Online Puja Services

గ్రహాలకి దోషపరిహార పూజలు ఇంట్లోనే చేసుకోవచ్చా ?

3.22.171.136

గ్రహాలకి దోషపరిహార పూజలు ఇంట్లోనే చేసుకోవచ్చా ? 
లక్ష్మీ రమణ 

గ్రహదోషాలు పోవడానికి రకరకాల పూజలు , హోమాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు . దానివల్ల మంచి ఫలితాలు కూడా పొందుతూ ఉంటాం . కానీ ఈ పూజలాన్ని ఆలయాల్లోనే  చేయాలని అంటూ ఉంటారు . ఆలయానికి ప్రత్యేకించి వెళ్లంటే, ఈ ఆదరాబాదరా జీవితాల్లో సమయం ఎక్కడిది ? ఇంట్లోనే ఆ నవగ్రహాల పటాలూ  పెట్టేసుకొని , పూజలూ అవీ చేసుకుంటే, మేలుకదా ! మాటికొకసారి గుడికి వెళ్లి పూజలు నిర్వహించాలంటే చాలా ఇబ్బంది అనుకునేవారికి కొదవేం లేదు . 

కానీ, ఎప్పుడూ కూడా గ్రహాలని ఇంట్లో పెట్టుకోకూడదు . అవి నిరంతరం పరమేశ్వర ఆజ్ఞని అనుసరించి పని చేస్తూ , చలిస్తూ , భ్రమణ స్థితిలో ఉంటాయి . వాటిని ఇళ్లల్లో పెట్టుకొని పూజలు చేయకూడదు . దేవాలయాల్లో ఉపాలయాలుగా మాత్రమే నవగ్రహాలని మనం చూస్తుంటాం . ఆలయంలో ప్రత్యేకించి , శివాలయాల్లో ఉన్న నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేశాక , ఆ శివుని దర్శనాన్ని చేసుకొని రావడం చాలా మంచిది . అప్పుడు పూర్తిగా  ఆయా  గ్రహాల దోషాల నుండీ విముక్తిని పొందగలరని పండితులు సూచిస్తున్నారు . 

ఇక వీరిలో శనీశ్వరునిది ఒక ప్రధాన స్థానం . ఆయనంటే, మనకి భక్తికన్నా భయం మెండు . ఎందుకంటె, ఆయన నిరంతరం సత్యాన్ని, ధర్మాన్ని ఖచ్చితంగా పాటించేవాడు కనుక . గొప్ప ధర్మాత్ముడై తన కార్యక్రమానికి , తన విధి నిర్వహణలో ప్రతి ఒక్కరినీ సమాన దృష్టితో చూస్తాడు కానుకా ! అవసరపడితే, శివుణ్ణి పీడించడానికైనా వెనుకాడని వాడు కాబట్టి .  ఇలాంటి స్వామిని ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకొని పూజలు  చేయకూడదు. శనిదోషం పరిహార పూజైనా, ఇతర గ్రహదోష నివారణా పూజైనా  ఖచ్చితంగా దేవాలయానికే వెళ్లి చేసుకోవాలి . అలాగే శనీశ్వరుని పాఠాలు కూడా ఇళ్లల్లో ఉంచుకోకూడదు . 

ప్రత్యేక పూజాదికాలు నిర్వహించేప్పుడు మాత్రమే , గ్రహాలని మనం ఆవాహన చేస్తుంటాం . అంతేకానీ నిత్యపూజలో ఇలాంటివి చేయడం , పూర్తిగా విది విధాయకాలు తెలిసినవారికి మాత్రమే చెల్లుతుందని గుర్తుంచుకోవాలి . 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore