Online Puja Services

సంక్రాంతి పండుగ కూడా ముందుకు జరిగిపోయిందా ?

3.144.161.116

సంక్రాంతి పండుగ కూడా కలికాలం ప్రభావంతో ముందుకు జరిగిపోయిందా ? 
సేకరణ 

తెలుగునాట ప్రతిముంగిలికీ కాంతిని పంచె పండుగ సంక్రాంతి.  ఈ  పండుగ సాధారణంగా జనవరి 14న వస్తుంది . కానీ ఈ మధ్య కాలంలో ఒకటీ రెండు రోజులు ముందుకు జరిగిపోయినట్టుగా ఉంది . ఈ ఏడాది సంక్రాంతి 15న జరుపుకున్నాం కదా ! ఎందుకిలా జరుగుతోందా అని ఎప్పుడైనా ఆలోచించారా ?

సాధారణంగా, సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిననాడే మకర సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఇక ఈ రోజు నుండి మిధునరాశి లోకి ప్రవేశించేదాకా ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా వ్యవహరిస్తారు. ఇలా సూర్యుడు మకరరాశిలోకి వచ్చినప్పుడు దాదాపు 20 నిమిషాలు ఆలశ్యం జరుగుతూ ఉంటుంది . అలా ఆలశ్యం జరిగినప్పుడు ప్రతి మూడు సంవత్సరాలకూ ఒక గంట , ప్రతి 72 ఏళ్లకీ 24గంటలుగా అంటే, ఒక రోజుగా మారుతోంది . ఆ విధంగా ఆలోచించి 2008 నుండీ సంక్రాంతి ఆగమనాన్ని లెక్కించి చూడండి !   

2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే సంక్రాంతి పండుగ. అంటే ఈ కాలం 72 సంవత్సరాలు . ఇలా ప్రతీ  72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు వెనుకకి  మారుతుంది. అంటే , 
 
1935 నుండి 2007 వరకు జనవరి 14న,
2008 నుండి 2080 వరకు జనవరి 15న,
2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుందన్నమాట 

ఈ లెక్కన, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం, 72 ఏళ్లకొకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. అంటే, వచ్చే ఏడాది కూడా సంక్రాంతి జనవరి 15ననే వస్తుందన్నమాట !! 

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore