Online Puja Services

శృంగి, భృంగి లకి హరిశ్చంద్రునితో సంబంధం ఏమిటి ?

3.21.233.41

శివాలయాల్లో కనిపించే శృంగి, భృంగి లకి హరిశ్చంద్రునితో సంబంధం ఏమిటి ?
- లక్ష్మి రమణ 

సత్యం కోసం , ధర్మం కోసం తనని తాను తాకట్టు పెట్టుకున్న మహారాజుగా హరిశ్చంద్రుని కథ మనకి పరిచయమే. కావ్యముగా ప్రసిద్ధమైన ఈ కథ మార్కండేయ పురాణం లోనిది.  అయితే ఆ మహారాజు గురించి ఉన్న పురాణగాథ అదొక్కటే కాదు. వేదమూ, భాగవతమూ హారిశ్చంద్రుని కథని మరో విధంగా చెబుతాయి. వరుణదేవతాకమైన ఋక్కుల ద్రష్ట అయినా శునశ్శేపుని వృత్తాంతం వీటిలో ఉంటుంది . అయితే మనకి శివాలయాల్లో కనిపించే శృంగి, భృంగి ల జన్మ వృత్తాంతం ఈ హరిశ్చంద్రునితో ముడిపడి ఉన్న విషయాన్ని శివపురాణం విశదీకరిస్తోది. 

హరిశ్చంద్రుని భార్య చంద్రమతీ దేవి. విశ్వామిత్రుడు అంపిన నక్షత్రకుని బాధని పడలేక, తనని తాను కుదువ పెట్టుకునే ముందు, చంద్రమతీదేవిని , కుమారుడు లోహితుణ్ణి సేవకులుగా ఒక వ్యాపారికి అమ్ముతాడు. ఆ తర్వాత ఆయన కాటికాపరిగా మారిపోతాడు . ఈ కథ మనకి తెలిసిన కావ్యకథ . 

హరిశ్చంద్రుని గురించి శివపురాణంలో ఈ విధమైన కథ కనిపిస్తుంది.  హరిశ్చంద్ర మహారాజు మొదటి భార్య సత్యవతి.  ఒకనాడు హరిశ్చంద్రుడు ఆమె మందిరానికి వెళ్ళే సరికి, అక్కడికి స్వయంగా మహేశ్వరుడు వచ్చి వెళ్లిన చిహ్నాలను గమనిస్తాడు . ఆమెను పిలిచి ప్రశ్నిస్తాడు. ఆమె తన మందిరానికి పరమేశ్వరుడు వచ్చిన మాట నిజమేనని ఒప్పుకుంటుంది . అందుకు కారణాన్ని కూడా మహారాజుకి తెలియజేస్తుంది . 

 తాను పూర్వజన్మలో కైలాసంలో శివపార్వతుల పరిచారికనని, తన యందు  అనుగ్రహంతో శివుడు స్వయంగా వచ్చి, తనకి విషయాలు తెలియజేశారని ఆమె చెబుతుంది.  హరిశ్చంద్రుడు శివునికి పరమ భక్తుడు. దాంతో, వెంటనే సత్యవతి తన భార్యనే భావనని  , ఆమె పైన వ్యామోహాన్నివిరమించుకుంటాడు . 

అప్పటికే,  శివుని అనుగ్రహం వల్ల ఆమెకు కలిగిన కవల శిశువులని కైలాసానికి తీసుకుపోయి, శివునికి అర్పిస్తాడు.  ఆ కవలలే చండీశ్వరుడు, బృంగీశ్వరుడు. హరిశ్చంద్రుడు తర్వాత చంద్రమతిని వివాహం చేసుకున్నారు .  ఈ కథ శివపురాణంలో చెప్పబడింది. 

#srungi #bhrungi #harischandra

Tags: srungi, shrungi, bhrungi, harischandra

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi