Online Puja Services

జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం

3.17.174.156

జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం

జాతకచక్రం ద్వారా జాతకుడికి ఏ దిక్కు కలసి వస్తుందో అష్టకవర్గు ని పరిశీలించి తెలుసుకోవచ్చు.అష్టక వర్గుని పరిశీలించి జాతకుడికి నివశించే ఇల్లు ఏ దిక్కు కలిసి వస్తుందో తెలుసుకోవచ్చు.వ్యాపారం చేసే షాపు ఏ దిక్కున కలసి వస్తుందో అష్టక వర్గుని పరిశీలించి తెలుసుకోవచ్చును.

1)అగ్నితత్వ రాశులైన మేషం,సింహ,ధనస్సు రాశులు (1,5,9 రాశులు) తూర్పు దిక్కును తెలియజేస్తాయి.

2)భూతత్వ రాశులైన వృషభం,కన్య,మకర రాశులు (2,6,10 రాశులు) దక్షిణ దిక్కును తెలియజేస్తాయి.

3)వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ రాశులు (3,7,11 రాశులు) పడమర దిక్కును తెలియజేస్తాయి.

4)జలతత్వ రాశులైన కర్కాటకం వృశ్చికం,మీన రాశులు (4,8,12 రాశులు) ఉత్తర దిక్కును తెలియజేస్తాయి.

అగ్ని,భూ,వాయు,జల తత్వ రాసుల యొక్క సర్వాష్టక వర్గుల యొక్క బిందువుల మొత్తాన్ని కలపగా ఏ తత్వ రాశులకు ఎక్కువ బిందువులు వస్తాయో ఆ దిక్కునకు లోబడి ఉంటే మంచి సంతృప్తి, అభివృద్ధి, జీవనోపాది, సంపాదన ఉంటుంది.

పైన ఉన్న జాతక చక్రంలోని అష్టకవర్గు చక్రాన్ని పరిశీలిస్తే 

అగ్నితత్వ రాశులైన మేషరాశిలో 28 సింహరాశిలో 26 ధనస్సురాశిలో 27 మొత్తం సర్వాష్టక బిందువులు 81 తూర్పు దిక్కును తెలియజేస్తాయి. 

భూతత్వ రాశులైన వృషభరాశిలో 30 కన్యారాశిలో 26 మకరరాశిలో 27 మొత్తం సర్వాష్టక బిందువులు 83 దక్షిణ దిక్కును తెలియజేస్తాయి. 

వాయుతత్వ రాశులైన మిధునరాశిలో 36 తులారాశిలో 20 కుంభరాశిలో 31 మొత్తం సర్వాష్టక బిందువులు 87 పడమర దిక్కును తెలియజేస్తాయి.

జలతత్వ రాశులైన కర్కాటకరాశిలో 35 వృశ్చికరాశిలో 30 మీనరాశిలో 21 మొత్తం సర్వాష్టక బిందువులు 86 ఉత్తర దిక్కును తెలియజేస్తాయి.

వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ రాశుల సర్వాష్టక వర్గుల బిందువుల మొత్తం 87 వచ్చాయి.ఈ మొత్తం అగ్ని,భూ,జలతత్వ రాశుల సర్వాష్టక బిందువుల కంటే అధికంగా ఉన్నాయి కాబట్టి జాతకుడికి పడమర దిక్కు బాగా కలసి వస్తుంది.

Quote of the day

Do not be very upright in your dealings for you would see by going to the forest that straight trees are cut down while crooked ones are left standing.…

__________Chanakya