Online Puja Services

విశ్వజనిలో చేరే దారేది

18.118.140.108
విశ్వజనిలో చేరే దారేది
 
ఎవ్వరు నమస్కరించక పోయిన సూర్యుడు ఉదయిస్తాడు అలాగే ధర్మ యజ్ఞం కూడా , ఒకరి స్పందన ఆదరణ ఫలాపేక్ష లేకుండా సాగుతుంది గాని ఆగదు , అయితే లలిత చదవమని మటుకు పదే పదే చెప్తుంటాను కారణం అన్నింటికీ అదే మూలం.. అన్ని శాస్త్రాల సమ్మేళనం లలితా సహస్త్రనామ స్త్రోత్రం, ఒక్కో నామ జపం ఒక మహా యజ్ఞం, ప్రతి నామానికి ఒక బీజం ,యంత్రం ,నామరూపం, శక్తి రూపం కలిపి ఒక నామ మంత్రం గా ఉన్నది . లలితా స్త్రోత్రం లో మటుకే ఈ స్త్రోత్రం పారాయణలో అన్ని దేవతా అర్చనలు జరిగిపోతుంది. ఈ స్త్రోత్రం ధ్వనినో ప్రకృతిలో ని శక్తి ప్రకంపనలు మానవ దేహంలోని చక్రాలలో ప్రచోదనం కలిగించి శక్తి ప్రకంపనలు కలిగి ఆ ధ్వని స్పందన ప్రకృతి శక్తితో మమేకం అవుతుంది ఆ ధ్వని ఆధారంగా శ్రీచరం మానవ దేహం చుట్టూ ఏర్పడుతుంది.. ఇది యంత్ర శాస్త్రం అని కూడా అందుకే అన్నారు.
 
మంత్ర, యంత్ర ,తంత్ర స్వరూపంలో ఆ ధ్వని దేహంలో చక్రాలలో స్పందన కలిగించి చక్ర శుద్ది ఏర్పడుతుంది, అందుకే స్పష్టంగా తప్పులు లేకుండా పారాయణ చేయాలి.. దేహమే ఒక యంత్రం. అందులో సహస్త్రారం మణిద్వీపం అక్కడ బిందు మధ్యస్థయై పరమేశ్వరుడి తో పరమేశ్వరి ఒక విత్తనంలో రెండు గింజలు ఉన్నట్టు అర్ధనరీశ్వర తత్వం("నమః " అంటారు ఆ స్థితిని) లో, తేజోరాసిగా విరాజిల్లుతూ ఉంటుంది.
 
సాధకుడు సాధన మొదలు పేట్టగానే , కుండలిని లో ఆ జగన్మాత తోడుగా ఆత్మ చైతన్య మార్గంలో నడిపిస్తూ ఒక్కో స్థాయిలో ఎన్నో అనుభూతులతో వారి జన్మ జన్మ కర్మలను శుద్దిచేస్తుంది అలా కర్మ అనే రాక్షసిని సంహరించదానికి ఒక్కో స్థాయిలో ఒక్కో శక్తి రూపాన్ని దాల్చుతుంది.
 
అలా దాల్చే మొదటి రూపం కిరి చక్ర రదారూఢ (వారాహి స్వరూపం ) దండ నాయకియై మనలోనే ఉన్న రాక్షస సంహారం చేస్తుంది, ఈ వివరణ కూడా సహస్త్ర నామ వివరణలో వర్ణించాను, రాజశ్యామల గా మారుతుంది.. ఒక్కో స్థాయిలో ఒక్కో శక్తి గా సాధకుడికి కుండలినీ సహస్రారం చేర్చే విధంగా శక్తిని ఇస్తుంది. ఈ కుండలినీ రూపంలో ఉన్నది మన ప్రాణ శక్తి. ఈ జీవము కుండలినీ రూపంలో ఒక్కో చక్రాన్ని దాటి సహస్రారం లోని మణిద్వీప నివాసీని అయిన తేజోరాసిలో కలిసిపోతుంది. అక్కడ కి చేరుకున్న జీవుడు స్త్రీ కాదు పురుషుడు కాదు . ఆ స్థాయిలో ఉన్న చైతన్య రూపం అమ్మవారు. అక్కడ ఆ నిముషం ఆమె రూపం కాళరాత్రి . ఈ రూపం దుష్ట రాక్షస సంహారం చేసి చీకటి లోని పాపాలను రాక్షస శక్తిని అంతమొందిస్తూ అన్ని కర్మలను తొలగిస్తూ ఆ స్థాయికి కుండలినీ రూపంలో చేరుకుంటుంది కనుక అక్కడ ఆమెను కాళరాత్రి తో పోలుస్తారు. అందుకే సాధకుడికి అనేక మైన పరీక్షలు, ఎదురు దెబ్బలు,
కర్మని వదిలించుకుని క్రమంలో ఎదురవుతుంది. పూజలు చేస్తే కష్టాలు అనుకుంటారు. కానీ కష్టం రూపంలో కర్మను వదిలించుకుంటున్నారు, అలా అక్కడ సహస్రారం లో సదాశివుడిలో కిలిసాక పరిపూర్ణమైన లలితాంబ గా అవతరింస్తుంది, జీవాత్మలో పరమాత్మ కలిసిపోయిన స్థితిలో దర్శనం అవుతుంది. తర్వాత నీవు వేరు ఆమె వేరు కాదు.. నేనే శక్తి , నేనే శివుడు, నేనే ప్రకృతి, నేనే ప్రళయం, నేనే సకల జీవరాశి లో వున్న చైతన్యం, నాలోనే బ్రహ్మాండం అనే స్థితికి చేరుకుంటారు.
 
దీనికి కారణం .. నేను వేరు నువ్వు వేరు అనుకునే స్థాయిలో ఉన్నపుడు నీకు నీ కర్మ రుణం వెంట ఉంది , జనన మరణ చక్రాల జన్మ జన్మ కర్మలు సాధనలో శుద్ధి ఘావించాక నీవు పరమాత్మ నుండి వెలువడిన సమయంలో ఎటువంటి కర్మ వాసనలు లేని జీవుడిగా వెలువడ్డావు , కానీ కర్మ భూమిలో మలినాన్ని అంటించుకుని నేను వేరు గా మరిపోయావు, ఆత్మ వివేకం కలిగి శరణాగతి తో కర్మనుండి విముక్తి కలిగాక నువ్వు ఎలా పరమాత్మ నుండి వచ్చావో అలా పరిశుద్ధ ఆత్మగా ఉత్తమ గతిని పొందాక అప్పుడు నువ్వు వేరు అనేది లేదు నీవు, పరమాత్మ ఒక్కటే. ఒకటే చైత్యంతో వెలిగే శక్తి గా మరిపోతారు. ఇదే ఆత్మ చైత్యన్య మార్గం, ఆత్మ జ్ఞానం.. ఇచ్చా, క్రియ, జ్ఞాన శక్తిగా వెంట ఉండి ముందుకు తీసుకెళ్లి తనలో నుండి ఎలా జీవాత్మ వెళ్లిందో అలాగే తనలోకి చేర్చు కుంటుంది.
 
ఈ సారాంశం , సాధన రహస్యం మొత్తం సహస్త్ర నామ స్త్రోత్రం లో ఉన్నది. అర్థం తెలిసి చదివిన, తెలియకుండా చదివిన ఫలితం ఉంటుంది. పారాయణ నిరంతరం జరుగుతూ ఉంటే అదే జపం, అదే తపస్సు, అదే సాధన, అదే ధ్యాసగా మారిన రోజుకి ధ్యానంలో ఉన్నట్లు..
 
తప్పులు లేకుండా స్పష్టంగా గురువుదగ్గర నేర్చుకునే వారు ఇది వరకు కాలంలో కానీ అందరికి అలా నేర్పే వారు ఈ రోజుల్లో లభ్యం కారు. కానీ ఎలా స్పష్టంగా పలకాలి ఆడియో వింటూ చదవడం నేర్చుకుని తప్పు లేకుండా పారాయణ చేస్తే ఇంత కన్నా గొప్ప సాధన ఏముంది. నిత్యం నామ జపం, స్మరిస్తూ ఉంటే నిరంతర జపయజ్ఞం సాగుతూ ఉంటుంది. ధ్యానం వైపు మనసు లగ్నం అవుతుంది ప్రశాంతత లభిస్తుంది. ఆ తల్లి ని తెలుసుకోవడమే శ్రీ విద్య. లలిత అర్థం చేసుకోవడం అంటే అమ్మను తెలుసుకోవడం. కనుక మీరు అర్థం తెలుసుకుంటూ ఆనందిస్తూ పారాయణ ఆపకుండా కొనసాగించండి. మీ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోండి ఒక 20 ని.. పారాయణ 12 ని.. ధ్యానం రోజు మీకోసం మీరు కేటాయించు కోండి. సాధనకు సంబంధించిన ప్రశ్నలు మటుకే అడగండి. వీలైనంతగా ముఖ్యమైనవి తెలుసుకుంటూ, ఇంకా కొందరికి తెలిపే ప్రయత్నం చేస్తూ లలితా పారాయణం చేయించండి.. ఇది ప్రపంచ శాంతి యజ్ఞంగా భావించండి.
 
ఎంత మంది పలికితే అంత శక్తి . ధ్వని రూపంలో ప్రకృతిలోని శక్తిని (కాస్మిక్ ఎనర్జీ) ని మనలోకి చేరుస్తుంది. శక్తి కలిగిన జీవుడు శివుడు.
 
సేకరణ: భానుమతి అక్కిశెట్టి

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore