Online Puja Services

ఐశ్వర్యాలని ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం

3.142.197.198

ఐశ్వర్యాలని  ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం
- లక్ష్మి రమణ 

హయగ్రీవుడు విద్యా స్వరూపుడు . విద్యలని అనుగ్రహించే విష్ణు స్వరూపుడు. హయగ్రీవ అనే నామాన్ని పలికితే చాలు, అటువంటి వారి పాపాలన్నీ తొలగి, దరిద్రం దూరమై పోతుంది . గంగాప్రవాహంలాగా చదువులు అబ్బుతాయి. హయగ్రీవ నామం నిరంతరం స్మరణ చేసేవారికి  వైకుంఠ వాకిళ్ళు స్వాగతం పలుకుతాయి . ప్రతి బుధవారం, పౌర్ణమినాడు , విశేషించి హయగ్రీవ జయంతి అయిన శ్రావణ పౌర్ణమి నాడూ హయగ్రీవ స్తుతి చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు లభిస్తాయి. ఈ సమయాల్లో  మీరు చదవడంతో పాటు ఈ శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రంను  శ్లోకం పిల్లలు చదువుకునేలా వారికి నేర్పించండి . శ్రీ హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం.

ఐశ్వర్యాలని  ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం. 

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |

నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః  ||1||


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ .

తస్య నిస్సరతే వాణీ జహ్ను కన్యాప్రవాహవత్  ||2||


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిహిః |

విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః  ||3||


శ్లోక త్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం |

వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం . ||4||


ఇతి శ్రీమద్వాదిరాజ పూజ్య చరణ విరచిత

హయగ్రీవ సంపదా స్తోత్రం సంపూర్ణం ||


ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi