Online Puja Services

రథ సప్తమి నాడు ఆచరించవలసిన పూజా విధి

3.146.105.194

రథ సప్తమి పర్వం నాడు  ఆచరించవలసిన పూజా విధి
సేకరణ 

సూర్య భగవానుని కాంతి కిరణాలు భూమికి అధికంగా లభించడం రథసప్తమి నుంచి ప్రారంభమవుతుంది. సూర్య గమనంలో వచ్చే మార్పు ఇది. సూర్యుడు రథం మారడంగా అభివర్ణించబడిన తిధి ఇది. సూర్యుని మహిమ అందరికీ అనుభవైకవేద్యమే. సూర్యుడు  జగత్ చక్షువు.  కర్మసాక్షి అయిన సూర్యుణ్ణి  దైవీ శక్తిగా ఉపాశించే విధానాలు భారతీయ రుషులు ఆవిష్కరించారు. ఈరోజున సూర్యుడికి పాయసాన్నం నివేదన చేసి, చిక్కుడు ఆకుల్లో ఆరగిస్తారు.  చిక్కుడు, జిల్లేడు సూర్యశక్తిని అధికంగా గ్రహించే వృక్షాలలో కొన్ని.  కనుక వాటిని ఈ రోజున వినియోగిస్తారు. 

ఇది చదివి కంటి చూపు వేగముగా మెరుగు పరచుకొని , పూర్తి ఆరోగ్యము పొంద వచ్చు. విశిష్టమైన ఈ రథ సప్తమి పర్వం నాడు  మాత్రమే కాకుండా ప్రతి రోజూ ఆచరించవలసిన సూర్య పూజా విధిని పూజ్య గురుదేవులు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వివరించారు . దానిని హితోక్తి పాఠకుల కోసం వారికి కృతజ్ఞలతో యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాం . 

ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్’ అంటారు .. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అంతే కాదు , మంచి కంటి చూపు కూడా ఇస్తాడు .

శ్రీ సూర్య నమస్కారం , 
అర్ఘ్యం చ...లఘునా

దీనికి కావలసినవి , 

1 . ఒక రాగి గిన్నె కానీ చెంబు కానీ . 

2 .ఎర్ర చందనము . ఇది చెక్కలుగా దొరుకుతుంది , కొన్ని చోట్ల పొడిగా కూడా దొరుకుతుంది . చెక్క తీసుకుంటే , రోజూ గంధము తీయాలి , పొడి అయితే దాన్ని రుద్ది గంధము చేయుట సులభము . ఓ నూరు రూపాయల చెక్క గానీ , పొడిగానీ కొనుక్కుంటే సంవత్సరము పైన వస్తుంది . ఇదికాక, రోజూ కొన్ని ఏవైనా ఎరుపు రంగు పూలు కావాలి . ఒక కుండీలో కనకాంబరాలు కానీ , ఇంకేవైనా ఎర్ర పూలిచ్చే గులాబీ , మందారము వంటి చెట్టుకానీ పెట్టుకోండి . విధానము స్నానము, సంధ్యావందనము ముగించి , మొదట ఎర్ర చందనము గంధము తీసి ( ఒక బటాణీ గింజంత అయినా చాలు ) రాగి చెంబులోని నీటిలో కలపండి . బాగా ఉద్ధరిణతో కలియబెట్టి , అందులోకి చిన్న చిన్న పూలు గానీ , పెద్ద పూలైతే వాటి రేకులు గానీ కలపండి . తర్వాత సూర్యునికెదురుగా నిలిచి ఈ కింది మంత్రము చెప్పి నమస్కరించండి. 

సూర్య మంత్రం ||

ఓం భాస్కరాయ విద్మహే 
మహద్యుతి కరాయ ధీమహి 
తన్నో ఆదిత్య ప్రచోదయాత్ || 

తర్వాత కింది మంత్రము చెప్పుచూ ఇరవైనాలుగు సార్లు ఆత్మ ప్రదక్షిణము చేస్తూ , ప్రతి ప్రదక్షిణము తర్వాత , పూర్తి సూర్య నమస్కారము గానీ ( యోగా పద్దతిలో ) , లేదా , ఊరికే సాష్టాంగ నమస్కారముగానీ , అదీ వీలు కాకున్న , వంగి నేలను ముట్టి నమస్కారము గానీ చేయండి . 

ఇరవై నాలుగు సార్లు వీలుకాకున్న , పన్నెండు సార్లో , అదీ వీలుకాకున్న ఆరు సార్లో చేయండి . అయితే శ్రద్ధ ముఖ్యము. వీలైనన్ని ఎక్కువ సార్లు చేయుటకే ప్రయత్నించండి .మొదట ఒక వారము రోజులు అలవాటు అయ్యేవరకూ కాస్త కష్టమనిపించవచ్చు . ఆ తర్వాత అలవాటుగా , గబగబా చేసేస్తారు . మంత్రము కూడా అప్పటికి నోటికి వచ్చేస్తుంది . 

సూర్య నమస్కారం ||

వినతా తనయో దేవః 
కర్మ సాక్షీ సురేశ్వరః 
సప్తాశ్వ సప్త రజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు ||

మిత్ర , రవి , సూర్య, భాను , ఖగ , పూష , హిరణ్య గర్భ, మరీచ , ఆదిత్య , సవిత్ర , అర్క , భాస్కరేభ్యో నమః ||
ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 

( పై మంత్రము 24 పర్యాయములు చెప్పి ప్రతిసారి ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారములు చెయ్య వలెను ) 

 సూర్య అర్ఘ్యం 

ఈ కింది మంత్రము చెప్పి రాగి చెంబులోని గంధము , పూలు కలిపిన నీటితో మూడు సార్లు కానీ , పన్నెండు సార్లు కానీ అర్ఘ్యము వదలండి. అర్ఘ్యము వదలునపుడు లేచి నిలుచొని, దోసిటి నిండా చెంబులోని నీళ్ళు తీసుకుని , మంత్రము చెప్పి , అంజలితో కిందికి వదలండి , లేదా , ఏ చెట్టు మొదట్లోకో , కుండీ లోకో వదలండి .

|| నమస్సవిత్రే జగదేక చక్షసే | 
జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే |
 త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే | 
విరించి నారాయణ శంకరాత్మనే || 
శ్రీ ఉషా సంజ్ఞా ఛాయా సమేత సూర్య నారాయణ పర బ్రహ్మణే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి. 

 (ఎర్ర చందనము , ఎర్ర పూలు కలిపిన నీళ్ళతో మూడు పర్యాయములు )

సూర్య ధ్యానం
ఈ శ్లోకము చెప్పి మనసులో సూర్యునికి నమస్కరించండి . 

ధ్యేయస్సదా సవితృ మండల మధ్య వర్తి | 
నారాయణ సరసిజాసన సన్నివిష్టః |
 కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ | 
హరీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః |
 ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నం తు మహేశ్వరః | అస్తమానే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరః || 

సమాప్తం. 

రోజూ సంధ్య వేళలలో ఈ స్తోత్రము చదువుకోండి సర్వ శుభములూ పొందండి . ఏక వింశతి సూర్య నామాలని  ( హోమాదులలో ఉపయోగించవచ్చును. సంధ్యా కాలం లో పఠించిన , సర్వ పాప ముక్తులు అగుదురు ) 

వికర్తనో వివస్వాం చ మార్తాండో భాస్కరో రవిః | 
లోక ప్రకాశకః శ్రీమాన్ లోక చక్షుర్గ్రహేశ్వరః |
లోక సాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తిమిస్రహా |
 తపనస్తాపనశ్చైవ శుచిస్సప్తాశ్వ వాహనః | 
గభస్తి హస్తో బ్రహ్మాచ సర్వ దేవ నమస్కృతః | 
ఏక వింశతిరిత్యేష స్తవ ఇష్టస్సదా మమ | 
శరీరారోగ్యదశ్చైవ ధన వృద్ధి యశస్కరః | 
స్తవ రాజ ఇతి ఖ్యాతస్త్రిషు లోకేషు విశ్రుతః || 

సూర్యస్తవము ( బ్రహ్మ ఉపదేశించినది-- భవిష్య పురాణము ) 

నమస్సూర్యాయ నిత్యాయ రవయే కార్య భానవే | 
భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే | 
ఆదిత్యాయాది దేవాయ నమస్తే రశ్మి మాలినే | 
దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ | 

ప్రభాకరాయ మిత్రాయ నమస్తేఽదితి సంభవ | 
నమో గోపతయే నిత్యం దిశాం చ పతయే నమః |
నమో ధాత్రే విధాత్రే చ అర్యమ్ణే వరుణాయ చ | 
పూష్ణే ఖగాయ మిత్రాయ పర్జన్యాయాంశవే నమః | 
 
నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ | 
హరయే హరితాశ్వాయ విశ్వస్య పతయే నమః | 
విష్ణవే బ్రహ్మణే నిత్యం త్రయంబకాయ తథాత్మనే | 
నమస్తే సప్త లోకేశ నమస్తే సప్త సప్తయే | 

ఏకస్మైహి నమస్తుభ్యమేక చక్ర రథాయ చ | 
జ్యోతిషాం పతయే నిత్యం సర్వ ప్రాణ భృతే నమః | 
హితాయ సర్వ భూతానాం శివాయార్తి హరాయ చ | 
నమః పద్మ ప్రబోధాయ నమో వేదాది మూర్తయే | 

కాదిజాయ నమస్తుభ్యం నమస్తారా సుతాయ చ | 
భీమజాయ నమస్తుభ్యం పావకాయ చ వై నమః | 
ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిత్య దా | 
నమోఽస్త్వధితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యశః| 

( సర్వాభీష్ట సిధ్ధి కి ప్రాతః సాయంకాలాలు పఠించ వలెను ) 

 తరువాత కానీ , అర్ఘ్యమునకు ముందేకానీ తల్లిదండ్రులకు నమస్కరించండి . 

మాతా పితర వందనము 

మాతృ నమస్కారం
 
|| యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః | 
నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం |
 కృఛ్చ్రేణ మహతా దేవ్యా ధారితోహం యథోధరే | 
త్వత్ప్రసాదాజ్జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే | 
పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః | 
వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే || 

పితృ నమస్కారం 

|| స్వర్గాపవర్గ ప్రదమేక మాంద్యం
 బ్రహ్మ స్వరూపం పితరం నమామి 
యతో జగత్పశ్యతి చారు రూపం 
తం తర్పయామస్సలిలైస్తిలైర్యుతైః || 

సమస్త సన్మంగళాని భవంతు!! 

#suryanamaskar #suryanamaskaram #surya #rathasaptami

Tags: Rathasaptami, ratha, saptami, pooja, surya, namaskar, namaskaram, vidhi, 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore