Online Puja Services

కుంభకోణం క్షేత్రం దగ్గరలో నవగ్రహ దేవాలయాలు

3.145.163.58

కుంభ‌కోణం

తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలను తొలగించుకొంటారు. ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు.

సూర్య దేవాలయం.. సూర్య‌నార్ కోవిల్
కుంభ‌కోణానికి 15 కి.మీ.దూరంలో సూర్య దేవాలయం ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. రవి సంపద ప్రదాత కూడా. 1100వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే జనవరి మాసంలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. తమిళంలో సూర్యనార్ కోవిల్ అని పిలుస్తారు.

చంద్ర దేవాలయం-తిన్గాలూర్ కోవిల్
తిన్గాలూర్ కోవిల్ అని పిలిచే చంద్ర దేవాలయదర్శనం సుఖాన్ని, దీర్ఘాయుస్సును ప్రసాదిస్తుందని నమ్మిక. సెప్టెంబర్–అక్టోబర్ మాసాలలో వచ్చే ‘’పురుట్టాసి ‘’,మార్చి –ఏప్రిల్ లలో వచ్చే ఫల్గుని నక్షత్ర సమయాలలో చంద్ర కాంతి ఇక్కడి ఆలయంలోని శివలింగంపై ప్రసరించటం విశేషం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మానసిక ఒత్తిడి, దుఖాన్ని తగ్గించేవాడు చంద్రుడని చెబుతారు. ఈ ఆలయం తిరువైయార్‌కు 5 కిలో మీటర్ల దూరంలో ఉంది.

అంగారక స్థలం- వైథీశ్వరన్ కోవిల్
తిరువైయార్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో కుజ దేవాలయం ఉంది. దీనికి ‘’వైథీశ్వరన్ కోవిల్’’అని పేరు. అనేక వ్యాధులను అంగారకుడు పోగోడతాడని విశ్వాసం. ధైర్యం విజయం శక్తికి అంగారకుడే కారణం. ఇక్కడే జటాయువు, గరుడుడు, సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం చెపుతోంది. వివాహం ఆలస్యం అయితే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే పెళ్ల‌యిపోతుంది.

బుధాలయం...

కుజాలయానికి పది కిలోమీటర్ల దూరంలో బుధుని దేవాలయం ఉంది. ఇక్కడి స్వామి స్వేతారన్యేశ్వరుడు. అమ్మవారు బ్రహ్మ విద్యాంబికా దేవి. వాల్మీకి రామాయణంలో ఈ దేవాలయం గురించి ఉందని చెబుతారు. కనుక ఈ ఆలయం సుమారు 3000 ఏళ్ళనాటి పురాతన ఆలయం అని తెలుస్తోంది. మెర్క్యురి అనే బుధునికి సంబంధిన ఆలయంగా దీనిని భావిస్తారు. బుద్ధి, తెలివితేటలను బుధుడు ప్రసాదిస్తాడు.



బృహస్పతి దేవాలయం... ఆబాత్స గయేశ్వర 

కుంభకోణానికి 18 కి.మీ దూరంలో ఆలన్గుడిలో ఈ గురు దేవాలయం ఉంది. ఇక్కడి స్వామిని అరన్యేశ్వర లింగం అంటారు. ఇది స్వయంభు లింగం దీనికే ఆబాత్స గయేశ్వర అని కూడా పేరు. అమ్మవారు ఉమాదేవి. దీన్ని గురుస్థాన ఆలయంగా భావిస్తారు. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేస్తారు. పార్వతి అమ్మవారు ఇక్కడి ఆలయం లోపలున్న అమృత పుష్కరిణిలో పునర్జనం పొందిందని కధనం. ఇక్కడే శివునిలో ఐక్యమైందని చెబుతారు.



శుక్ర దేవాలయం

వీనస్ అని పిలువబడే శుక్ర గ్రహానికి ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. కంచానూర్లో సూర్య దేవాలయానికి మూడు కిలో మీటర్లలో ఉంది దీనికే ‘’పలాశ వనం, బ్రహ్మ పరి, అగ్నిస్థలం అని కూడా పేర్లున్నాయి. ‘’ఇక్కడే బ్రహ్మ దేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించాడట. భార్యల ఆరోగ్యం కోసం భర్తలు ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేస్తారు.



శని స్థలం...

తిరునల్లార్‌లో శని స్థలం ఉంది. కుంభకోణానికి 53 కి.మీ.దూరంలో కరైకాల్‌కు 5 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది. శనికి అంకితమైన దేవాలయం ఇదొక్కటే అని ఇక్కడి వారంటారు. లక్షాలాది భక్తులు శని గ్రహానుగ్రహం కోసం ఇక్కడికి వచ్చి పూజలు నిర్వర్తిస్తారు. ఇక్కడే నల మహారాజును శని పట్టుకొని పీడించటం ప్రారంభించాడని కధ. ఇక్కడి ‘’నల తీర్ధం ‘’చాలా మహిమ కలిగింది. ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ కొట్టుకుపోతాయ‌ని భ‌క్తుల న‌మ్మిక‌.



రాహు స్థలం

కుంభకోణానికి అయిదు కిలోమీటర్ల దూరంలో తిరునంగేశ్వరంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడి శివుడు నాగనాద స్వామి. అమ్మవారు ‘’గిరి గుజాంబికా దేవి’’. ఇక్కడ ఆదిశేషుడు, దక్షుడు, కారకోటుడు రాహువు స్థలమైన ఈ శివుడిని అర్చించారు.

కేతు స్థలం...

కీజ పేరుం పల్లం అనేచోట ‘’పూం పుహార్’’కు 2 కిలో మీటర్ల దూరంలో కేతు స్థలం ఉంది. ఇక్కడి శివుడు మహా మహిమాన్వితుడు. రాహుకేతువులు జంట సర్పాకారంలో కలిసి ఉండి, క్షీర సాగర మథనంలో శివునికి సాయం చేశారని ప్రతీతి. ఈ ఆలయం కేతు గ్రహానికి అంకితమైంది

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda