జన్మ సాఫల్య మంత్రం - శ్రీ రామ రక్షా స్తోత్రం

3.235.176.80
భాగవతోత్తములకు నమస్కారములు.
 
అయ్యా, ఇది గొప్పకు  చెప్పడం కాదు. చెప్పకుండా వుండలేక చెబుతున్నాను. సమయానికి ఇది నాకు గుర్తు చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ చెబుతున్నా.
 
జన్మ సాఫల్య మంత్రం ఇది. ఆపదలలో సంజీవిని లాగ పని చేస్తుంది. ఈ రామ రక్షా స్తోత్రం నిజంగానే మృత సంజీవిని. దిక్కుతోచని స్థితిలో పరమాత్భుతంగా పని చేసి అఖండమైన తేజస్సును, వెలుగును, జ్ఞానమును, చూపి బుద్ధిని మంచి వైపు ప్రచోదనం చేస్తుంది. ఈ మహా మంత్రముతో ఏన్నో ప్రయోగములు చేసి ఏందరనో ఆపదలో నుంచి గట్టేక్కించాను. ఈ మంత్రం సిద్ధ పొందడానికి ఇది అనువైన కాలము శరన్నవరాత్రులు మరియు వసంత నవరాత్రులు.

పాడ్యమి నుంచి దశమి దాక పది రోజులు, రోజుకు 11 పర్యాయములు చొప్పున పారాయణ చేసినచో మంత్ర సిద్ధి కలుగును. ఆ పైన ఏప్పుడు కావాలంటే అప్పుడు ఈ మంత్రం తో అభిమంత్రించి ఇవ్వవచ్చును. ఆరోగ్యం సరిగా లేని వారికి తల మీద చేయి వుంచి ఓక్కసారి చదివితే చాలు రోగం పోతుంది. జైలుకు వెళ్ళిన వాళ్ళు, తప్పి పోయిన వాళ్ళు తిరిగి వస్తారు .
విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా అన్యోన్యంగా తిరిగి వస్తారు.
 
*శ్రీ బుధకౌశిక ఋషి విరచిత శ్రీరామరక్షా స్తోత్రం - తాత్పర్యము*
 
'రాం' అనే అక్షరం అగ్ని స్వరూపం. అంతటి మహిమాన్వితమైన బీజాక్షరం మరొకటి లేదని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి దీనికి దేవత అయిన శ్రీ రాముడు ఎంత మహిమాన్వితుడో మనకు వాల్మీకి మహర్షి విపులంగా రామాయణ మహాకావ్యంలో చెప్పాడు.
మానవునిగా పుట్టి, ధర్మ సంరక్షణకోసం, సత్య వాక్పరిపాలన కోసం ఆదర్శ జీవనాన్ని గడిపిన ఆ ధర్మమూర్తి రామచంద్రుని స్మరిస్తే సకల భయాలు, ఆపదలు, పాపాలు తొలగుతాయని, మోక్షము కలుగుతుందని ఎన్నలేని నిదర్శనాలు ఈ భారత భూమిపై కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి.

ఎందరో ఋషులు, యోగులు, కవులు, పండితులు, పరమ భక్తులు, వాగ్గేయ కారులు ఈ రామ నామ మహిమను వివరించారు, నుతించారు. స్వయంగా పరమశివుడే పార్వతికి ఈ రామ నామ మహత్తును చెప్పాడుట.
 
ఆ రాముని నుతిస్తూ బుధ కౌశిక ముని ఈ రామ రక్షా స్తోత్రాన్ని రచించారు. ఇది ఎంతో ఫలదాయకమైనది, మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఇందులో వేర్వేరు మూలాలనుంచి రామ మహిమను చెప్పే శ్లోకాలను పొందు పరచారు.
 
- దేవకీ నందన్ 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi