Online Puja Services

అక్షయ తృతీయనాడే లక్ష్మీ నారసింహునికి చందన సేవ ఎందుకు చేస్తారు ?

18.217.220.114

అక్షయ తృతీయనాడే లక్ష్మీ నారసింహునికి చందన సేవ ఎందుకు చేస్తారు ? 
- లక్ష్మి రమణ 

వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ మంచి వేడి వాతావారణంలో వచ్చే పర్వం. ఈ నాడు లక్ష్మీ దేవిని ఆరాధించడం , బంగారం కొనడం ఈ రెండూ ప్రధానంగా చేస్తూ ఉంటాం . కానీ , ఈ రోజు లక్ష్మీ దేవిని విష్ణుమూర్తితో కలిపి ఆరాధించడం, విష్ణుమూర్తికి చందన సేవ చేయడం అనంతమైన తరగని సిరులని అందిస్తుంది.  ఈ పర్వానికి సింహాచల నారసింహునికి గొప్ప అవినాభావ సంబంధమే ఉంది. ఆ కథని, ఈనాడు విష్ణుమూర్తికి చేయాల్సిన చందాన సేవా విశేషాన్ని తెలుసుకుందాం.  

 అక్షయ తృతీయ నాడు ముందే చెప్పుకున్నట్టు లక్ష్మీ,నారాయణుల నిద్దరినీ కలిపి ఆరాధించాలి . అనంతమైన లక్ష్మీ కటాక్షాన్ని పొందాలనుకుంటే, అమ్మవారిని విష్ణుహృదయనివాసినిగా ఆరాధించడం అవసరం . అమ్మవారు ఆరూపంలో త్వరగా అనుగ్రహిస్తారు . 

 ఈ రోజున లక్ష్మీనృసింహస్వామికి సింహాచల మహా క్షేత్రంలో చందనోత్సవం ఏర్పాటు చేస్తారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఆ స్వామివారి నిజరూపదర్శనం భక్తులకి ప్రాప్తిస్తుంది . అయితే అక్షయ తృతీయ రోజు మాత్రమే ఎందుకిలా స్వామి వారికి ఇన్ని రోజులుగా వేసిన  పాత చందనాన్ని తొలగించి నూతనంగా చందనాన్ని పూస్తారు? మళ్ళీ ఇక్కడ సనాతనమైన సూర్యారాధన వైభవం మనకి కనిపిస్తుంది . 

నారాయణుడే సూర్యుడు. భగభగమండే ఎండలతో గడ్డుకాలం అనిపించే సూర్యుని తాపం తో నిండిన కాలం ఇక ఇక్కడ నుండీ మొదలవుతుంది .  ముందున్న మహా వేసవితాపాన్ని తట్టుకోవడానికి ఆ వరాహనారసింహునికి ఇలా చందనం పూస్తారు . నారాయణుడు అంటే విశ్వశరీరుడు.  అందువల్ల ఆ స్వామిని చల్లబరిస్తే, జగమంతా చల్లబడుతుంది. అందుకని విశ్వశరీరుడైన నారాయణునికి చల్లని చందనాన్ని కానీ అలదినట్టయితే మనకున్నటువంటి తాపాలన్నీ పోతాయి ప్రపంచానికి శాంతి లభిస్తుంది.

అందుకే  వైశాఖ శుక్లపక్ష తృతీయనాడు నారాయణుని చందనంతో అలంకరణ చేసినట్లయితే ఆ విధంగా చేసిన భక్తుడు వైకుంఠనికి చేరుకుంటాడు అని పురాణాలు చెబుతున్నాయి. భక్తితో ప్రేమతో ఈ పని చేసినట్లయితే ఆ స్థితి తప్పకుండా లభిస్తుంది. 

అయితే ఇక్కడ చందనము అంటే బజారులో దొరికేది తీసుకొచ్చి నీళ్లు కలిపి పూసేయడం కాదు.  చందనం కర్ర తీసుకొని సానపై అరగదీసి అలా సంప్రదాయ బద్ధంగా తీసిన శుద్ధ చందనాన్ని స్వామికి సమర్పించాలి . ఈ విధంగా చందనం తీసేటప్పుడు ప్రదక్షణ క్రమంలో నారాయణ స్మరణ చేస్తూ చందనాన్ని సానమీద అరగదీయాలి.   అంటే క్లాక్ వైస్ అన్నమాట.  ఆ చందనంతో మన శక్త్యానుసారంగా పచ్చ కర్పూరాన్ని, కుంకుమ పువ్వు వేసుకోవచ్చు . ఇలా నారాయణునికి వైశాఖ శుక్లపక్ష తృతీయనాడు చేసేచందాన సేవ వలన  అనంతమైన సంపదలు కలుగుతాయి.  

#akshayatruteeya #lakshminarasimha #lakshminrusimha #simhachalam

Tags: akshaya truteeya, thrutheeya, thrutiya, akshaya, simhachalam, lakshmi, nrusimha, narasimha

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi