Online Puja Services

సూక్ష్మ ధర్మం

3.142.98.108
అమృత వాక్కులు
సూక్ష్మ ధర్మం 
 
నిత్యం అప్రమత్తతో చేసే నిర్విరామ కృషి వల్లనే విజయ లక్ష్యం సునాయాసంగా సాధ్యమవుతుంది. అన్ని సంపదలకన్నా సంతృప్తి ఉత్తమమైంది. 
 
"నలగకుండ, గోధుమలు కడుపు నింపగలుగునా, కరగకుండ కొవ్వొత్తి కాంతినివ్వగలుగునా” అన్నాడొక కవి. నలగడం, కరగడం సూక్ష్మంగా మారడం కోసం. అలా మార్పు పొందినప్పుడే అవి శరీరానికి శక్తి, జీవన రహదారికి కాంతి అందిస్తాయి. విశ్వంలో అన్నిటికన్నా సూక్షమైంది. దైవకణం. అది అణువుకన్నా అణువు. అంటే పరమ అణువు. అదే అనంతం. దానికన్నా బలమైంది ఏదీ లేదు. మనిషి అహంకారిగా వున్నంత కాలం ఇతరులకు అనుకూలంగా ఉండలేడు. అందుచేత, అతడు కఠినత్వం నుంచి మృదుస్వభావం వైపు మరలాలి. అప్పుడే హృదయ స్పందనలు వినగలుగుతుంది. ఆ వినడం శ్రవణం స్థాయికి చేరితే ధ్యానం అవుతుంది. అలాంటి ధ్యానంలో ఆలోచనలు ఆగి ఆత్మానందం కలుగుతుంది. అదే సూక్ష్మంలో మోక్షం. 
 
ధర్మ శాస్త్రాలు "సూక్ష్మ ధర్మాల పరమార్థాన్ని” చాలా వివరించాయి. వాటిని ఆకళింపు చేసుకుని ఆచరించినవారే ఆధ్యాత్మిక శిఖరాలు అధిరోహిస్తారు.
 
అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా
 
- బిజ్జా నాగభూషణం 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi