మంత్రం బీజాక్షరాలు సరిగ్గా పలకాలి

3.236.212.116

ఓం శ్రీ మాత్రే నమః 

"సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే|  శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే||"

ఒకానొక సమయంలో...
ఒక మహానుభావుడు తన భార్య ఆరోగ్యం కోసం
"చండీ" పారాయణం చేయాలని నిర్ణయించాడు...

🌷అదే సమయంలో నారదుడు సాయంత్రం సమయంలో అటువైపు వెళుతూ ఆ ఇంటి ముందుకి రాగానే... 
🌷ఆ మహానుభావుడు..ఆమహర్షి ని లోనికి
సాదరంగా ఆహ్వానించి..భోజన తాంబూలాలు ఇచ్చి..
ఆ రాత్రి అక్కడే విశ్రమించమని కోరారు..

🌷అందుకు ఆ నారద మహర్షి గారు కూడా సరే అనీ శయనించారు ..
ఉదయం ఆ మహానుభావుడు లేచి తన సంధ్య వందనం అనుష్ఠానాలు.. అనంతరం "చండీ సప్తశతి" పారాయణం ప్రారంభం చేసారు.

🌷నారదుడు చూసి ఏమిటి నాయనా అని అడగ్గా...అయ్యా నా భార్య ఆరోగ్యం కోసం 
"చండీ పారాయణం" చేయాలని నిర్ణయించాను అనగా...

🌷మహర్షి సంతోషించి..సరే.అయితే...40 వ రోజున నేనే వచ్చి మరుసటి రోజు
నీ చేతితో పూర్ణాహుతి చేయిస్తా... అని చెప్పి వెళ్ళిపోయాడు..

🌷అయితే.. ఇతను..ప్రతీ రోజూ.. "చండీ సప్తశతి" పారాయణం చేస్తూ ఉండగా...
అతని భార్య ఆరోగ్యం ఇంకా క్షీణిస్తున్నది...
అతనికి అర్ధం కాలేదు..

🌷చివరి రోజు..నారదుడు వచ్చి ఏమి నాయనా నీ ధర్మ పత్ని కి ఎలా ఉంది ఆరోగ్యం అనగా...

🌷స్వామీ నా భార్య ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ వచ్చింది...ఏమిటో ఆ జగన్మాతకి నాపై కనికరం లేదేమో అని భోరున విలపించాడు.

🌷నారద మహర్షి గారికి అనుమానం వచ్చి ..
నాయన ఒకసారి పారాయణం చేయి... అన్నారు.

🌷ఇతను సరే అనీ.. సప్తశతి పారాయణం ప్రారంభం చేసాడు..అయితే..దానిలో, ఒక శ్లోకం.
      మమ భార్యాం.. రక్షతు..భైరవి..
అని...ఉంటుంది.
🌷కానీ ఇతను.. అక్షరం తప్పు పలికి...
           మమ భార్యాం. భక్షతు..భైరవి..
అని..పలుకుతున్నాడు. ఇక ఏముంది... 

🌷అప్పుడు ఆ నారదుడు...నాయన... ఒకసారి నీపాఠం సరి చేసుకుని..
🌷ఈ రోజు పూర్తిగా 40 సార్లు ..సప్తశతిపారాయణం జాగ్రత్త గా చేయి...నాయన... అని సెలవు ఇచ్చాడు..

🌷వెంటనే అతను తేరుకుని.. మంత్రం చాలా జాగ్రత్తగా పారాయణం పూర్తి చేసాడు. 
ఈసారి "మమ భార్యాం రక్షతు భైరవి" అని కరక్టు గా పలుకుతూ..చేయసాగాడు..

🌷ఒక్కొక్క పారాయణం పూర్తి అయ్యే లోపు తన భార్యకు మంచి ఆరోగ్యం వస్తూ ఉన్నది...
40 సార్లు అయ్యే లోపు మంచి ఫలితం చూపింది...

🚩తెలిసి చేసినా...తెలియక చేసినా...ఫలితం ఒకలాగే ఉంటుంది
⚜️🚩కావున..
👉మంత్రం.....
👉జపం.....
👉పారాయణం..
👉బీజాక్షరాలు...
సరిగ్గా పలకాలి..

🌷గురువు అనేవారు ఉండాలి...
గురుముఖతా చేయాలి...

🚩"చండి' అనే పదం "చండ" అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో చండ అంటే "ఛేదించగల" అని అర్థం.
🚩శుద్ధ "బ్రహ్మశక్తి" "జ్ఞాన" "క్రియా" శక్తుల మూడింటికి శ్రీమహాకాళీ, శ్రీమహాలక్ష్మి, శ్రీమహా సరస్వతి, అనే నామాంతరాలు రూపాంతరాలు.
ఆ ముగ్గురి సమిష్ఠి రూపమే "శ్రీచండి".🙏

                🌷🌷 ఓం శ్రీ మాత్రే నమః 🌷

- సత్య వాడపల్లి 

Quote of the day

The Way is basically perfect. It doesn't require perfecting.…

__________Bodhidharma