Online Puja Services

పుత్రగణపతి స్తోత్రం!

3.15.143.181

మంచి ప్రవర్తన కలిగిన , సౌర్యవంతులైన పుత్రులని అనుగ్రహించే  పుత్రగణపతి స్తోత్రం!
లక్ష్మీ రమణ 

వినాయకుడు మామూలుగానే ప్రకృతిలోని ప్రతి పదార్థంలోనూ ఇమిడిపోయి, పరమ సౌందర్యమైన రూపంతో మనసుదోచుకునేలాగా కనిపిస్తూ , అనుగ్రహిస్తూ ఉంటారు . ఇక, ఆయన జగదాంబ ఒడిలో కూర్చొని ఉన్నప్పుడు చూసిన వారి కన్నులు , జన్మలు ధాన్యాన్ని పొందినట్టే! వినాయకునికి శిరస్సుని ఖండించి , ఆ తర్వాత పరమ వాత్సల్యంతో గజముఖాన్ని ఆ గణపయ్యకు అతికించిన శివయ్య , జగదాంబతో కూడి చిన్నారి గణపయ్యని ఒడిలో కూర్చోబెట్టుకొని దేవతలకి దర్శనం ఇచ్చారట . అలా దర్శనం ఇచ్చిన గణపయ్యని దేవతలందరూ స్తుతించారట . అప్పుడు గౌరమ్మ వారికి  ఎవరైతే, ఫాల్గుణ శుద్ధ చవితి నాడు దేవతలు చేసిన ఆ పుత్రగణపతి స్తోత్రం చేస్తారో వారి వంశము వృద్ధినిపొందగలదని వరాన్ని అనుగ్రహించారట ! ఇది వరాహ పురాణంలోని వృత్తాంతము . 

ఈ స్తోత్ర పారాయణము చేయడం వలన వంశదోషములు తొలగి శక్తియుక్తలు కలిగిన పుత్రులు ఉదయిస్తారని శృతి వచనం . మొట్ట మొదట అలా సౌర్యవంతులైన , వంశానికి కీర్తి ప్రతిష్ఠలని తెచ్చిపెట్టే పుత్రులకోసం ఈస్తోత్రముతో డుంఢి రాజు అనే కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందారట. అటువంటి ఫలదాయని ఆయిన , అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సార్లు లేదా ఎనిమిది సంఖ్యతో  పారాయణ చేసినట్టయితే, విశేషమైన ఫలితం లభిస్తుంది .

శ్రీ పుత్రగణపతి స్తోత్రం:

శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వాయద్‌ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వంశరీరంతు శరీరిణామ్‌ ।। 1

శ్లో।। యచ్చాపి హసితం తేనదేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణపృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2

శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తఃకుమారో భాసయన్‌ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌రుద్ర ఇవాపరః ।। 3

శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాంయోషితః సప్రమోహయన్‌ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యారూపేణచ మహాత్మవాన్‌ ।। 4

శ్లో।। తద్‌ దృష్ట్వా పరమం రూపంకుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాంతమ పశ్యతభామినీ ।। 5

శ్రీ పరమేశ్వర ఉవాచ –
శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో
గణేశ నామా చ భవస్య పుత్రః ।
        ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా
వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।
        ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః
కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6

శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు
కార్యేషుచాన్యేషు మహానుభావాత్‌ ।
       అగ్రేషు పూజాం లభతేన్యధాచ
వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7

శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ
సురైఃసమం కాంచన కుంభ సంస్థెః ।
          జలై స్తథా సావభిషిక్తగా
త్రోరరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8

శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతుదేవాస్తం గణనాయకం ।
తుష్టువుః ప్రయతాః సర్వేత్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9

దేవా ఈచుః –
శ్లో।। నమస్తే గజవక్త్రాయనమస్తే గణనాయక ।
వినాయక నమస్తేస్తు నమస్తేచండ విక్రమ ।। 10

శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రేనమస్తే సర్పమేఖహో ।
నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం కురు సర్వదా ।। 11

శ్రీ పార్వత్యువాచ –
శ్లో।। అపుత్రోపి లభేత్‌ పుత్రానధనోపి ధనం లభేత్‌ ।
యం యమిచ్ఛేత్‌ మనసాతం తం లభతి మానవః ।। 12

శ్లో।। ఏవంస్తుత స్తదాదేవైర్మహాత్మా గణనాయకః ।
అభిషిక్తస్య రుద్రస్యసోమస్యా పత్యతాం గతః ।। 13

శ్లో।। ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వాభక్త్యా గణపతిం నృప ।
ఆరాధయతి తస్యాశు తుష్యతేనాస్తి సంశయః ।। 14

శ్లో।। యశ్చైతత్‌ పఠతే స్తోత్రంయశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా ।
నతస్య విఘ్న జాయన్తేనపాపం సర్వథా నృప ।। 15

శుభం !!

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha