Online Puja Services

శ్రీ సూర్య దేవాలయం

3.16.69.143

సూర్యుడు ప్రత్యక్ష దైవం గా కాక ఒక గ్రహం గా పూజింపబడే​ ఆలయం

న దేశం లో ప్రత్యక్షదైవం గా పుజలందుకొనే సూర్యునికి అతి కొద్ది మందిరాలు వుండటం మనకి తెలుసు . అయితే యిక్కడ సూర్యుడు ప్రత్యక్ష దైవం గా కాక వొక గ్రహం గా , సూర్య గ్రహ పరిహారార్ధం పూజింపబడడం విశేషం . ఆ ఆలయం ఎక్కడ వుంది , ఎలా చేరుకోవాలి , ఆ ఆలయం విశేషం ఏమిటి మొదలైన విషయాలు తెలుసుకోవాలని వుందా ? అయితే తెలుసుకుందాం .యీ కోవెల తమిళనాడు లోని కుంభకోణానికి 15 కిమీ. .దూరంలో , కుంభకోణం కదిరమంగళం రోడ్డు మీద వున్న అదుత్తురైకి సుమారు 3 కిమీ... దూరం లో వుంది . యీ వూరుని యిక్కడ పూజలందుకుంటున్న దైవం పేరుమీదుగా నే వ్యవహరిస్తారు . యీ వూరిని సూర్యనార్ కోయిల్ అనే అంటారు . తిరుమంగళగుడి రైల్వే స్టేషన్ కి  3 కిమీ..  దూరంలోనూ , బస్సులో వెళితే తిరుమంగళగుడి కలియమ్మన్ కోవెల బస్ స్టాప్ లో దిగుతే వో రెండు ఫర్లాంగుల దూరంలో వుంటుంది  యీ సూర్యదేవాలయం .

యిక్కడి యీ సూర్యుని కోవెల స్థల పురాణంతో ఇక్కడకి సుమారు ఒక కిమీ. ..దూరంలో వున్న మరో కోవెల స్థల పురాణం ముడిపడి వుండడం మరో విశేషం . తమిళనాడులోని చోళరాజుల రాజధానిగా , రాష్ట్ర ధాన్యాగారం గా పిలువబడే తంజావూర్ జిల్లాలోని విదైమురుదుర్ తాలుకా లో పవిత్ర కావేరి నది వొడ్డున యీ గ్రామం వుంది .ఎవరి కైనా జాతక చక్రం లో కళత్రదోషం , పుత్రదోషం , వివాహ పరిబంధ  దోషం , పుత్రపరి బంధ దోషం , విద్యా ప్రతి బంధ దోషం , వుద్యోహ ప్రతిబంధ దోషం , సూర్య దశ , సూర్య భుక్తి గనక వుంటే వారు యిక్కడ సూర్యునికి పూజలు చేయించుకుంటే సూర్యుని అనుగ్రహం వల్ల అన్ని దోషాలు తొలగి పోతాయనేది భక్తుల విశ్వాసం . గోచార రీత్యా సూర్యుడు శుభుడు కానప్పుడు తండ్రి ఆరోగ్యము స్థిరముగా లేకుండుట , స్వ శారీరిక బలం తగ్గుట , కుడి కన్నుకి సంబంధించిన యిబ్బందులు కలుగుట , చర్మ సంబంధమైన యిబ్బందులు యెదురౌతాయి . అలాంటి వారు యిక్కడ సూర్యుని అర్చించుకుంటే అన్ని దోషాలు తొలగుతాయి .

 

12ఆదివారాలు యిక్కడి పుష్కరిణి లో స్నానం చేసి పూజలు చేసుకుంటే యెంతో కాలంగా పట్టి పీడిస్తున్న చర్మ సంబంధ రుగ్మతలు , సకల దోషాలు తొలగి , భార్యా భర్తలు సుఖ జీవనం సాగిస్తారు .అయితే యీ సూర్యుడు ఎవరో తెలుసుకుందాం . హిందూ పురాణాల ప్రకారం సూర్యుడు , మారిషి అనే ఋషి పుతృడైన కశ్యపుని కుమారుడు . విశ్వకర్మ కుమార్తె సూర్వర్సలని (ఉష)  పెండ్లాడెను . వైవస్వథ మను, యమ ధర్మరాజు , యమునలు యితని సంతానము . మరో కధ ప్రకారం శని కుడా సూర్యుని పుతృడే . సూర్యుని కి ప్రత్యూష ( ఛాయ ) కి పుట్టిన కుమారుడు . అన్ని ఆలయాల్లో లా కాకుండా యీ ఆలయం లో దర్శన విధి వేరేగా వుంటుంది . స్థల పురాణానికి ముందు దర్శన విధి తెలుసుకుందాం .

 

సూర్య గ్రహాన్ని దర్శించుకోడానికి ముందు యిదే వూర్లో వొక కిమీ... దూరంలో వున్న తిరుమంగళగుడి లో వున్న ప్రాణనాధేశ్వరుని , మంగళంబికను దర్శించుకొని సేవించుకొని తరువాత సూర్యుని కోవేలకి రావాలి . 
సూర్యనార్ కోవెలలో కి రాజ గోపురం లోంచి ముందుకు వెళ్లగానే దక్షిణాన వున్న పుష్కరిణిలో స్నానం చేసి లేదా నీళ్లు తలపై జల్లుకొని అక్కడకి దగ్గరగా వున్న కల్ తీర్థ వినాయకునికి సంకల్పం తో అర్చన చేసుకోవాలి . అలా చేస్తే యీ వినాయకుడు అన్ని ఆటంకాలను తొలగించి శుభాన్ని కలుగజేస్తాడు . అక్కడ నుంచి ముందుకు వెళితే నర్తన మండపం చేరుకుంటాం . అక్కడ నటరాజ స్వామిని దర్శించుకొని ముందుకు వెళితే సభా మండపం చేరుకుంటాం . అక్కడ వున్న వుత్సవ విగ్రహాలను దర్శించుకొని గర్భ గుడి లోకి ప్రవేశించి అక్కడ కొలువై యున్న కాశీవిశ్వనాథుని , విశాలాక్షిని దర్శించుకొని అర్చన , హారతులు నిర్వర్తించుకొని మహామండపం లోకి ప్రవేసిస్తాం .  మహా మండపం అనిపిలువబడేదే సుర్యనారాయణుని సన్నిధి . యీ మందిరం రధం ఆకారం లో వుంటుంది . ఎదురుగా ఉష ప్రత్యూష ( ఛాయ )  సమేతుడైన సూర్యభగవానుని దర్శించుకోవచ్చు . సూర్యదేవుని పూజించుకున్న తరువాత మహా మండపం లోనే సూర్యునికి అభిముఖంగా గురు భగవాన్ అని పిలువబడే బృహస్పతి విగ్రహం వుంటుంది . సూర్యని దర్శనానంతరం బృహస్పతి ని దర్శించుకొని మహామండపం  దక్షిణం వైపున నుంచి బయటికి వచ్చి ముందు శనిని తరువాత కుజుని ఆపైన బుధుని దర్శించుకొని ఆతరువాత వుత్తరం వైపున వున్న చంద్రుడు , కేతువు లను దర్శించుకొని తరువాత పడమటన వున్న శుక్రడు , రాహువులను దర్శించుకొని చివరగా సందికేస్వరుని దర్శించు కోవాలి . కుడి చేతి వైపుగా ప్రదక్షిణ చేసి కల్ తీర్ధ గణపతిని పునఃదర్శనం చేసుకొని ధ్వజస్తంభానికి సాష్ఠాంగ నమస్కారం చేసుకోవాలి . సూర్య దేవుని మందిరం లో అన్ని గ్రహాలకు వేరే వేరే మందిరాలు వుండడం యిక్కడి విశేషం . నవగ్రహ స్థానాలకి వెళ్లి దోష నివారణ చేసుకోలేని వారు యిక్కడ యీ మందిరంలో ఆయా గ్రహాలకు పూజలు చేసుకుంటే ఆయా గ్రహ దోషాలు పోతాయంటారు  

సూర్యునికి ప్రీతికరమైనవి  రంగు ఎరుపు , రత్నం కెంపు , ధాన్యం గోధుమలు , పువ్వు మందారం గాని యెర్రకలువ , యిక్కడి స్థల వృక్షం మందారం . వారం ఆది వారం .ఆదివారం సూర్యునికి , సోమవారం చంద్రునికి యిలా ఏడురోజులు ఏడు గ్రహాలకు కేటాయించగా మిగిలిన రాహుకేతువు లకు గాను ప్రతిరోజూ లోను గంటన్నర సమయం రాహువుకు , అలాగే గంటన్నర సమయం కేతువునకు కేటాయించేరు . రాహువునకు కేటాయించిన సమయాన్ని రాహుకాలమని , కేతువునకు కేటాయించిన సమయాన్ని యమగండ మని అంటారు . ఇప్పడు సూర్యనార్ కోవెల స్థల పురాణం తెలుసుకుందాం .పురాణ కాలంలో " కల్వుడు " అనే మహర్షి తన తపశ్శక్తితో భవిష్యత్తుని చూడగలిగేవాడు . అలా వొకరోజు తన భవిష్యత్తుని చూసుకోగా అతను త్వరలోనే కుష్ఠు వ్యాధి భారిన పడుతున్నట్లు తెలిసింది . ఆ వ్యాధి జాతక  చక్రం లో నవగ్రహాలు దోష స్థానాలలో వుండుట వలన వస్తుంది కావున కల్వుడు నవగ్రహ శాంతులు , పూజలు చేసి నవగ్రహాలను ప్రసన్నం చేసుకొని ఆ వ్యాధిభారిన పడకుండా తప్పించుకుంటాడు . విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఆగ్రహించి నవగ్రహాలను కుష్ఠువ్యాధి పట్టి పీడించాలని శపిస్తాడు . శాప ప్రభావం వల్ల నవగ్రహాలకు కుష్ఠు వ్యాధి శోకుతుంది . శాప విముక్తి కొరకు బ్రహ్మ దేవుని వేడుకొనగా , బ్రహ్మదేవుడు ప్రాణనాధేశ్వరుని సేవించుకుంటే శాపవిముక్తి కలుగుతుంది అని చెప్తాడు . ప్రాణనాధేశ్వరుని యేవిధముగా సేవించుకోవాలో తెలియని నవగ్రహాలకు అగస్త్య ముని తెలియజేస్తాడు . నవగ్రహాలు ప్రస్తుతం తిరుమంగళగుడిగా పిలువబడే చోట వున్న ప్రాణనాధేశ్వరుడు , ప్రాణవర్ధనుడు పిలువబడే ప్రాణనాధేశ్వరుని సేవించుకుంటూ వుంటారు . కల్వ మహర్షి  తన కారణంగా నవగ్రహాలు శాపం పొందినందువల్ల  తాను కూడా వారితో పాటుగా అకాడె వుండి ప్రాణనాధుని సేవించుకుంటాడు . కొంత కాలానికి వీరి తపస్సునకు  మెచ్చిన ప్రాణనాధేశ్వరుడు వారిని శాప విముక్తులను చేస్తాడు . శాప విముక్తులైన నవగ్రహాలు తమతమ నెలవులకు మరలుతుండగా కల్వ మహర్షి భులోకవాసుల గ్రహదోష నివారణార్ధం అదే ప్రదేశంలో నవగ్రహాలను కొలువయి యుండమని కోరగా కల్వుని కోరిక మన్నించి నవగ్రహాలు ప్రాణనాధుని కొరకై తపస్సు చేసుకున్న ప్రదేశంలో ఆసనమైన క్రమం లోనే ఆశీనులై వుండి ఆప్రదేశానికి వచ్చే భక్తుల గ్రహదోషాలను పోగొడతామని మాట యిచ్చి వెడలి పోతారు . కల్వ మహర్షి ఆ ప్రదేశం లో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ చేయించెననేది యిక్కడి స్థల పురాణం చెప్తోంది .

తిరుమంగళగుడి రాజగోపురం 

తంజావూరు ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రముఖ చొళరాజులలో వొక డైన కుళోత్తుంగ చోళుని మంత్రి " అలైవనార్ " ప్రజలనుంచి వసూలు చేసిన " పన్ను " సొమ్మును రాజ ధనాగారము లో జమ చేయక ఆసోమ్ముతో సూర్యగ్రహ దేవాలయమును నిర్మించెను . విషయము తెలుసుకున్న కుళోత్తుంగ చోళుడు , అలైవనార్  చర్యని రాజద్రోహం నేరం గా పరిగణించి అతనికి మరణదండన విధించి అమలు చేస్తాడు . అలైవనార్ పత్ని అతని పార్ధివ శరీరాన్ని ప్రాణనాధేశ్వరుని మందిర ప్రాంతం లో అంత్యక్రియలు జరుపుటకు అనుమతిని కోరగా రాజు అలైవనార్ శరీరాన్ని తిరుమంగళగుడికి తరలించుటకు అనుమతి నిస్తాడు . ఆమె పార్వతీ దేవికి యెదురుగా భర్త శరీరాన్ని వుంచి దేవిని ప్రార్ధించగా అలైవనార్ పున్ః ర్జీవితుడైనాడుట , అప్పటినుంచి ఇక్కడ పార్వతీ దేవిని మాంగల్యాన్ని కాపాడిన దేవి కావున మంగళామ్బికగా పిలువ బడుతోంది . ఇవాల్టికి కుడా భర్త మృత్యుముఖమం లో వున్నప్పుడు భార్యలు యిక్కడ దేవికి పూజలు చేయిస్తే ఆపదలు తొలగి పోతాయని భక్తుల నమ్మకం .యీ విధంగా తిరుమంగళగుడి , సుర్యగ్రహ దేవాలయాల స్థల పురాణాలు వొక దానితో వొకటి ముడి పడి వున్నాయి .

 

-కర్రా నాగలక్ష్మి  

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore