Online Puja Services

కొన్ని అద్భుతాలకు సైంటిఫిక్ రీజన్ ఉండదు .

3.133.160.156

కొన్ని అద్భుతాలకు సైంటిఫిక్ రీజన్ ఉండదు . వెతికినా దొరకదు .
- లక్ష్మి రమణ 

కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగించి అద్భుతం అని నోటితో అనిపిస్తాయి .  వాటికి సైంటిఫిక్ రీజన్ ఉండదు. భగవంతుని కృపకి, లీలా విలాసానికి సైంటిఫిక్ రీజన్ వెతకడం  ఒక మూర్ఘత్వం అని మూర్ఘత్వమే ఆశ్చర్యపోయేలా వస్తుంది . అటువంటి విశేషాలు నిరూపించడం కేరళ పద్మనాభస్వామికి కొత్తేమి కాదు . ఇది నాగబంధనం గురించిన ఉదంతం కాదు అంతకు మించిన దైవలీల . 

సముద్రం అంచున ఉన్న జిల్లా కేరళ. ఒకసారి తీవ్రమైన వర్షాలు ఆ రాష్టాన్ని ముంచెత్తాయి.  కేరళలోని ఎన్నో జిల్లాలు ఆ వరదల్లో నానాపాట్లూ పడుతూ జలదిగ్బంధనంలో చిక్కి అల్లల్లాడాయి. అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోను వరదలు వచ్చాయి. స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్ధం నిండిపోయింది, ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు నీటిలో పూర్తిగా మునిగిపోయింది. దాంతో మూడు రోజుల పాటు స్వామి వారి ఆలయం తెరువలేదు. నిత్య పూజలు జరుగలేదు. 

అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతి రోజూ దేవతలు పుజిస్తారట. అర్చక స్వాములు ఆలయాన్ని తెరువక ముందే దేవతలు వచ్చి స్వామి వారిని సేవిస్తారట. ఇదొక్కటే విశేషం కాదు , అనంత పద్మనాభ స్వామి వారి మూల మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది. 

 కేరళని ముంచెత్తే వర్షాలు తిరువనంతపురాన్ని కూడా ముంచెత్తాయి.  కేరళలోని ప్రజలకి  ఒకటే ఆతృత, ఈ వరదకి ఒకవేళ ఆ అనంతపద్మనాభుడు మునిగిపోయారా ? స్వామికి నీటిమట్టం ఎంతవరకూ వచ్చింది ? అని తిరువనంతపుర ప్రజలు ఒక రకంగా భయాందోళలను పొందారు. దానికి తోడు ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట.  

సరే, ఆ విధంగా మూడు రోజులు గడిచాయి. ఆ  తరువాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూసి నిశ్చేష్టులయ్యారు. అసలు  స్వామి వారి గర్భాలయం లోనికి నీరు ప్రవేశించనే లేదు. ఎక్కడా తేమ కూడా లేదు. అప్పుడే కడిగి శుభ్రపరచినట్లుగా పొడిగా సుగంధ పరిమళాలతో సువాసనలతో అఖండలంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శనమిచ్చాయి.

అంతే కాదు, స్వామి వారికి అలంకరించిన పూల మాలలు తాజాగా ఉన్నాయి. బయట ధ్వజ స్థంభం కూడా పరి శుభ్రంగా తేమ లేకుండా ఉన్నాయి. స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాలలోను వరద నీరు ప్రవేశించలేదు. అది నిజంగా అద్భుతంకదా !

ఇటువంటి అద్భుతాలకు సైంటిఫిక్ రీజన్ ఉండదు. ఆ రీజన్ అబ్బురపడేలా భగవంతుని స్వచ్ఛమైన లీల మాత్రమే అక్కడ ప్రదర్శితం అవుతుంది . అద్భుతం అని అందరి చేతా అనిపిస్తుంది . 

శుభం . 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi