Online Puja Services

అలా రాములోరు సేదతీరిన ప్రాంతాలే మహా శివక్షేత్రాలయ్యాయి

18.218.127.141

అలా రాములోరు సేదతీరిన ప్రాంతాలే మహా శివక్షేత్రాలయ్యాయి . 
సేకరణ: లక్ష్మి రమణ 

రావణ వధ తర్వాత శ్రీరామ చంద్రుడు విభీషణునికి లంకా పట్టాభిషేకం చేశారు . ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినా , ఆయన్ని బ్రహ్మ హత్యాపాతకం వెంటాడింది, దానికి ఉపశమనాన్ని వెతుకుతూ ,  కొన్ని ప్రాంతాలలో ఆగారు .  సేద తీరారు .  పరమేశ్వరుని అర్చించారు. అలా రామునిచేత ప్రతిష్టించబడిన శివలింగాలు ఇప్పటికీ భక్తులకి కొంగుబంగారమై కోరిన కోర్కెలను తీరుస్తున్నాయి . 

రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు. వందారుమూలైలో ఉన్నప్పుడు రాములవారికి అనుమానం తలెత్తింది .  రావణుడు బ్రాహ్మణుడు.  అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా! అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరారు . 

అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి , నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రామునికి సూచన చేశారట .  దీంతో రాములోరు  లంకలో ‘మానావారి’ అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దీన్ని ‘రామలింగ శివుడనే ‘ పేర కొలుస్తారు. 

ఆ తరువాత , ‘తిరుకోణేశ్వరం’లో, అక్కడి నుంచి ‘తిరుకేదారేశ్వరం’లో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించారు.  చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. 

పుష్పకంపై తిరిగి వెళ్తూ, శ్రీరామచంద్రుడు  రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లారని కూడా ఒక కథనం వ్యాప్తిలో ఉంది .  మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore