Online Puja Services

Om Tryambhakam Yajamahe

 Sugandhim Pushtivardhanam |

Urvarukamiva Bandhanan

 Mrityor Mukshiya Maamritat ||

కంచి లేదా కాంచీపురం అనగానే మనకు టక్కుమని గుర్తుకువచ్చేది కంచి పట్టు చీరలు, బంగారు, వెండి బల్లి మాత్రమే కాదు, సుమారు వెయ్యికిపైగా దేవాలయాలు కలిగి ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో ఎంటర్ అవ్వగానే మనం కొన్ని దశాబ్ధాలు వెనక్కి వెళ్లిపోతాం. చెన్నైకి 72కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి కంజీవరం అనే పేరు కూడా ఉంది. హిందువులకు మోక్షప్రదానమైన ఏడు నగరాల్లో కాంచీపురం ఒకటి. మోక్షభూమి, శక్తి భూమిగా ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువుల నమ్మకం. గరుడ పురాణం ప్రకారం మోక్షన్ని ఇచ్చే నగరాలు ఏడు అవి వరసగా అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతికా, ద్వారక, కంచి. అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగడుగునా దేవాలయాలే దర్శనమిస్తాయి. కంచి నగరంలో ఎక్కువగా ఆ పరమశివుడు మరియు విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. అందుకే కంచీపురంను 'శివకంచి' మరియు 'విష్ణు కంచి' అనే రెండు నగర భాగాలు ఉన్నాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉండటం విశేషం. అంతే కాదు ఇక్కడ ప్రసిద్ది చెందిన ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం కైలాసనాథర్  లేదా కైలాసనాథ్ ఆలయాలు కూడా సందర్శించతగినవి. మరి ఈ రోజు కైలాసనాథర్ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం...
 
కైలాసనాథర్ ఆలయం లేదా కైలసనాథ్ ఆలయం
 
కైలాసనాథర్  ఆలయం లేదా కైలసనాథ్ ఆలయం బహుశా నగరంలోని అతి పురాతన ఆలయం. 567వ సంవత్సరంలో కట్టారు, రాజసింహ పల్లవ రాజు 7వ శతాబ్దంలో విస్తరించారు. పల్లవులు నిర్మించిన ఈ ఆలయం అతిపురాతనమైనది. ఈ ఆలయం వాస్తు సంపదకూ, శిల్ప సంపదకూ, ఎన్నో అపురూప శిల్పాలకు ఎంతో ప్రసిద్ధమైనది. కైలాసనాథర్ ఆలయం శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది.
 
ఈ ఆలయం పల్లవ రాజు నరసింహవర్మన్ నిర్మించారు 
 
ఈ ఆలయంను శివుని మీద భక్తితో ఎనిమిది శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మన్ నిర్మించారు. చారిత్రక ప్రసిద్ధిని పొందిన ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పురాణ గాధ గురించి తెలియకున్నా నిర్మాణ విశేషాలు మాత్రం తరగనివే !
 
ఇసుకరాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధమనోహరంగా 
 
మిగిలిన ఆలయాల మాదిరి కొండరాతితో కాకుండా ఈ ఆలయం ఇసుకరాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధమనోహరంగా ఉన్నాయి. ఈ శిల్పాలు సున్నితమైన నైపుణ్యానికి ఒక ఉదాహరణ. మరో విశేషమేమిటంటే రాతి మీద నిర్మింపబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్ర కారులు పేర్కొనడం!అంతకు ముందు పల్లవులు నిర్మించినవి చాలా వరకు గుహాలయాలే!!
 
సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే
 
 సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే ఈ ఆలయ ప్రాంగణం లోనికి దక్షిణ దిశగా ప్రవేశ ద్వారం ఉంటుంది. గర్భాలయ వెలుపల చెక్కిన నిలువెత్తు సింహ (?) రూపాలు అబ్బుర పరుస్తాయి. . ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది.

గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు గల లింగ రూపంలో 
 
గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు గల లింగ రూపంలో శ్రీ కైలాస నాథర్ దర్శనమిస్తారు. ఎదురుగా నంది. నేటికీ నిత్య పూజలు జరగడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
 
ఈ ఆలయ నిర్మాణం 
 
సాధారణంగా ఆ సమయంలో నిర్మాణాలు మరియు భవనాలు నిర్మించడానికి ఉపయోగించిన ద్రావిడ నిర్మాణ సమకాలీకరణ ఉంది. ఆలయం చుట్టు పక్కల శివలీలలు, శివుని వివిధ స్వరూపాలు అద్భుతంగా మలచబడి ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దగా ఉంది.
 
మరో విశేషమేమింటంటే 
 
మరో విశేషమేమింటంటే శివలింగం పక్కన ఉండే బిలంలోకి వెళ్ళి బయటకి వస్తే మరుజన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఈ బిలం లోకి పాకుతూ సులభంగానే వెళ్ళవచ్చుకానీ బయటికి రావటం కొంచెం కష్టం.

సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం 
 
సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం వెలుపలి ప్రకారం, ప్రదక్షిణ ప్రాంగణం మరియు గర్భాలయం అనే మూడు భాగాలుగా ఉంటుంది. గర్భాలయాన్ని ముఖమండపాన్ని కలుపుతూ ఒక అర్ధమండపం ఉంటుంది. అవ్వడానికి విశాల ప్రాంగణం అయినా ప్రధాన ఆలయం చిన్న రాతిని కూడా వదల కుండా చెక్కిన శిల్పాలతో కిక్కిరిసి పోయినట్లుగా కనపడుతుంది. ప్రాకారానికి లోపలి వైపున ఎన్నో శివ రూపాలను చెక్కారు.

ఆలయం పై 'విమానం' 
 
సున్నితమైన నిర్మాణంతో పాటు, ఆలయం పై 'విమానం' మరియు మందిరంపై గోపురం ప్రసిద్ధి చెందింది. ఆలయం కూడా నటరాజ్ భంగిమలో ఉన్న శివుడి యొక్క నగిషీలు చెక్కి ఉన్న ప్యానెల్లు ఉన్నాయి.
 
భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఝాన కళా వైభవానికి కలికితురాయి 
 
ధ్యాన, నర్తన, అసుర సంహార,త్రిపురాంతక, రుద్ర, గంగాధర, లింగోద్భవ, భిక్షందార్, అర్ధనారీశ్వర ఇలా ఎన్నో ! అదే విధిగా శ్రీ గణపతి, శ్రీ కార్తికేయ, శ్రీ దుర్గ, శ్రీ విష్ణు రూపాలు కూడా కనపడతాయి. ఇవన్నీ మన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఝాన కళా వైభవానికి కలికితురాయి ఈ కైలాసనాథర్ దేవాలయం.

మండపం లోను, మండప స్తంభాల పైన ఎన్నో శాసనాలు 
 
మండపం లోను, మండప స్తంభాల పైన ఎన్నో శాసనాలు కనపడతాయి. వీటిల్లో చాలావరకు పల్లవ రాజులు శ్రీ కైలాస నాథర్ స్వామికి సమర్పించు కొన్న కానుకల వివరాలు మరియు వారి శివభక్తి తెలిపేవే !

రాజరాజచోళుడు ఈ కైలాసనాథార్ దేవాలయాన్ని దర్శించి ముగ్ధుడై 
 
రాజరాజచోళుడు ఈ కైలాసనాథార్ దేవాలయాన్ని దర్శించి ముగ్ధుడై, తంజావూరులో బృహధీశ్వరాలయం నిర్మించారని ప్రతీతి. 1400 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం వేదావతి నదీ తీరంలో కంచి పట్టణానికి పడమర దిక్కున బస్సు స్టాండ్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం ఇప్పుడు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది.

నారధుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం 
 
నారధుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. ఇక్కడ శివలింగం చుట్టూ ప్రదిక్షణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయ గర్భగుడిలో నల్ల గ్రానైట్ నుండి చెక్కబడిన ఏకైక 16-వైపుల శివలింగం (శివుడిని సూచించే చిహ్నంగా) కలిగి ఉంది. ఏది ఏమయినప్పటికీ, నిర్మాణం యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణం దాని ఉప-పుణ్యక్షేత్రాలు, అనేక స్తంభాలు చిన్న దేవతల శిల్పాలతో లేదా ఉపఆలయాలతో అలంకరించబడి ఉంటాయి.

అన్నింటి లోనికి కొన్ని శిల్పాలను అపురూపమైనవిగా 
 
అన్నింటి లోనికి కొన్ని శిల్పాలను అపురూపమైనవిగా పేర్కొనాలి. వీణ ధరించిన పరమేశ్వరుడు. నటరాజ నాట్య విన్యాసాన్ని తిలకిస్తున్న గణాలు, శ్రీహరి, విధాత ఇతర దేవతలు, సోమస్కంద మూర్తి, శ్రీ ఉమామహేశ్వరుడు ముఖ్యమైనవి. అన్నింటినీ వీక్షిస్తూ ప్రదక్షిణ పూర్తి చేసుకొని గర్భాలయానికి చేరుకోడానికి సన్నని మార్గం గుండా వెళ్ళాలి. దర్శనానంతరం మరో సన్నని మార్గం గుండా వెలుపలికి రావాలి. వీటిని జీవి పుట్టుక మరణానికి నిదర్శనాలుగా పేర్కొంటారు.

ఈ గుడి నిర్మాణంలో ఈ సొరంగం ఎంతో దోహద పడి ఉండవచ్చు 
 
ఈ గుడి నిర్మాణంలో ఈ సొరంగం ఎంతో దోహద పడి ఉండవచ్చు? కాని సుమారు *90 కిలోమీటర్లు సొరంగం* చెయ్యడము, దాన్ని ఉపయోగించడము, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, నిపుణత ఆ కాలంలో ఉండేవో, అలాంటివి మనం ఎంత కోల్పోయామో ఇప్పటి తరాలకు కనీసం తెలియజేసిన చాలు.

ప్రత్యేకతలు 
 
కంచీపురం పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ శిల్కు సొసైటీలు ఉన్నాయి. వివిధ రకాలకు చెందిన శిల్కు వస్త్రాలు, ముఖ్యంగా చీరలు ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ కంచి కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఇక్కడకు నిత్యం దేశ, విదేశాలకు చెందిన యాత్రికులు, వ్యాపారులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

ఎలా వెళ్లాలి 
 
కర్నూలు నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచీపురానికి వెళ్లాలంటే ముందుగా తిరుపతి లేదా చిత్తూరుకు చేరుకోవాలి. అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో వెళ్లవచ్చు. లేదంటే కర్నూలు నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి కంచికి చేరుకోవచ్చు. బస్సు సౌకర్యం చెన్నై నుంచి కంచి 65 కిలోమీటర్లు ఉంటుంది. జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి కంచికి నేరుగా ఆర్‌టీసీ బస్సు సౌకర్యం ఉండేది. అయితే పలు కారణాల వల్ల రద్దు అయ్యింది. రైలు మార్గం ద్వారా వెళ్లాలంటే కర్నూలు నుంచి తిరుపతికి వెళ్లాలి. అక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంది.

Videos View All

అర్ధ నారీశ్వర అష్టకం
శ్రీ శరభేశాష్టకమ్
చంద్రశేఖరాష్టకం
శ్రీ కాలభైరవాష్టకం
లింగాష్టకం | Lingastakam
విభూదిని ఈ మంత్రంతో ధరిస్తే,

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore