Online Puja Services

రాహు దోషం తొలగిపోవాలంటే

13.58.39.23

శ్రీ మాత్రే నమః

రాహు దోషం తొలగిపోవాలంటే..........!!

రాహు గ్రహానికి, దుర్గాదేవికి ఓ సంబంధం ఉంది. 
రాహు గ్రహానికి అధిదేవత దుర్గాదేవి. 
అందుచేత రాహు కాలంలోనే దుర్గాపూజ జరుగుతోంది. 

ఆదివారం రాహు కాల పూజ విశిష్టమైనది. 
రాహువుకు శరీరమంతా విషంతో నిండివుంటుంది. 
కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది. 
అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారివుంటుంది. 

అంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి 
6 గంటలలోపు దుర్గాదేవిని పూజించినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

అనారోగ్య సమస్యలు, 
ఈతిబాధలు, 
రుణబాధలు 
తొలగిపోవాలంటే.. ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా 
గల ఆలయంలో ఒక నిమ్మపండును సగంగా కోసి.. నిమ్మరసాన్ని పిండేసి.. 
నిమ్మపండును ప్రమిదల్లా తిప్పి.. 
అందులో నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపమెలిగించాలి. 
ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లు వెలిగించాలి. 
ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లెపువ్వులు లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి.

అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదే 
పూజ చేయాలి. 
దీపం వెలిగించాక అమ్మవారిని మూడుసార్లు ప్రదక్షణ చేసుకుని నమస్కరించుకోవాలి. 
దుర్గాస్తుతి చేయాలి. 
దుర్గాపూజ తర్వాత నవగ్రహ ప్రదక్షిణలు చేయకూడదు. 

ఇంటికొచ్చాక పూజగదిలో నెయ్యి దీపం మెలిగించి.. ఐదు అగరవత్తులు, కర్పూరంతో పూజ చేయాలి. 

ఇలా తొమ్మిదివారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే.. దోషాలు పటాపంచలవుతాయని పండితులు చెప్తున్నారు

ఓం శ్రీ దుం దుర్గాయై నమః

 
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore