Online Puja Services

ఈ పూజ ల పరమార్థం ఏమిటి..?

18.218.234.83

ఈ పూజ ల పరమార్థం ఏమిటి..?????  
పూజ,
అర్చన,  
జపం. 
స్తోత్రం.  
ధ్యానం.  
దీక్ష.  
అభిషేకం.  
మంత్రం.  
ఆసనం.  
తర్పణం. 
గంధం.  
అక్షంతలు.  
పుష్పం.  
ధూపం.  
దీపం.  
నైవేద్యం.  
ప్రసాదం 
ఆచమనీయం.  
అవాహనం.  
స్వాగతం.  
పాద్యం  
మధుపర్కం. 
స్నానం.  
వందనం.  
ఉద్వాసన.... 


పూజ-పరమార్థాలు:
పూజ --> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.
అర్చన--> అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.
జపం--> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
స్తోత్రం-->నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
ధ్యానం-->ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.
దీక్ష--> దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.
అభిషేక:--> అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.
మంత్రం--> తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.
ఆసనం--> ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.
తర్పణం-->పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.
గంధం-->అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.
అక్షతలు--> కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.
పుష్పం--> పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.
ధూపం--> చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.
దీపం-->సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.
నైవేద్యం--> ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.
ప్రసాదం--> ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.
ఆచమనీయం-->లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .
ఆవాహనం--> పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.
స్వాగతం--> దేవతను కుశలప్రశ్నవేయుట.
పాద్యం-->చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.
మధుపర్కం-->తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.
స్నానం--> గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.....
వందనం-->అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం)......
ఉద్వాసన--> దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు...

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi