Online Puja Services

మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి

3.142.12.240
ఎక్కడైనా ప్రమాదం గురించి విన్నప్పుడు అయ్యో పాపం అనుకుంటారు, అదే అయిన వాళ్ళ విషయం లో తల్లడిల్లి పోతారు, ఇక్కడ స్పందన బంధానికే , బాధ అనేది మనవాళ్ళు అయిన వాళ్ళ వల్లే కలుగుతుంది. ఆశ పడ్డప్పుడు నిరాశ, కోరింది దక్కనప్పుడు కోపం, ఒకరి సంతోషం చూడలేనప్ప ఈర్ష , మాట నెగ్గించుకోవాలి అనే పంతం, మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం ఇంకొకరి పైన నింద, అవసరానికి మించిన ఖర్చు అర్హతను మించిన కోరిక.. ఇవన్నీ బాధలకు, కష్టాలకు, అనారోగ్యంకి కారణం..

ఒక గుమస్తా యజమానికి ఒక షర్ట్ బహుమతిగా ఇవ్వాలి అనుకున్నాడు యజమాని స్థాయిని గుర్తు పెట్టుకుని ఐదు వేల రూపాయల్లో షర్ట్ కొన్నాడు , అలాగే యజమాని కూడా గుమస్థాకి షర్ట్ కొన్నాడు అతని స్థాయికి ఇది చాలు లే అని ఐదు వందల రూపాయల షర్ట్ కొన్నాడు , ఇక్కడ వీళ్ళు ఆలోచించాల్సింది అవతల తీసుకునే వారి స్థాయి కాదు ఇస్తున్న మీ స్థాయికి తగట్టే మీ బహుమతి ఉండాలి యజమానికి అతని స్థాయి గుర్తు చేయాల్సిన అవసరం లేదు నీ స్తాయిలో ఒక స్వీట్ బాక్స్ ఇవ్వవచ్చు, అలాగే గుమస్తాగా ఉన్న అతని స్థాయి ని గుర్తు చేసే లాగా అలా ఇవ్వాల్సిన అవసరం లేదు యజమాని స్థాయికి తగట్టు గుమస్తా కు ఎప్పటికి గుర్తు ఉండేలా నీ బహుమతి ఉండాలి కానీ మన బహుమతులు ఇతరుల స్థాయిని అర్హతను ఎగతాళి చేసే లాగా ఉండకూడదు. మన స్థాయికి మించిన సహాయం, సంపదను మించిన ఆర్భాటం ఉండకూడదు. జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు ఇంకొకరితో పోల్చుకోవడం మానేయాలి..

బాగా చదివే వేరే పుల్లలతో మీ పిల్లలను పోల్చకండి మీ పిల్లలు బాగా చదవడానికి చేస్తున్న ప్రయత్నం మెచ్చుకోండి, బాగా సంపాదిస్తున్న ఇంకొకరి మీ వాళ్ళను పోల్చకండి మీ కోసం పడుతున్న కష్టాన్ని మటుకే గుర్తించండి.. భార్య బాగా లావుగా అయిపోయింది అని చులకన చేయకండి మీ వంశాన్ని అభివృద్ధి చేసి ఆమె శరీరంలో శక్తిని కోల్పోయి నీరు చేరిపోయి అలా అయిపోయింది అని తెలుసుకోండి తనతో ఇంటి పని సహాయం చేసి డైట్ exercise చేయడానికి సహకరించండి ఇంట్లో అందరూ తన ఆరోగ్యం కాపాడుకునే లా శ్రద్ద తీసుకోండి..

ఈ కరోన సమయంలో వ్యాపారం నష్టపోయిన ఆదాయం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ సమయంలో కష్టంలో మీతో నడుస్తున్నది మీకు తోడుగా ఉన్నది మీ కుటుంబ సభ్యులే ఎవరు అయిన వాళ్ళు ఎవరు పరాయువాళ్లు తెలుసుకునే అవకాశం వచ్చింది కదా, ఆఫీసులో ,ఫేస్బుక్ లో, పరిచయాలు పెట్టుకుని మీ వాళ్ళను పట్టించుకోకుండా ఎంతగా బాధ పెట్టి ఉంటారు.. అటువంటి పరిచయాలు వదిలేయండి మీకోసం పుట్టి మీ జీవితంలో కి వచ్చిన వారితో సంతోషంగా ఉండండి. మన ప్రాణం ఉన్నంత వరకూ మనతో ఉండే తొడుని వదిలి కాగితాల పూల కోసం ఎగబడకండి. భక్తి అయినా బంధం అయినా నమ్మకం అనే పునాది పైనే నిలబడుతుంది..

ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఏమీ చేయాలి అని అడిగారు కదా ముందుగా మన ఆలోచనా విధానం జీవన విధానం మార్చుకోవాలి అప్పుడు ఏ మంత్రం అయినా సిద్దిస్తుంది, ఏ తంత్రం అవసరం లేకుండా జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

మనిషి మనిషిలాగా బతికితే అతన్ని దేవుడు అన్నారు రాముడై భక్తి రాజ్యాన్ని పాలిస్తున్నాడు మనము మనిషిలాగా మానవత్వం తొ నీతిగా బతికితే మన ఇల్లు దేవాలయం అవుతుంది.. మేము మంచిగా ఉన్నా మాకు శత్రువులు ఉన్నారు అనకండి అవకాశం మీరు ఇస్తేనే మోసం కానీ శత్రుత్వం కానీ వస్తుంది..మనము జగర్తగా ఉంటే అన్ని సమస్యలు దానంతట అదే తొలగిపోతాయి..
 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore

© 2022 Hithokthi | All Rights Reserved