Online Puja Services

నవ నారసింహ క్షేత్రాలు

18.188.241.82

నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాలు..!

ఓం నమో నారాయణ..!!

హిరణ్యకశిపుడిని సంహరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో 
వివిధ రూపాల్లో వెలిశారని ప్రతీతి.


జ్వాల నరసింహ స్వామి
అహోబిల నరసింహ స్వామి
మాలోల నరసింహ స్వామి
వరాహ నరసింహస్వామి (క్రోడా)
కారంజ నరసింహస్వామి
భార్గవ నరసింహస్వామి
యోగానంద నరసింహస్వామి
చత్రవట నారసింహస్వామి
పావన నరసింహ స్వామి

1.జ్వాలా నరసింహ క్షేత్రము.
(కుజగ్రహా అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైన యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. 
ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి 
ఘనమైన చరిత్ర ఉంది . 
పూర్వం యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. 
అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు 
నరసింహమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట.
అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, 
జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు 
అనే రూపాలలో కనిపించాడట. 


ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. 
స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.


వైకుంఠవాసుని అసురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు, 


కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహరి గా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని 
"జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు. 
ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే 
కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.

2. అహోబిల నరసింహ స్వామి.
(గురుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని 
స్థల పురాణం చెబుతుంది. 


హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి 
ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడేరటా.
అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.
ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, 
ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. 


ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. 


ఈ అహోబిలానికి దేవతలు స్తుతించినందున 
అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. 
ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి 
గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి.

3. మాలోల నరసింహ స్వామి..
(శుక్రగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..)

వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా 
"మా" అనగ లక్ష్మి, లోల యనగ "ప్రియుడు" అని అర్ధం. 
ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. 
ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో 
ఈ ఆలయం కలదు. 


స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. 
వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. 
ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. 
స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి 
వామ హస్తము లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకొన్నట్లుగా యున్నది. 


స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. 
ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, 
ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. 
ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.

4. వరాహ నరసింహస్వామి (క్రోడా)..
(రాహుగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..)

వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా 
వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి 
భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి 
వరాహ నరసింహ క్షేత్రమని పేరు. 


భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. 
ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

5. కారంజ నరసింహస్వామి..
(చంద్రగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.


పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.


గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ 
నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. 
ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. 
అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు. 
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

6. భార్గవ నరసింహస్వామి..,,
(సూర్యగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. 


కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. 


ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. 
పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. 
ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. 
స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై 
శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, 
అసురుని ప్రేవులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, 
ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, 
ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. 
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.

7. యోగానంద నరసింహస్వామి..
(శనిగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి 
అని పిలవబడుచున్నాడు. 


యోగపట్టంతో, విలసిల్లినాడు, 
ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. 
మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. 
ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.

8. చత్రవట నారసింహస్వామి..
(కేతుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను 
ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి 
నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి 
వారికి శాప విమోచనం గావించెను. 
కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని 
చత్రవట స్వామి అని పిలుస్తారు. 
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.

9. పావన నరసింహ స్వామి..
(బుధగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి.
ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, 
సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించగలిగేవాడని అర్ధమగుచున్నది. 


మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. 
కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. 
ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో 
దక్షిణ దిశలో యున్నది. 


పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. 
బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. 
ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. 
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya