Online Puja Services

స్కంద షష్టి | సుబ్రహ్మణ్య పూజా విధానం

18.219.189.247

సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ..స్కంద షష్టి | సుబ్రహ్మణ్య పూజా విధానం
 -సేకరణ

స్కంద షష్టి | సుబ్రహ్మణ్య పూజా విధానం

మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి / స్కంద షష్టి / సుబ్బారాయుడి షష్టి.

షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం తప్పనిసరి. నాగ దోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కాంద పురాణం  చెబుతున్నది.

పూజామందిరంలోని సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకుని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని ప్రార్థించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. సులభంగా ఇంటివద్ద సుబ్రహ్మణ్య పూజా చేసుకొనుట కొరకు పూర్తీ విధానం క్రింద ఇవ్వబడినది.

నమస్తే నమస్తే మహాశక్తి పాణే |
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||

ఒకచేతిలో మహాశక్తి అయుదాన్ని, ఒకచేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొకచేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు అని శరణు వేడినవారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు.

శ్రీ పసుపు గణపతి పూజ:
శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం:

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్  వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ముద్దిశ్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూర్వక అష్టోత్తర పూజాం కరిష్యే…

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం:

శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా|| తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే || అధ ధ్యానం.

సుబ్రహ్మణ్య పూజ విధానము:

ప్రాణ ప్రతిష్ఠాపన 

శక్తిహస్తం విరూపాక్షం షడాననం దారుణం |
రిషోఘ్నం భావయే కుక్కుట ధ్వజం ||

షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం |
రుద్రస్యసూనుం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే ||
కుమారేశసూనో గుహస్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తి హారిన్ ప్రభో తారకారే సదారక్షమాంత్వం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధ్యాయామి

ఆవాహనం:
ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వ సేవిత |
తారకాసుర సంహారిన్ రక్షోబల విమర్ధన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆవాహయామి

రత్నసింహాసనం:
ఉమాసుతశ్శక్తిధరః కౌమార క్రౌంచదారణ |
ఇదం సింహాసనం దివ్యం గృహ్యతాం శంకరాత్మజ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(పుష్పము ఉంచవలయును)

పాద్యం:
గంగాజల సమాయుక్తం సుగంధం గంధసంయుతం |
పాద్యం చ ప్రతిగృహ్ణాతు పార్వతీ ప్రియనందన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(కలశంలోని నీటిని స్వామి వారి  పాదములు కడిగినట్టుగా భావించి చల్లవలయును)

అర్ఘ్యం:
స్కందో గుహష్షణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభుః |
అర్ఘ్యం దాస్యామితే దేవ శిఖివాహో ద్విషద్భుజః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి

(మరల ఉదకము చల్లవలయును)

ఆచమనీయం:
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్త వత్సలః |
గంగాసుతశ్శరోద్భూతః ఆచమనం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి

(మరల నీళ్లు చల్లవలయును)

పంచామృత స్నానం:
పయోదధి సమాయుక్తం ఘృత శర్కరయా యుతం |
పంచామృత స్నానమిదం గృహణ సురపూజిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి

(పంచామృతములు పుష్పముతో చల్లవలెను)

శుద్ధోదకస్నానం:
నదీనాం దేవ సర్వాసాం అనీతం నిర్మలోదకం |
స్నాపయామి మహాసేన తథా శాంతిం కురుష్యమే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి

(మంచినీటిని పుష్పముతో చల్లవలయును)

వస్త్రం:
మహాసేనః కార్తికేయః మహాశక్తిధరో గుహః |
వస్త్రం సూక్ష్మం గృహాణత్వం సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(వస్త్రము లేదా అక్షతలు, పుష్పము ఉంచవలెను)

యజ్ఞోపవీతం:
నానారత్న స్వర్ణయుతం త్రివ్ర్తం బ్రహ్మసూత్రకం |
ఉపవీతం మయాదత్తం సంగృహాణ సురేశ్వర ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం:
శ్రీగంధాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దివ్యశ్రీ గంధం సమర్పయామి

(గంధము పుష్పములో అద్ది సమర్పించవలెను)

అక్షతాన్:
శాలీయాంశ్చంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రితాం స్తథా |
అక్షతాంస్తవ దాస్యేవాహం గృహాణ సురవందిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షంతలు చల్లాలి)

ఆభరణం:
భాషణాని విచిత్రాణి హేమరత్న మయానిచ |
గృహాణ భువనాధార భుక్తిముక్తి ఫలప్రద ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆభరణి సమర్పయామి

(పూలు, అక్షంతలు చల్లాలి)

పుష్పము:
సుగంధీని సుపుష్పాణి కేతకీ చంపకాని చ |
మయాహృతాని పూజార్థం కృపయా ప్రతిహృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పుష్పాణి సమర్పయామి

(పూలు వేయాలి)

అథాంగ పూజ:

ఓం జ్ఞానశక్త్యాత్మాకాయ నమః పాదౌ పూజయామి
ఓం స్కందాయే నమః గుల్ఫౌ పూజయామి
ఓం అగ్నిగర్భాయ నమః జానునీ పూజయామి
ఓం బాహులేయాయ నమః జంఘే పూజయామి
ఓం గాంగేయ నమః ఊరూ పూజయామి
ఓం శరణోద్భవాయ నమః కటిం పూజయామి
ఓం కార్తికేయాయ నమః ఉదరం పూజయామి
ఓం కుమారాయ నమః నాభిం పూజయామి
ఓం షణ్ముఖాయ నమః హృదయం పూజయామి
ఓం తారకారి నమః కంఠం పూజయామి
ఓం సేనానీ నమః వక్త్రం పూజయామి
ఓం గుహాయా నమః నేత్రం పూజయామి
ఓం బ్రహ్మచారిణే నమః కలౌ పూజయామి
ఓం శివతేజాయ నమః లలాటం పూజయామి
ఓం క్రౌంచాధారీ నమః శిరః పూజయామి
ఓం శిఖివాహనాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ పూజ
(ఒకొక్క నామానికి పసుపు/కుంకుమ/పూలు వేస్తూ చదవాలి)

ఓం స్కందాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్రాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం కృత్తికాసూనవే నమః
ఓం శిఖివాహాయ నమః
ఓం ద్విషడ్భుజాయ నమః

ఓం శక్తిధరాయ నమః
ఓం పిశితాశప్రభంజనాయ నమః
ఓంతారకాసురసంహర్త్రే నమః
ఓం రక్షోబలవిమర్ధనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మాత్తాయ నమః
ఓంసురసైన్యసురక్షకాయ నమః
ఓం దేవసేనాపతయే నమః

ఓంపాప్రాజ్ఞాయ నమః
ఓం కృపాళవే నమః
ఓంభక్తవత్సలాయ నమః
ఓంఉమాసుతాయ నమః
ఓం శక్తి ధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచదారణాయ నమః
ఓం సేనానియే నమః
ఓం అగ్నిజన్మనే నమః

ఓం విశాఖాయ నమః
ఓంశకరాత్మజాయనమః
ఓంశివస్వామినే నమః
ఓం గుణస్వామినే నమః
ఓం సర్వ స్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంతశక్తియే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతీ ప్రియనందనాయ నమః

ఓం గంగాసుతాయ నమః
ఓం శరోద్భూతాయ నమః
ఓం ఆహుతాయ నమః
ఓం పావకాత్మజాయ నమః
ఓం జృంభాయ నమః
ఓంప్రజృంభాయ నమః
ఓం ఉజృంభాయ నమః
ఓం కమలాసనసంస్తుతాయ నమః
ఓంఏకవర్ణాయ నమః

ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః
ఓం పంచవర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం అహర్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః

ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకరాయ నమః
ఓం వటవే నమః
ఓం వటువేషభృతే నమః
ఓం పూషాయ నమః
ఓం గభస్తియే నమః

ఓంగహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
శంకరాత్మజాయ నమః
ఓం విశ్వయోనియే నమః
ఓం అమేయాత్మాయ నమః

ఓం తేజోనుథయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్ఠినే నమః
ఓం పరబ్రహాయ నమః
ఓంవేదగర్భాయ నమః
ఓం విరాట్పతయే నమః
ఓంపుళిందకన్యాభర్తాయ నమః
ఓం మహాసారస్వతావృతాయ నమః
ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః

ఓం చోరఘ్నాయనమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంతమూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓంశిఖండీకృతకేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమఢంభాయ నమః
ఓం మహాడంభాయ నమః
ఓం వృషాకపయే నమః

ఓం కారణోపాత్తదేహాయ నమః
ఓం కారనాతీత విగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓంఅమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామపరాయణాయ నమః
ఓం విరుద్ధహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రకావతస్యాయ నమః

ఓం శామకందరాయ నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయఫలదాయ నమః
ఓంవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామనే నమః

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్ఠోత్తర శతనామావళిః

ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం |
ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధూపం సమర్పయామి

(అగరవత్తులు వెలిగించండి)

దీపం:
అజ్ఞాన నాశనం దేవ జ్ఞాసిద్ధిప్రభో భవ |
సకర్పూరాజ్య దీపం చ గృహాణ సురసేవిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి

(దీపం చూపించాలి)

నైవేద్యం:
భక్త్యైర్భోజ్యై స్సచోష్యైశ్చ పరమాన్నం స శర్క్రరం |
నైవేద్యం గృహ్యతాం దేవీ శంభుపుత్ర నమోస్తుతే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(పిండి వంటలపై నీళ్ళు చల్లాలి)

తాంబూలం:
తాంబూలంచస కర్పూరం నాగవల్లీ దళైర్యుతం |
ఊగీఫల సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి

(తాంబూలం చూపాలి)

నీరాజనం:
కర్పూర వర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం |
ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంగళ నీరాజనం దర్శయామి

(కర్పూరం వెలిగించాలి)

మంత్రపుష్పం:
మంత్రపుష్పం ప్రదాస్యామి గృహాణ వరదో భవ |
పరమేశ్వర పుత్రస్త్వం సుప్రీతోభవ సర్వదా ||
భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేవాయ ధీమహీ తన్నో షణ్ముఖి ప్రచోదయాత్ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారం:
(చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి)

యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ప్రదక్షిణం సమర్పయామి

పునః పూజ:

ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఛత్రం అచ్చాదయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః చామరం వీజయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నృత్యం దర్శయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గీతం శ్రావయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అశ్వాన్ ఆరోహయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గజాన్ ఆరోహయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆందోళికాం ఆరోహయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి

క్షమా ప్రార్థన:
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అర్పణ:
అనయ ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక |
ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యా స్వామి షోడశోపచార పూజాం సంపూర్ణం.

#subrahmanyashasti #poojavidhanam #subrahmanyeswara

Tags: Subrahmanya shasti, Pooja vidhanam in telugu, Subrahmanya, Subrahmanyeswara, 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha