Online Puja Services

సుబ్రహ్మణ్యుని మృత్తికా ప్రసాదం

18.191.234.62

సుబ్రహ్మణ్యుని మృత్తికా ప్రసాదం (మట్టి ప్రసాదం) మహామహిమాన్వితం . 
- లక్ష్మీరమణ 
 
దేవాలయాల్లో సాధారణంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తారు.  అయితే , నాగదేవతల ఆలయాల్లో పుట్టమన్నుని చెవులకి పెట్టుకోవడం అనేది  సంప్రదాయమే. కనుక , సర్పస్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన   కర్నాటకలోని ప్రసిద్ధమైన కుక్కే సుబ్రమ ణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికను  (పుట్ట మన్నుని ) స్వామి ప్రసాద రూపంలో అందించడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఈ ఆలయంలో ఇచ్చే వల్మీక మృత్తికా ప్రసాదం మాత్రం భక్తులపాలిటి కల్పవృక్షమని చెబుతున్నారు భక్తులు . వాడే విధానాన్ని బట్టీ ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది ఈ పుట్టమట్టి ప్రసాదం . 

ఉడిపి సమీపంలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యారాధకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని దేవదేవుడు. ఈ వల్లీ నాధుని దర్శనానికి వచ్చే భక్తులకి ప్రసాదంగా లభించే ఈ వల్మీక మృత్తిక ఎంతో  మహిమోపేతమైనదని చెబుతుంటారు స్థానికులు . అంతే కాకుండా ఆ వల్మీక మృత్తికని ఏవిధంగా ఉపయోగిస్తే, ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా వారు వివరిస్తున్నారు . 

పాముల భయం ఉండదు :

కుక్కే సుబ్రహ్మణ్యుని మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికి నాగుల భయం ఉండదు. పాముల్ని చూసి భయపడం , కలల్లో పాములు  ఎక్కువగా కనిపించడం వంటివి బాధిస్తున్నవారు ఈ మట్టిని నుదుటన విభూతిగా పెట్టుకుంటే, వారికి ఆ భయాలు, బాధలూ  తగ్గిపోయి , దైర్యం చేకూరుతుంది. నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది .

పెళ్ళిసంబంధం కుదిరట్లేదా ? 

ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లికాని యువతీ యువకులు పెళ్లి చూపులకి వెళ్లేప్పుడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ధ్యానించి, ఒక చిటికెడు మృత్తిక, ఒక చిటికెడు పసుపును నీళ్ళల్లో వేసి, కాగబెట్టి , ఆ వేడి నీళ్లతో స్నానం చేయా లి. తరువాత శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకొని, సుబ్రహ్మణ్యునికి ఆవునేతి దీపాన్ని వెలిగించి, పెళ్ళిచూపులకి వెళ్ళాలి . ఇలా పూజించడం వలన వారికి  త్వరగా  సంబంధం కుదిరి, వివాహం అవుతుంది.

నోరు అదుపులో ఉండట్లేదా ?

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత .  అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లాడడం వలన వచ్చేవి అనర్థాలే ! వ్యక్తిగతంగానే కాకుండా వారివల్ల వారి కుటుంబం కూడా అనేక ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇలా ప్రవర్తించేవారికి కొబ్బరి నూనెలో ఒక చిటికె మృత్తికను కలిపి , దానిని తలకి రాసుకొని, తలదువ్వు కొంటే అలా మాట్లాడకుండా ఉంటారు. అదే సమయంలో వారు సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు.

బాలగ్రహ దోషాలు పీడిస్తున్నాయా ?

బాలగ్రహ దోషాలు వున్న పిల్లలు ఎక్కువగా పళ్ళు కొరకడం, కిందపడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు ఈ మృత్తికను తీసుకుని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి, పిల్లల నుదుటికి పెడితే ఆరోగ్యంగా పెరుగుతారు.

పదేపదే అనారోగ్యానికి గురయ్యే పిల్లలకు కూడా స్నానం చేయించే వేడినీటితో మృత్తికని కలిపి స్నానం చేయించాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యస్వామికి ఆవు నేతితో దీపాన్ని వెలిగించి పూజించాలి. దీనివల్ల వారి ఆరోగ్యం చక్కబడుతుంది.

నెలసరిలో కడుపునొప్పికి దివ్యఔషధం :
 
ఋతు సమయంలో కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడే అమ్మాయిలు  ఋతుకాలానికి ముందు ఒక చిటిక మృత్తికను బాగా పొడి చేసుకొని, కొబ్బరి నూనె లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్ట నొప్పి ఉండదు.

పరీక్షల్లో చదివిందంతా మర్చిపోతున్నారా ?

సుబ్రహ్మణ్యుడంటేనే జ్ఞాన స్వరూపుడు. ఆయన్ని ఆరాధించినవారికి చక్కని చదువు అబ్బుతుంది. కానీ , ఎంత చదివినా పరీక్షాకాలంలో చదివిందంతా మరచిపోతూంటారు. ఇది వారికి  జటిలమైన సమస్యగా ఉంటుంది.  అటువంటి వారు ఒక చిటిక మృత్తికను ఒక గ్లాస్‌ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయం ఆ నీటిని వడకట్టి తాగుతూ వుంటే, వారికి ఆ సమస్య తగ్గిపోతుంది. మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది. 

సంతానం కోసం :

వివాహం అయి సంతాన భాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్యస్వామికి పూజ చేయడం ఉత్తమం అని శాస్త్రాలు చెబుతున్నాయి . అయితే, ఈ కుక్కే సుబ్రహ్మణ్యుని ప్రసాద మృత్తికని ఇలా సుబ్రహ్మణ్యుని పూజ చేసిన తరువాత, దేవునికి ప్రసాదంగా పెట్టిన  పాలల్లో ఒక చిటిక  వేసి, తాగితే స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది.

బృందావనం కోసం :

ఎవరింట్లో అయినా తులసి మొక్క, తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసినా వడలి పోతుంటాయో అటువంటివారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.

చర్మరోగాలు తగ్గిపోతాయి :

చర్మం పొడి బారినవారు నాగఫణి రోగాన్ని అనుభవిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటివారు ఒక చిటిక మృత్తికను నీటిలో వేసి, ఆ నీటితో సాయంకాలం స్నానం చేస్తే,  ఎటువంటి రోగాలు రాకుండా ఆరో గ్యవంతులుగా, భాగ్యవంతులుగా కలకాలం విలసిల్లుతారని విశ్వాసం. 

ఇవీ కుక్కే సుబ్రహ్మణ్యుని మహిమాన్విత మృత్తికా వినియోగ ఉపయోగాలు . ఆ సుబ్రహ్మణ్యుని కృపాకటాక్షాలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శలవు.  

#subrahmanyeswara #kukke

Tags: kukke, subrahmanyeswara, swamy, swami, subrahmanya, 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha