Online Puja Services

శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం

3.17.183.24

శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం
-సేకరణ: లక్ష్మి రమణ 

‘మార్గశీర్షం’ ఒక విలక్షణమైన మాసం. ‘మార్గశీర్షం’ అంటే మార్గాలలో శ్రేష్ఠమైంది... ఉపయోగకరమైందని అర్థం. అది ఏ మార్గం అంటే భగవంతుని పొందు భక్తిమార్గం. శీర్షప్రాయమైన ఈ మార్గం మిగిలిన మార్గాలన్నింటికన్నా ప్రధానమైంది. ప్రాముఖ్యతతోపాటు పవిత్రత కూడా ఏర్పడటం ఇది శ్రేష్టమైనది. శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం. ‘బృహత్సామ తథాసామ్నాం- గాయత్రీ ఛందసా మహం- మాసానాం మార్గశీర్షోహ- ఋతూనాంకుసుమాకరం’ అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, ఆరు ఋతువులలో పుష్పసౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు.. మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది.

సూర్య భగవానుడు పన్నెండు నెలల్లో నెలకి ఒక మాసం చొప్పున మారుతూ ఉండేదాన్ని ‘మాస సంక్రమణం’ అంటారు. ఇలా సంవత్సరానికి పన్నెండు సంక్రమణలు వస్తాయి. సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోనికి ప్రవేశించడం వృశ్చిక సంక్రమణం అంటారు. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసం. హిందువులకు పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం.

ఈ మాసమంతా శ్రీమహావిష్ణువును తులసీ దళంతో పూజించడం పుణ్యప్రదం. శుక్లపక్ష ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీహరితోపాటు సూర్యభగవానుని పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః, ఓ నమో నారాయణయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్రం వివరిస్తుంది. రోజూ బ్రాహ్మీముహూర్తంలో తులసి సన్నిధిలోని మట్టి, ఆకులను తీసుకుని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానం చేయాలి.

మార్గశిర గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీని పూజిస్తూ ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’ చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మార్గశిర మాసంలో భగవంతునిలో లయించాలనే తపన కలిగినవారు వైష్ణవ ప్రధానమైన లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి అర్హులే. ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూధనుడు’ అనే నామంతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమైనట్లే. రోజూ వైష్ణవలయాల్లోప్రత్యేక అర్చరలు జరుగుతాయి ‘మార్గళివ్రతం’ అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసమంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాశురంతో స్వామిని కీర్తించింది. మార్గశీర్షంలో మృగశిరతో కూడిన పూర్ణిమ శ్రేష్ఠం. లవణం దానం చేయడం, మార్గశిర మాస విధులను పాటించడం వల్ల అనంత పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి.

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha