శివాలయంలో సోమ సూత్ర ప్రదిక్షణ చేశారంటే

54.174.225.82

శివాలయంలో సోమ సూత్ర ప్రదిక్షణ చేశారంటే, పదివేల ప్రదిక్షణలు చేసిన ఫలం !
-సేకరణ : లక్ష్మి రమణ  

శివాలయంలో ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శివుని దర్శనానికి ఆలయానికి వెళ్ళగానే ముందుగా ప్రదక్షిణ చేశాకే , స్వామి దర్శనానికి వెళుతుంటాం . అయితే, మామూలుగా ఆలయాల్లో చేసే ప్రదక్షణాలకీ , చండీశ్వరునికి చేసే ప్రదక్షిణలకీ తేడా ఉంది . ఆ ప్రదక్షిణాలు ఇలా చేశారంటే, ఒక్కొక్క ప్రదక్షిణా పదివేల ప్రదక్షిణలతో సమానమని లింగపురాణం చెబుతోంది . ఆ విధి విధానాలు ఇలా ఉన్నాయి . 
 
 ఇతర దేవతల ఆలయాల్లో చేసిన విధంగానే, శివాలయాలలో కూడా  గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ లేదా సోమ సూత్ర ప్రదిక్షణ అంటారు. ఈ ప్రదక్షిణల విధానం ఇదీ అని లింగ పురాణంలో వివరించారు. ఈ ప్రదక్షిణ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయో కూడా  విశదీకరించారు. శివాలయంలో ప్రదక్షిణ విషయానికి వస్తే, ధజస్తంభం వద్ద ప్రదక్షిణ మొదలు పెట్టి సోమసూత్రం వరకు అంటే చండీశ్వరుని వరకు వెళ్ళి, మళ్ళీ తిరిగి వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వరకు వెళ్ళాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ చేసినట్లవుతుంది.
 
అంటే, ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణ మొదలు పెట్టి శివుడిని అభిషేకించిన జలం బయటకు వెళ్ళే స్ధలం వరకు అన్నమాట. అక్కడే చండీశ్వరుడు కొలువై ఉంటాడు. ఆయన వరకు వెళ్ళి తిరిగి ద్వజస్థంభం వరకు చేరుకోవాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్లు లెక్క. ఈ విధం చేసే ప్రదక్షిణను చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణమని అని పిలుస్తారు.
 
శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు.  ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలము సోమసూత్రం నుండి బయటకి వెళుతుంది .  అంతేకాక, అక్కడ ప్రధమగణాలు కొలువై ఉంటారు.  ఇలా చేసే ప్రదక్షిణం ఒక్కొక్కటీ  పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగా పురాణం చెబుతుంది . 
 
ప్రదక్షిణం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించాలి.


యానికాని చపాపాని జన్మాంతరకృతానిచ..
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే..
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ;
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల..
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ..
తస్మాత్కారుణ్య భావేన
 రక్ష రక్ష మహేశ్వర… 

అంటూ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మనస్సులో అనుకోవాలి.
 
శివాలయంలో ఎప్పుడూ కూడా  నందికి, శివునికి మధ్యలో నడవకూడదు. నంది చూపులు నిరంతరం శివుని మీదే ఉంటాయి. ఆయన అనుమతి లేకుండా అసలు శివ దర్శనానికి వెళ్లకూడదంటారు . నందీశ్వరుని కొమ్ముల మధ్యనుండి శివదర్శనాన్ని తప్పకుండా చేసుకోవాలి .  అటువంటి సమయంలో మన మనస్సులోని కోటికని నందీశ్వరుని చెవిలో చెప్పాలి . 
 
శివాలయంలో చాలా మంది భక్తులు గర్భ గుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తుంటారు. అలా చేయకూడదు. ఇక ఇదేవిధంగా విగ్రహానికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా ఏ దేవత దర్శనం చేయకూడదు ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి వాటిని వాటి శక్తి మనం భరించలేం కనుక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలి

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya