Online Puja Services

ఈ రాక్షసుడి దేహంలో స్వామికి నివేదన ?

18.118.9.146

ఈ రాక్షసుడి దేహంలో స్వామికి నివేదన ? 
-లక్ష్మీ రమణ . 

రాక్షసులు , రాక్షసులు అని మనం అనుకుంటాం.  కానీ, భగవంతునితో వైరాన్ని పొంది , లేదా దైవం అనుగ్రహాన్ని పొంది వాళ్ళు పొందిన ఉత్కృష్టమైన స్థానం చాలా గొప్పదేమో అని పలు సందర్భాలలో అనిపించకమానదు . అటువంటి రాక్షసుల్లో రాగిఖనిజానికి కారణమైన రాక్షసుడు కూడా ఒకరు . భక్తి తత్పరత కలిగినవాడు రాక్షసుడే అయినా , అతన్ని మహనీయుడు అనే ఉచ్చరించాలి . 

దైవకార్యాలలో రాగిపాత్రలని ఎక్కువగా వాడడం గమనించే ఉంటారు . ప్రత్యేకించి మహావిష్ణువుకు రాగిపాత్రలో నివేదించిన పదార్థాలంటే, మహా ప్రీతి . లోగడ మన పెద్దవాళ్ళు కూడా నెలలకి రాగిబిందెలని వాడేవారు . ఆ పాతమధురాలని దాచిఉంచుకునే సంప్రదాయం ఉన్నవారికి వాటిని చూసే అదృష్టం , ఇంకా సంప్రదాయం ఉండిఉంటే, వినియోగించే యోగం కూడా ఉండి ఉండవచ్చు .  అది వారి సుకృతం . 

నిజంగానే ఇది సుకృతమే . లేకపోతె, ప్లాస్టిక్ లో వండుకొని , దాంట్లోనే నిల్వచేసుకొని , అదే ప్లేట్లల్లో భోజనం చేస్తున్న యుగంలో ఉన్నాం కదా మనం . అందుకన్నమాట . రాగి వాళ్ళ ఎన్ని లాభాలున్నాయి తెలుసా! అని ఏ వార్తాహరులో ఊదరగొట్టిన పాపానికి ఇప్పుడు , కాపర్ బాటిల్స్ వరకూ వచ్చాం .  కానీ వాటి వాడకం మన పూరీకులతో పోలిస్తే చాలా తక్కువే ! రాగిణి గురించిన పురాణ గాదని చెప్పుకునే ముందు రాజవల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయి ఒకసారి చూద్దాం . 

* రాగిలో యాంటి బ్యాక్టిరియల్‌ నేచర్‌ ఉంటుంది. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఉండదు. కాబట్టి ఇందులో నిల్వచేసే పదార్థాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ.
* మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం. రాగి పాత్రలలో నీళ్ళు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు. అందుకే పాత రోజుల్లో రాగి బిందెలు వాడేవారు.
* చెవులు కుట్టినప్పుడు కూడా చిన్న పిల్లలకి కొన్ని చోట్ల మొదటిసారి రాగి తీగలు చుడతారు. ఎందుకంటే పుండు పడకుండా ఉండటానికి. రాగికి వున్న ఆంటి బ్యాక్టిరియల్‌ లక్షణం పిల్లలకు ఆ ప్రమాదం రాకుండా చేస్తుంది.
* గతంలో నీళ్ళు వేడి చేసుకోవడానికి రాగితో చేసిన బాయిలర్లు వాడే వాళ్ళు. ఇందులో వేడి చేసిన నీరు వాడడం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గేవని రుజువు చెయ్యబడ్డాయి.
* రాగి చెంబులో రాత్రి నీరు వుంచి పగలు నిద్ర లేవగానే తాగితే చాలా చాలా మంచిది. అలా తాగితే కడు పులో వున్న చెడు అంతా మూత్రం ద్వారా బయటకి వచ్చేస్తుందట. ఈ అలవాటు వల్ల గ్యాస్‌, కిడ్నీ, లివర్‌ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
* బ్రిటిష్‌కి చెందిన ఒక యూనివర్సిటీ వాళ్ళు కూడా రాగిపాత్రలలో ఉంచిన నీటిపై పరిశోధన జరిపి పైన పేర్కొన్న విషయాలు నిజమని నిరూపించారు.

ఇక ఈ రాగి ఎలా పుట్టిందనే విషయానికి వస్తే, వరాహ పురాణం మనకీ కథని చెబుతుంది .  

రాగి ఏడువేల యుగాల క్రితమే విష్ణుమాయ కారణంగా పుట్టింది . గజాసురుడు - అసురుడే కానీ, భగవంతుణ్ణి చేరుకోవాలన్న ఆయన కోరిక , గజాననరూపంలో దేవుడిగానే మార్చింది .  అదే గజాననునికి ఇంకొక రాక్షసుడైన మూషికాసురుడు వాహనమయ్యాడు . కైలాసానికి వచ్చి వెళ్లగల సామర్ధ్యమున్న రావణుడు రాక్షసుడేగా ! రాక్షసులైనా వారి భక్తిని మెచ్చి , భగవంతుడు ప్రసన్నుడై , వారిని అనుగ్రహించిన సందర్భాలు మన పురాణాలలో ఇలా అనేకం కనిపిస్తాయి . 

రాగిగా పరివర్తన చెందిన గూడకేశుడు కూడా ఒక రాక్షసుడు. ఆయన  విష్ణు మూర్తిని ఆరాధించేవాడు.  అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నాడా  జగన్నాథుడు .  గూడకేశుడు తానూ విష్ణుచక్రం చేత సంహరింపబడాలని , తన అవయవాలన్ని తామ్ర( రాగి) రూపం దాల్చాలని,  భగవదారాధనకు ఆ లోహంతో చేసిన పాత్ర లనే వాడాలని కోరుకుంటాడు. వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. వెంతనే అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. అలా ఆ ఆనాటి నుండి మనకు ఈ లోహాలు సంప్రాప్తినిచ్చాయన్నమాట . అందుకే ఇప్పటికీ దేవాలయాలల్లో, యజ్ఞంలో రాగి పాత్రలను మాత్రమే వాడతారు.  

అంతేగాక రాగికి నీటిలో సూక్ష్మ క్రిముల్ని చంపి నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది . కాబట్టి వీటిలో ఉన్న శుద్ధజలం అని పిలవబడుతుంది . ఈ పాత్రల్లో పెట్టె నైవేద్యం , తన భక్తుని భక్తికి , సమర్పించేవారు భక్తికీ నిదర్శనంగా ఆ భగవంతుడు భావిస్తాడు . కనుక వీటిల్లో విష్ణువుకి నైవేద్యాన్ని అర్పించడం చాలా ఫలవంతమని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి .

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha