Online Puja Services

ఓ రాముడి కధ

3.141.24.134

ఓ రాముడి కధ 

ఇలా రాముడు అని ఎందుకు అన్నాను చివరిలో అర్థం అవుతుంది.. నా స్నేహితురాలు తను నాకన్నా పెద్దది వెంకటేశ్వర స్వామి భక్తురాలు రోజు ఉదయం స్నానం చేయగానే తన సెల్ఫ్ లో ఉన్న చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర నిల్చుని భక్తిగా స్త్రోత్రలు పాడుతుంది హాస్టల్ లో అప్పటికి ఎవ్వరు లేచి ఉండరు.. తన తండ్రి దగ్గర నుండి వచ్చిన అలవాటు వాళ్ళ నాన్న గారు వెంకటేశ్వర స్వామి కి పరమ భక్తుడు. నిత్యం స్వామి నామ స్మరణచేస్తూ ఉంటారు ఆయన చేసే ఉద్యోగం సర్కిల్ఇన్స్పెక్టర్ (CI) కడప జిల్లా లో స్వామి కి పూజ చేసి డ్యూటీ కి వెళ్తారు ఎంతో నిష్ఠ నియమం కలికిన వ్యక్తి నీతి నిజాయితీ వారు చేసే ఉపాసన. నెల జీతం అప్పటిలో చాలా తక్కువ ఎవరైనా వారి సంతోషం కోసం కానుకగా ఇచ్చిన ఎక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోరు కూతురు చదువు పూర్తి కావస్తోంది పెళ్లి చేయాలి ఏమీ కూడా బెట్టలేదు ఎలా చేస్తారు అని అడిగితే అంతా ఆ శ్రీనివాసుడు చూసుకుంటాడు అని మాట డాటేసే వారు కానీ దిగులు లేకుండా ఉండదు కదా..

ఇంతలో వారి పెద్దమ్మాయి (నా ఫ్రెండ్) ఒక అబ్బాయిని ఇష్టపడింది అని వారి ఇంట్లో తెలిసింది అతను వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడటానికి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని వారి ఇంటికి వెళ్లారు CI కదా బాగానే సంపాదించి ఉంటారు కట్నం కూడా బాగానే వస్తుంది అని అబ్బాయి వాళ్ళ అమ్మ పిల్లని చూడకుండానే పెళ్లికి ఒప్పుకుంది.. తీరా వారి ఇంటికి వెళ్లి చూస్తే ఎప్పుడో కొన్న పాత కుర్చీలు బల్లలు.. ఇంట్లో కనీసం. సరైన ఫర్నిచర్ కానీ ఖరీదైన ఏ వస్తువు లేదు సాదా సీదాగా ఉంటే govt క్వార్టర్స్ అంతా దగ్గర దగ్గర గా ఉండే ఒక పోలీస్ కాలనీ భార్య మెడలో కూడా సూత్రం తప్పా ఘనంగా ఏమీ లేదు వారి అంచనా కి తగట్టు ఏమీ లేదు కానీ వారి ఇంటికి పెళ్లి సంబంధం వచ్చారు అని ఇంటి ముందు జనం మటుకు ఎన్నికల ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్టు గొంతు కూర్చున్నారు జనం. వారు ఏమీ అడగక ముందే పెళ్లి కడుకు తల్లిదండ్రులతో నేను కట్నాలు ఏమీ ఇచుకోలేనమ్మా పెళ్లి మటుకు చేయిస్తాను అన్నారు మీరు ఆలోచించి కబురు పెట్టండి అని చెప్పారు.. అబ్బాయి చాలా బాగున్నాడు చెన్నై లో పెద్ద కం లో సాఫ్ట్వేర్ engg 1.50 lac జీతం ఎక్కడైనా కనీసం 25 లక్క కట్నం ఇచ్చే సంబంధం వాళ్ళ అమ్మ ఆ విధంగా ఆలోచిస్తుంది.. అబ్బాయి నాన్న గారు మటుకు ఆయన మొహం చూస్తే చాలా ఉత్తముడు గా ఉన్నాడు ఒక CI అన్న ఆర్భాటం గర్వం ఏమీ లేదు అతనిలో ఎంత ప్రశాంతంగా ఉన్నారు అతను అన్నారట.. అమ్మాయి కూడా చాలా బాగుంటుంది మంచి పిల్ల వాళ్ళ అమ్మ ఒప్పుకోక పోయిన బలవంతంగా మొండిగా పెళ్లికి ఒప్పిచ్చాడు అతను మళ్ళీ 3 నెలలు తర్వాత వాళ్ళ అమ్మ ఒప్పుకుంది అని కబురు పెట్టారు.. ఇతను వాళ్ళ అమ్మకు తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్లి 2 lac ఇచ్చి ఏదైనా ఖర్చులకు ఉపయోగ పడుతుంది ఉంచండి మామయ్య అన్నారట ఆయన ఆ డబ్బు తీసుకోలేదు అతని చై పట్టుకుని దేవుడి దగ్గరకు తీసుకొని వెళ్లి దేవుడికి నమస్కారం చేసే నారాయణ నారాయణ అని ఏడుస్తున్నాడట కానీ ఏమీ మాట్లాడలేదట తర్వాత ఆయన్ని ఓదార్చి ఏమీ అయ్యింది అని అడిగితే నా బిడ్డకు ఏమీ కట్నాలు ఇవ్వలేక పోతున్నాను అత్తగారి ఇంట్లో నా కూతురు ఎలా ఉంటుంది ఏమంటారో అని చాలా భయపడ్డాను కానీ ఇలా డబ్బు నా చేతికి ఇచ్చి ఖర్చులకు ఉంచుకో అంటున్నావు బాబు ఇంత ఉత్తముడిని అల్లుడుగా ఇచ్చి నందుకు ఆ నరాయణుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నా ను అన్నారట.. తనకు ఏ కష్టం రానివ్వను అని చెప్పి ఆ 2 lac ఎవ్వబోతే వాళ్ళు తీసుకోలేదు అలా తీసుకోవడం మర్యాద కాదు వద్దు అన్నారు బలవంతంగా నా భార్యకు కావాల్సిన వి కొనండి తను మా బంధువులు నలుగురిలో తక్కువ కాకూడదు అని ఆ డబ్బు ఇచ్చి వెళ్లిపోయారు అతను..

పెళ్లి ఉన్నంతలో బాగానే జరిగిపోయింది.. అత్తగారి ఇంట్లో అల్లడు ఉంటాడు కదా కొద్దిరోజులు అలా అత్తగారి ఇంట్లో కొత్త అల్లడు ఉదయాన్నే అలా బయటకు వెళ్లి వస్తాను అని వాకింగ్ లాగా వెళ్లారట దారి పొడవునా పలానా వారి అల్లుడు అని చెప్పుకుని నమస్తే బాబు అంటూ ప్రతి ఒక్కరు ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆశీర్వదిస్తూ ఆడవాళ్లు చేతితో దిష్టి తీస్తూ.. అల్లుడు అని కొందరు కొడుకు అని కొందరు వరసలు కలిపి మాట్లాడుతూ వారి ఆప్యాయత అభిమానం కి చాలా మొహమాట పడుతూ ఇంక బయటకు కూడా రాలేను బాబోయ్ అనుకుంటూ వెనక్కి తిరిగి ఇంటికి చేరుకున్నాక అక్కడ కానిస్టేబుల్ ని ఎందుకు అందరూ అంత ఆఫక్షన్ చూపిస్తున్నారు అని అడిగారట వాళ్ళ మామ గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎంత గొప్ప వ్యక్తి కి అల్లుడు ఐయ్యారు అని అప్పుడే అర్థం అయ్యింది అతనికి ఏ రోజు ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు సమస్యలతో వచ్చిన ఎందరికో అండగా నిలబడ్డారు అన్యాయం అయిపోయిన కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వారి తరపున ఉండి న్యాయం చేశారు చిన్న కష్టంలో ఉన్న వారిని చూసిన చలించిపోతాడు ఈయన లంచం తీసుకోరు అని ఇతనితో ఏ పని జరగదు అని.పెద్ద వాళ్ళు దగ్గరకు కూడా రారు.. ఎన్ని బెదిరించిన ఆయన భయపడి నియమం ఎప్పుడూ తప్పలేదు అన్నిటికి ఆ శ్రీనివాసుడు ఉన్నాడు అని నమ్ముతారు అంత మంచివారికి మీ అంత గొప్ప అల్లుడు రావడం. కూడా ఆ శ్రీనివాసుడు దయ మీ మంచితనం గురించి మీ మామ గారు అందరికి గొప్పగా చెప్పారు మామకు తగ్గ అల్లుడు అని అందరూ మీమల్ని అభిమానిస్తున్నారు అని చెప్పారట..

చెన్నై లో కాపురానికి తీసుకొని వెళ్ళాడు అతని మనసులో ఎదో అసంతృప్తి భార్యని చెన్నై లో వదిలి నేరుగా వాళ్ళ మామ గారి దగ్గరకు వచ్చి మామయ్య మీకు ఉన్న ఇంకో ఇద్దరి అబ్బాయిలు నాకు సొంత చెల్లు లు అనుకుంటాను వాళ్ళ చదువు కు అవుతున్న ఖర్చు అంతా నేనె పెట్టి చదివిస్తాను బాగా చదివించండి అన్నాడట.. అందరూ చాలా సంతోషపడ్డారు అసలే వెంకటేశ్వర స్వామి అంటే పిచ్చి నమ్మకం ఇంక ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది ఉహించండి స్వామి కి కోటి దండాలు పెట్టుకుంటున్నారు.. అన్ని ఇచ్చిన ఆడపిల్ల సుఖంగా ఉంటుంది అని గ్యారంటీ లేని రోజులివి అందుకే ఆంత సంతోషం..

వాళ్ళ మామ గారిని రోజు స్వామిని ఏమీ కోరుకుంటారు మామయ్య అని అదిగితే ఆయన నోటితో అన్న మాటలు నాకు ఇలాంటి భార్య ని ఇచ్చి నందుకు స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను మళ్ళీ జన్మ ఉన్నా ఈ ఉత్తమురాలే నా భార్యగా కావాలి అని కోరుకుంటూను అన్నారట అప్పటి వరకు మామగారు చాలా గ్రేట్ అని చెన్నై నుండి వచ్చిన అల్లుడు అత్త వైపు చూస్తున్నాడు పెద్దగా చదువు లేదు మాట్లాడటం కూడా సరిగ్గా వచ్చో లేదో అన్నట్టు ఉండే అత్తగారి గురించి అలా అంటున్నారు.. ఇలా చెప్తున్నారు ఆమె గురించి ఏ రోజు కూడా ఇది కావాలి అది కావాలి అని అడగటం కానీ నలుగురి ని చూసి అది తీసుకురా ఇది తెచ్చి పెట్టు అని నా శక్తికి మించినవి ఏమీ కోరలేదు ఖరీదైన బట్టలు నగలు ఇంట్లో ఖరీదైన సామాన్లు విలాసవంతమైన జీవితం గడపాలి అనే ఆశ ఆమెకు ఉందొ లేదో కూడా నాకు తెలియదు ఏ రోజు తను నాతో చెప్పుకోలేదు నాతో ఎప్పుడూ ఆమె సంతోషంగా నే ఉంటుంది పిల్లలు కూడా నన్ను అది కావాలి అని ఏ రోజు విసిగించలేదు పిల్లలకు అలా తను ఏమీ చెప్పి పెంచిందో కూడా నాకు తెలియదు.. నా బిడ్డ కూడా ఇది కావాలి అని అడిగితే నేను అంత డబ్బు ఎక్కడ తేవాలి అని ఒక్కోసారి అనిపిస్తుంది కానీ నేనుగా ఇచ్చినవే కానీ వాళ్లుగా నోరు తెరచి నన్ను ఏమీ అడగలేదు ఒకవేళ ఏదైనా ఆర్భాటాలు కోసం. నా శక్తికి మించి నా భార్య కోరి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో.. ఇంత తృపి కలిగిన జీవితం నా ఆదర్శాలకు తగ్గ విధంగా నేను జీవిస్తున్నాను అంటే అంత ఉత్తమురాలు భార్యగా ఉండటమే ఆమె నా అదృష్టం అన్నారు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతే అక్కడ విన్న వాళ్ళు మటుకు ఆమెకి నమస్కారం చేశారు గౌరవంగా.. మామ గారే గొప్ప అనుకుంటే ఆయన్ని అంత గొప్ప స్థానంలో నిలబెట్టిన అత్తగారు ఇంక ఎంత గొప్పది విలువలతో జీవితం విలువైన జీవితం అటువంటి వాళ్ళ ఇంటి బిడ్డ ని చేసుకున్న నేను చాలా అదృష్టవంతున్నీ అనుకుంటూ చెన్నై వెళ్లిపోయారు.. తర్వాత తను నాకు ఫోన్ చేసి జరిగింది చెప్పి ఆ శ్రీనివాసుడికి శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఫోన్ పెట్టేసింది.. నీతికోసం నిజాయితీగా ధర్మంగా బతికే అతను రాముడు కాదంటారా ఆ తల్లి సీతమ్మ తల్లి కాదంటారా..

ఉన్నంతలో భార్య తృప్తిగా సంతోషంగా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉంటుంది ఆమె భర్త కూడా సంపాదనకు అడ్డదారులు తొక్కడు. నీ భర్త మహారాజు అని అనుకుంటే నువ్వు మహరనణివి నీ భర్త ని దరుద్రుడు అంటే నువ్వు దారుద్రురాలే అవుతావు నీ భర్తకు లేని స్తానం నీకు లేనట్టే కధ నలుగురిలో చేతకాని వెధవ పనికి మాలిన వాడు అని మాట్లాడే ఆడవాళ్లను చాలా మందిని చూసాను అలా చెప్తే పోయేది నీ పరువే కదా. నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావో అంతే కదా నీకు లభిస్తుంది.. నువ్వు బాగా పుణ్యం చేసి ఉండాల్సింది అతని శక్తి కొద్దీ కష్టపడుతున్నాడు అని గుర్తిస్తే అలాంటి మాటలు అనరు..

ఎంతో మంది భర్త క్షేమం కోసం అతని అభివృద్ధి కోసమే ఎన్నో. పూజలు పరిహారాలు చేస్తున్న ఆడవాళ్లు ఉన్నారు.   అటువంటి తల్లులందరికి ఆ జగన్మాత తోడుగా ఉండి వారి పూజలు ఫలిచాలి.. ఒకప్పుడు ఆడవాళ్లు కుటుంబం లో ఎన్ని సమస్యలు ఉన్నా కష్టాలను కడుపులో దాచుకునే వారు పుట్టింట్లో కూడా భర్తని తక్కువ చేసి మాట్లాడే వారు కాదు.. భర్త ఎలాంటి వాడు అయిన బిడ్డలకోసం సద్దుకునే వారు అందుకే సంసారాలు నిలిచేది.. చిన్న చిన్న వాటికి కోర్ట్ కి ఎక్కే వాళ్ళు కాదు నువ్వు ఎంత ఆంటే నువ్వు ఎంత అని కయ్యానికి కాలు దువ్వరు ఆర్థిక స్వేచ్ఛ ఆడవాళ్లకు సమాజంములో తనను తాను గౌరవంగా రక్షించుకోవడానికి కుటుంభంకి సహాయంగా అంతే కానీ సంసారాన్ని కాళ్లతో తన్నడానికి కాదు. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకూడదు ఒక వేళ చేసుకుంటే కుటుంబ స్త్రీలకు ఉండే ధర్మం గుర్తు పెట్టుకుని అలా ఉంటేనే గౌరవం.

పెళ్లికి ముందు శుభ్రంగా అందంగా ఉంటారు పెళ్లి ఐయ్యాక వీడి మొహానికి ఎందుకు అనుకుంటారో ఏమో కాని చింపిరి చింపిరిగా ఉంటారు.. ఎప్పుడూ అనుమణిస్తూ నిజంగా ఎవరినైనా తగులుకునే వరకు రెచ్చగొడతారు.. మగవాళ్ళు కూడా అంతే బిడ్డలు కన్న భార్య ఎలా ఉంటుంది పెళ్లి అప్పుడు ఉన్నట్టే మీరు ఎల్లకాలం. ఉండరు కదా మీరు ఇంకో ఆడవాళ్లు చూసి నట్టు మీ భార్యలు తయారు అయితే ఉహించడానికి కూడా మనసు రాదు కదా భర్త విషయంలో ఆడవాళ్లు ఇంకా ఎక్కువ పోసిసివే గా ఉంటారు.. అర్థం చేసుకునే ప్రతి భార్య సీతమ్మ తల్లి అలాగే కుటుంబానికి ధర్మానికి విలువను ఇచ్చే వ్యక్తి రాముడే.. ఒక్కరు తప్పు చేసిన పరోక్షంగా ఇంకొకరు కూడా బాద్యులే.. అవుతారు.. సరద్దుకోవడం లో సంతోషం ఉంటుంది.. పంతాలకు పోతే పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. అందరిని ఎడిపిస్తూ ఎన్ని పూజలు శాంతులు చేసిన ఉపయోగం లేదు. భార్య కష్టంలో ఓదార్పు ధైర్యం కావాలి తల్లిగా ప్రేమించాలి అలాగే భర్త కూడా మీరే ప్రపంచం అనుకునే భార్యని బాధ పెట్టకుండా చూసుకోవాలో. ధర్మిని ధర్మవర్దిని అమ్మవారు నువ్వు నీ ధర్మాన్ని నిర్వహిస్తే అదే ఉపాసన అవుతుంది. 

శ్రీ మాత్రే నమః

 
- భానుమతి అక్కిశెట్టి 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore