Online Puja Services

లక్ష్మీకి ఉన్నంత గౌరవం సరస్వతికి లేదేమిటి?

3.144.33.41
"కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥” 
 
 మనిషికి ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్న అవి ధరించినప్పుడు మాత్రమే అందాన్ని ఇస్తాయి. విద్య అనే ఆభరణం మనిషికి సదా ఆభరణంగా ఉండే కీర్తిని గౌరవాన్ని తెచ్చి పెడుతుంది.  ధనవంతుడు తన ఊరికే గొప్పవాడు 

* విద్యావంతుడు దేశానికే గొప్పవాడు * ధనంతో ఫలం కొనగలం! కానీ ఫలితాన్ని కొనలేం! 

లక్ష్మీ దేవి సరస్వతి కి అత్తగారు అవుతుంది కదా! అత్తగారి అధికారం ఎంతటిడైన కోడలి అధికారం తక్కువదేమీ కాదు. ధనం ఏ కారణంగానైనా తగ్గిపోవచ్చు. విజ్ఞానం నానాటికీ పెరగడమే కానీ తరిగిపోవడం ఉండదు.  ధనాన్ని దాయాదులు భాగం పొందవచ్చు. విద్యను ఎవరు భాగం పంచుకో లేరు, ఎవరు దొంగిలించ లేరు, ఏనుగు ఎంత పెద్దది అయినా తొండం చిన్నదైనా దేని విలువ దానిదే మరి అవును కదా! 

ధనకాముజగత్తులో ధనవంతుడి భగవంతుడు.  కానీ వివేక ప్రపంచంలో విద్యావంతుడు సృష్టికర్త. విజ్ఞాన జగత్తులో ప్రజ్ఞావంతుడు పరమాత్మ. మదంతో మేధస్సు రాదు. ధనంతో విజ్ఞానం రాదు. 
ఈనాడు మనం అనుభవిస్తున్న సుఖాలన్నీ మేధా వంతులు విజ్ఞానులు ప్రసాదించిన వే కానీ ధనవంతులు ఇచ్చినవి కాదు. ఈ మాత్రం జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా విద్యావంతుల కి నమస్కరించి గౌరవిస్తాడు.

జ్ఞాన శక్తికి మించిన మరొక శక్తి ఈ జగత్తులో లేదు. ఏడంతస్తుల మేడ కట్టిన తాను ఉండబోయేది తనకు కావాల్సింది ఆరు అడుగుల స్థలం మాత్రమే కదా అన్న జ్ఞానం కలిగిన వాడు తపన పడి పోతాడు తల్లక్రిందులు అయిపోతాడు. తనకు తానే గులకరాయిలా కనిపిస్తాడు.

ధనం క్షణం కనిపించే మెరుపుతీగ. విద్య తన వారందరికీ వెలుగు చూపించి నడిపించే దారి దీపం. మెరుపు ఉన్నంత కాంతిదీపానికి ఉండదు. దీపానికి ఉన్న ప్రయోజనం మెరుపుకీ ఉండదు. డబ్బుతో మందులు  కొనవచ్చు. 

వైద్యాన్ని కొనలేవు ఒకానొక సమయంలో వైద్యానికి కూడా కొనవచ్చు వైద్య విజ్ఞానని మాత్రం కొనలేవు.
విజ్ఞానమే సరస్వతీమాత! ఎవరైనా భార్యను కొనగలరు తల్లిని మాత్రం కొనలేరు కదా!అజ్ఞాన వంతులు ఉన్నచోట సరస్వతి ఉండదు. అందుకే సరస్వతి మందిరాలు సరస్వతి ఆలయాలు మనకు ఎక్కువగా లేవు. విద్యావంతుల హృదయమే సరస్వతి మందిరం ఆమెకు అదే తగిన స్థలం

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi