Online Puja Services

బంగారాన్ని మట్టిగడ్డతో

3.22.249.158
కవితార్కిక కేసరి వేదాంత దేశికుల వారి అంతటి పండితులు ఆనాడు లేరు. వారు హయగ్రీవుని ఆరాధనలో తరించి హయగ్రీవుని అపార కరుణకు పాత్రుడు అయ్యారు. అప్పటిలో పండితులు ఏ రాజాస్థానముకో వెళ్లి వారిఅనుగ్రహం సంపాదించేవారు. వేదాంత దేశికులు వారు శ్రీవారి ఘంటావతారం. అయన సేవలన్నీ శ్రీవారికే. పేదరికం తాండవిస్తున్నా అయన ఏనాడూ పాలకుల ఆశ్రయము కోరలేదు. వందల రచనలు చేసినా అన్నీ భగవద్ కైంకర్యమే . ఆయన ఎన్నో స్తోత్రాలు రచించారు హరిని కీర్తిస్తూ. వారు రచించిన శ్రీమద్రహస్య త్రయ సారం ప్రతీ ఒక్కరు చదివి తరించాల్సిన గ్రంథ రాజం . దేశికుల వారు ప్రతీ రోజు సమీప గ్రామములోకి వెళ్లి ఉపాదానం స్వీకరించి అది తన ఇల్లాలికి ఇచ్చి ఆమె వండి శ్రీవారికి నైవేద్యం పెట్టగా అదే వారున్నూ భుజించేవారు . ఒకనాడు దేశికులవారు యథావిధిగా సమీప గ్రామంలోకి వెళ్లగా అక్కడ ధార్మికురాలైన ఓ ఇల్లాలు దేశికులవారికి బియ్యం, కూరగాయలతోబాటు అందులో కొన్ని బంగారు నాణాలు కూడా వేసింది . అవి ఆయన గమనించలేదు. తీసుకు వెళ్లి ఆయన తన ఇల్లాలు కి ఇవ్వగా ఆమె వాటిని చేట లో పోయగా అందులో మిలమిల మెరిసే నాణాలు కనిపించాయి. అవేమిటో ఆ ఇల్లాలికి తెలియదు.భర్తను పిలిచి అవి చూపించగా.. పూజాగదిలో ఉన్న కొన్ని దర్భలు తీసుకు వచ్చి వాటిని తొలగించి మట్టిబెడ్డలు ధాన్యములో సామాన్యమే అని చెప్పారు. అదీ దేశికుల వారికీ ధనధాన్యాలు పట్ల ఉన్న విముఖత . హరి అభ్యాగతుల సేవయే ఆయనకు పరమావధి . ఇరువది ఏళ్లలోనే సకల శాస్త్రాలలో పారంగతుడైన ఆయన ఎందరినో తన వాదనలతో ఓడించారు. అమిత వాక్పటిమ గలిగిన గరుడ మంత్రాన్ని తన గురువు నుండి పొందిన ధీశాలి 
 
-  రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore