Online Puja Services

సమస్త పాపాల నుండీ రక్షించి ఆరోగ్యాన్నిచ్చే రుద్రాక్ష ధారణ.

18.225.255.134

సమస్త పాపాల నుండీ రక్షించి ఆరోగ్యాన్నిచ్చే రుద్రాక్ష ధారణ. 
- లక్ష్మి రమణ 

పరమేశ్వర స్వరూపాలైన రుద్రాక్షలు శివ భక్తులను తరింపజేస్తాయి ఈ రుద్రాక్షలు ఏకముఖం నుంచి 16 ముఖాలు దాకా ఉంటాయి. వీటిలో శ్రేష్టమైనవి రెండు రకాలు.  మొదటిది ఏకముఖి రుద్రాక్ష.  రెండవది పంచముఖి రుద్రాక్ష.  వీటిని ధరించేవారు శివలోకాన్ని చేరి, శివ సన్నిధిలో ఆనందంగా కాలం గడుపుతారు.  ఏకముఖి రుద్రాక్షలు అరుదుగా లభిస్తాయి.  కానీ పంచముఖి రుద్రాక్షలు సాధారణంగా మనకి దొరుకుతాయి.  వీటిల్ని అందరూ ధరించవచ్చు. అని స్కాంద పురాణం చెబుతోంది . వైద్యశాస్త్ర ప్రకారం రుద్రాక్షలు బ్లడ్ ప్రషర్ ని అదుపులో ఉంచుతాయి . క్షణికమైన ఆవేశాన్ని తగ్గించి మానసిక శాంతిని చేకూరుస్తాయి .  

రుద్రాక్ష పంచముఖస్తథా చైకముఖః స్మృతః 
యేధారయంత్యేక ముఖం రుద్రాక్ష మనిశం నరాః 
రుద్రలోకం చ గచ్ఛంతి మోదంతే రుద్ర సంవిదే 
జపస్తపః  క్రియా యోగః స్నానం దానార్చనాదికం 
క్రియతే యచ్చుభం, కర్మ హ్యనంతం చాక్షధారయేత్
 

జపము, తపము, క్రియ, యోగము, స్నానము, దానము, అర్చన అభిషేకము ఇటువంటి కర్మలన్నీ చేస్తే ఎంతటి పుణ్యము వస్తుందో , కేవలము రుద్రాక్షని ధరించడం వలన  అంతటి పుణ్యము లభిస్తుంది. కుక్క మెడలో రుద్రాక్షని కట్టినా, అది ఆ కుక్కని కూడా తరింపజేస్తుంది.  రుద్రాక్ష మహత్యం అటువంటిది.  రుద్రాక్ష ధారణ వల్ల పాపం నశిస్తుంది.  ఈ విధంగా రుద్రాక్ష గొప్పతనాన్ని తెలుసుకుని  వీలున్నటువంటి రుద్రాక్షని మెడలో ధరించగలగడం శుభప్రదం . 

సర్వవ్యాధి హరం చైవ సదారోగ్యమవాప్నుయాత్ | 
మద్యం మాంసం చ లశునం పలాణ్ణుమ్ మూలమేవ చ | 
శ్లేష్మాత్మకం విడ్వరాహం భక్షయన్వర్జ ఏతత్తః || 

సర్వాశ్రమాణాం వర్ణానాం స్త్రీ శూద్రాణాం శివాఖ్యయా|  
ధార్యా: సదైవ రుద్రాక్షా యతీనాం ప్రణవేన హి || 

దివాబిభ్రద్రాత్రికృతౌ రాత్రౌ బిభ్రద్దివాకృతై: | 
ప్రాతరుమధ్యాహ్నసాసాయాహ్నే బిభ్రత్తత్పూర్వపాతకై:|| 

రుద్రాక్ష ధారణా ఎల్లవేళలా ఆరోగ్యాన్నిస్తుంది. వ్యాధుల్ని పోగొడుతుంది . అయితే, రుద్రాక్ష ధరించేవారు కొన్ని నియమాలని తప్పక పాటించాలి . మద్యం, మాంసం, వెల్లుల్లి, ఉల్లి, ముల్లంగి, పంది మాంసం, పుట్టగొడుగులు తినకూడదు . ఇవి స్వీకరించే అలవాటు ఉన్నవారు, అవి ఆహారంగా తీసుకున్నరోజున రుద్రాక్షని ధరించకూడదు. ఆ తర్వాతి రోజు శుచి అయ్యాక ధరించవచ్చు . రుద్రాక్షలని శివనామాన్ని స్మరిస్తూ ధరించాలి . పగటిపూట ధరిస్తే, రాత్రి చేసిన పాపాలు పోతాయి . రాత్రి ధరిస్తే, పగటి పూట ధరిస్తే, రాత్రి చేసిన పాపాలు పోతాయి . 

శుభం భూయాత్ !! 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya