Online Puja Services

ఆదివార వ్రతం.

3.147.104.120

చర్మవ్యాధులు, నేత్రవ్యాధులూ నిర్మూలించే ఆదివార వ్రతం. 
- లక్ష్మి రమణ 

ఆదివారం సూర్యునికి ఇష్టమైనరోజని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు . ప్రతి మాసంలోని ఒక్క ఆదివారం రోజైనా కనీసం ఇక్కడ చెప్పిన పూజావిధిని ఆచరిస్తే, చర్మ వ్యాధులు, నేత్ర వ్యాధుల నుండీ ఉపశమనం లభిస్తుంది . సంతానం క్షేమంగా ఉండడానికి , వైవాహిక జీవితం అనుకూలంగా సాగేందుకు కూడా ఆదివారం రోజున సూర్యారాధన చేయడం మంచిది .  ఈ పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం .  

ఆదివారం వ్రతంగా చెప్పబడే ఈ పూజని  శుక్లపక్ష ఆదివారం రోజున ప్రారంభించి, సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. ఆదివారం రోజు ఉపవాసం చేయాలి . ఆదివారం రోజున సూర్యోదయానికి పూర్వమే మేల్కొని అభ్యంగన స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా  ఆదిత్య హృదయాన్ని మూడుసార్లు చడాలి. తరువాత గంగాజలన్ని/ శుద్దోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి సమర్పించాలి . ముందే చెప్పుకున్నట్టు ప్రతి ఆదివారం రోజున ఉపవాసం ఉంటే శ్రేష్ఠం.  కానీ అలా  చేయలేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజ పూర్తయిన తరువాత ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు వాయనంగా ఇవ్వాలి. సంవత్సరం మొత్తం ఈ వ్రతాన్ని ఆచరించలేనివారు కనీసం నెలకు ఒక్కరోజు అంటే కనీసం 12 ఆదివారాలైనా చేయాలి.

ఈ సూర్య నామాలతో ఆయన్ని ఆరాధించవచ్చు  : 

ఓం సూర్యాయ నమః
ఓం అర్యమ్ణే నమః
ఓం భగాయ నమః
ఓం త్వష్ట్రే నమః
ఓం పూష్ణే నమః
ఓం అర్కాయ నమః
ఓం సవిత్రే నమః
ఓం రవయే నమః
ఓం గభస్తిమతే నమః
ఓం అజాయ నమః
ఓం కాలాయ నమః
ఓం మృత్యవే నమః
ఓం ధాత్రే నమః
ఓం ప్రభాకరాయ నమః
ఓం పృథ్వీ వ్యాపఃస్తెజో వాయురాకాశాయ  నమః
ఓం పరాయణాయ నమః
ఓం సోమాయ నమః
ఓం బృహస్పతయే నమః
ఓం శ్రుక్రాయ నమః
ఓం బుధాయ నమః
ఓం ఆఙ్గారకాయ నమః
ఓం ఇన్ద్రాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం దీప్తాంశవే నమః
ఓం శుచయే నమః
ఓం శౌరయే నమః
ఓం శనైశ్చరాయ నమః
ఓం బ్రహ్మ విష్ణు రుద్రాత్మకాయ
  నమః

ఈ ఇరవై ఎనిమిది నామాలతో కూడా , పైన చెప్పుకున్న విధంగా ఆదివారవ్రతం చేసుకోవాలి . కొందరు సూర్యునికి బదులు ఆదివారం సుబ్రహ్మణ్యుని కూడా ఆరాధన చేస్తారు . అది కూడా శ్రేష్టమైనది ! దివ్యమైన ఫలితాలని అనుగ్రహించేదే !

శుభం .  

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha