Online Puja Services

ఆంజనేయుడికి తమలపాకు పూజ ఎందుకు చేస్తాము?

52.14.150.55
ఆంజనేయుడికి తమలపాకు పూజ ఎందుకు చేస్తాము?
 
తమలపాకులో ఆరోగ్యం చేకూర్చే ఔషధ గుణాలున్నాయి. పరిమితంగా రోజూ తమలపాకు తింటే చాలా లాభాలున్నాయి. 
 
రక్తంలో చక్కెర విలువ తగ్గిస్తుంది.శరీరంలో కొవ్వు తగ్గుతుంది క్యాన్సర్ కారకాలను అదుపులో ఉంచుతుంది .వ్రణాలకు ఉపశమనం ఇస్తుంది 
ఆస్థమా వంటి ఉబ్బస  వ్యాధులను అదుపులో ఉంచుతుంది . మానసిక ఆందోళన తగ్గిస్తుంది .దంతాల పరిశుభ్రత చేకూరుస్తుంది బాక్టీరియా, వైరస్ లను అదుపులో ఉంచుతుంది. ఆంజనేయుడు ఆరోగ్యానికి మరో పేరు. ఆయనకు తమలపాకు పూజ చేసి ఆకులు భక్తులు సేవిస్తే స్వస్థత చేకూరుతుంది అని నమ్మకం.  వైద్య శాస్త్రం కూడా అదే చెప్తుంది. 
 
శ్లోకం 
 
*కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు*
 
హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
 
*1. విద్యా ప్రాప్తికి:-*
 
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
 
*2. ఉద్యోగ ప్రాప్తికి 
 
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
 
*3. కార్య సాధనకు 
 
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!
 
*4. గ్రహదోష నివారణకు 
 
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
 
*5. ఆరోగ్యమునకు 
 
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
 
*6. సంతాన ప్రాప్తికి 
 
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
 
*7. వ్యాపారాభివృద్ధికి 
 
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!
 
*8. వివాహ ప్రాప్తికి 
 
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!
 
ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ,ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.
 
- సేకరణ 
 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi