెలుసుకున్నారు.  పిల్లిని ఇచ్చి దానిని ఇంటికి తీసుకువెళ్ళి చంపి, ఆ  కారణంగా ఏడువ వచ్చు అని పరిష్కారం చెప్పారు.  ఆ ప్రకారం ఆ పిల్లిని ఇంటికి తీసుకుని పోయి చంపి తాను ఎడువడానికి ఇరుగు పొరుగు వారిని పిలిచింది.  తీరా ఆ ఇరుగు పొరుగు వారు ఇంటికి రాగా,  గణాధిపతి కృపవల్ల ఆ పిల్లి కాస్తా బంగారు పిల్లిగా మారి పోయింది. ఇరుగు పొరుగు వారంతా నవ్వుకుని వెళ్లిపోయారు .  

తిరిగి ఏమి చెయ్యాలో తోచక , ఏడవడానికి కారణం వెతుక్కుంటూ ఉన్న  ఆమె చెంతకు పార్వతీ పరమేశ్వరులు వచ్చి, అసలు పరిహారాన్ని ఇలా ఉపదేశించారు. నువ్వు నీ గత జన్మలో గణేషుని నోమును నోచావు. అందువల్ల నీకు అపారమైన గణేశుని కృప లభించింది . దుఃఖమే నీ జీవితంలో లేదు . కానీ నీకు ఇంతటి దుఃఖించాలనే కోరికకి కారణము ఆ నోముని  ఉల్లంఘించడమే ! కాబట్టి వెంటనే నువ్వు గణేషుని నోమును నోచుకోవడమే నీ పరిస్థితికి పరిష్కార మార్గం అని చెప్పారు.  

ఆమాటలు శ్రద్ధగా ఆలకించిన ఆ పుణ్యవతి  గణేషుని నోమును నోచుకున్నది.  దాని ప్రభావం వలన ఆమెకు దు:ఖం తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించింది.  

గణేశుని యధా శక్తి పూజించి, ఈ కథని చెప్పుకొని గణేశుని నోముని నోచుకోవాలి . ఇంటి ఇల్లాలు ఈ నోముని నోచుకోవడం వలన ఇంటికి శుభాలు , ఐశ్వర్యం , యజమానికి సర్వకార్య విజయం సిద్ధిస్తాయి . 

ఉద్యాపన:  కొత్త మూకుడులో అయిదు గిద్దల నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి.  స్వయం పాకంను దక్షిణ తామ్బూలాడులతో శివాలయంలో నంది దగ్గర పెట్టాలి.  

గణేశా కటాక్ష సిద్ధిరస్తు !! శుభం !!

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi