Online Puja Services

లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి కొరకు మంత్రోపదేశం

3.144.12.205

లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి కొరకు మంత్రోపదేశం
------------------------------------------  
 

" శ్రీ వేఙ్కటాచలమహా త్మ్య మ్" శ్రీ పాద్మ పురాణే క్షేత్ర కాణ్డే చతు స్త్రింశో అధ్యాయః 


పూర్వం వైకుంఠములో ఒకరోజున భృగుమహాఋషి కాలుతో తన్నుటవలన,
కుపితురాలైన లక్ష్మీదేవి వైకుంఠమును త్యజించి, భూలోకమందున్న కరవీరపురం
(కొల్హాపురం) చేరుకుంది.(కపిలముని సూచనమేరకు)


భార్యావియోగంతో బాధపడుచున్న నారాయణుడు కూడా భూలోకములో సంచరిచుచున్న సమయమందు, లక్ష్మీదర్శన లాలసుడైన హరికి, అశరీర ఆకాశవాణి ఇలా చెపుతుంది.
నీవు కరవీర పురమునకు పోయి, కమలములతొ కమలాయను 12.సంవత్సరములు పూజించుము,అప్పడు ప్రసన్నురాలై నీదరిచేరును.

"లక్ష్మీమన్త్రో పాసన పూర్వక భగవత్కృత తపోవిధి "

అశరీర ఆకాశవాణి ద్వారా హరికి లభించిన మంత్రం
'' శక్తిపూర్వం శ్రియోబీజం కామబీజమతః పరమ్l
ఆద్యన్త ప్రణవోపేత మక్షర త్రయ సమ్పుటమ్ ll

 

శక్తి బీజం తదుపరి శ్రీ బీజం అంతమందు కామ బీజం, ఆద్యంతములందు ప్రణవమును చేర్చి జపముచేయుము, ఈ విధముగా జపముచేసిన నీకోరిక నెరవేరును. 


''లక్ష్మీమన్త్రోపాసన పూర్వక భగవత్కృత తపోవిధి "
-------------------- 
ఓం హ్రీం శ్రీం క్లీం ఓం
-------------------  
'' పద్మనరోవరాత్ లక్ష్మీ ప్రాదుర్భావః''

పైమంత్రమును ప్రతిరోజు 3000 జపముచేసి1000 కమలములతో అర్చించెను.
ఈవిధముగా అర్చన, జపముచేయగా 13.వ సంవత్సరమున లక్ష్మీదేవి
కార్తీకమాసము, శుక్ల పక్ష, పంచమీ శుక్రవారమునాడు మంత్ర జపముచేయుచున్న హరికి ప్రత్యక్షమాయెను.
ఆ మహా లక్ష్మి కల్హారమాలనుగై కొని హరికి సమర్పించెను.

" ఉత్థాయ సస్మీతా లక్ష్మీః ఆగత్య హరి మఞ్జసాl
కల్హారమాలా మున్ముచ్య విష్ణోః కణ్ఠే నమర్ప్యచll

లక్ష్మీ అనుగ్రహము కోరు ఎల్లరూ ,భక్తి శ్రధ్ధలతో పై మంత్రమును,యధాశక్తి జపము చేసి ( పూజానంతరము)
లక్ష్మీ అనుగ్రహముతో ధన, కనక, వస్తు, వాహన,ఐశ్వర్య సంపదలతో, పిల్లా, పాపలతో,గృహమునందు సుఖ, శాంతులతో వర్ధిల్లగలరని ఆశీర్వాదములతో
శుభం భవతు 

 
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya