విద్యార్థులకు జ్ఞానప్రదాత - హయగ్రీవుడు

54.165.57.161

విద్యార్థులకు జ్ఞానప్రదాత - హయగ్రీవుడు!!

శ్రావణ పౌర్ణమి రోజున హాయగ్రీవ స్తోత్రపారాయణం
వల్ల విశేష ఫలితం...
...

విద్యకు అధిపతి హయగ్రీవుడుసాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు, ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ వుంటారు. అలా తన భక్తులను చల్లగా చూడటం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతా రాల్లో 'హయగ్రీవావతారం' ఒకటి. 

పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు ... బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారాన్ని పోలి నవారి చేతిలో మాత్రమే తన కి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు.

వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానార కాలుగా హింసించ సాగాడు. దాంతో దేవత లంతా ఆది దంపతులను శరణువేడారు. యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డంకింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు.వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల ... శరీరం నుంచి వేరై పోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవాధి దేవతలు తమ జ్ఞానాన్ని ... శక్తి సామర్ధా్యలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు

ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా ... జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతా రాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య - విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

 విద్యార్థులకు జ్ఞానప్రదాత

గుర్రం శిరస్సును పొందిన నారాయణుడుకి సమస్త దేవతలు తమ జ్ఞాన శక్తిని ధారపోస్తారు. దాంతో హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడతాడు. 

అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. 

నారాయణుడు ... హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధి స్తారో, వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ ... విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది. ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలను అందుకుంటున్నాడు. అందువలన విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవస్వామిని ఆరాధిస్తూ వుండాలి. ఆయన అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తూ వుండాలి.

జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే 

 శ్రీహయగ్రీవపూజావిధి స్తోత్రం చ 

రుద్ర ఉవాచ .-
పునర్దేవార్చనం బ్రూహి హృషీకేశ గదాధర .
శృణ్వతో నాస్తి తృప్తిర్మే గదతస్తవ పూజనం .. 1..

హరిరువాచ .
హయగ్రీవస్య దేవస్య పూజనం కథయామి తే .
తచ్ఛృణుష్వ జగన్నాథో యేన విష్ణుః ప్రతుష్యతి .. 2..

మూలమంత్రం మహాదేవ హయగ్రీవస్య వాచకం .
ప్రవక్ష్యామి పరం పుణ్యం తదాదౌ శృణు శంకర .. 3..

ఓం హౌం క్ష్రౌం శిరసే నమః ఇతి ప్రణవసంయుతః .
అయం నవాక్షరోమంత్రః సర్వవిద్యాప్రదాయకః .. 4..

అస్యాంగాని మహాదేవ తాంఛృణుష్వ వృషధ్వజ .

ఓం క్ష్రాం హృదయాయ నమః .
ఓం క్ష్రీం శిరసే స్వాహాయుక్తం శిరః ప్రోక్తం క్ష్రూం వషట్ తథా .. 5..

ఓంకారయుక్తా దేవస్య శిఖా జ్ఞేయా వృషధ్వజ .
ఓం క్ష్రైం కవచాయ హుం వై కవచం పరికీర్తితం .. 6..

ఓం క్షౌం నేత్రత్రయాయ వౌషట్ నేత్రం దేవస్య కీర్తితం .
ఓం హః అస్త్రాయ ఫట్ అస్త్రం దేవస్య కీర్తితం .. 7..

పూజావిధిం ప్రవక్ష్యామి తన్మే నిగదతః శృణు .
ఆదౌ స్నాత్వా తథాఽఽచమ్య తతో యాగగృహం వ్రజేత్ .. 8..

తతః ప్రవిశ్య విధివత్కుర్యాద్వై శోషణాదికం .
యం క్షౌం రమితి బీజైశ్చ కఠినీకృత్య లమితి .. 9..

అండముత్పాద్య చ తతః ఓం కారేణైవ భేదయేత్ .
అండమధ్యే హయగ్రీవమాత్మానం పరిచింతయేత్ .. 10..

శంఖకుందేందుధవలం మృణాలరజతప్రభం .
గోక్షీరసదృశం తద్వత్సూర్యకోటిసమప్రభం .
శంఖం చక్రం గదాం పద్మం ధారయంతం చతుర్భుజం .. 11..

కిరీటినం కుండలినం వనమాలాసమన్వితం .
సురక్తం సుకపోలం చ షీతాంబరధరం విభుం .. 12..

భావయిత్వా మహాత్మానం సర్వదేవైః సమన్వితం .
అంగమంత్రైస్తతో న్యాసం మూలమంత్రేణ వై తథా .. 13..

తతశ్చ దర్శయేన్ముద్రాం శంఖపద్మాదికాం శుభాం .
ధ్యాయేద్ధ్యాత్వార్చయేద్విష్ణుం మూలమంత్రేణ శంకర .. 14..

తతశ్చావాహయేద్రుద్ర దేవతా ఆసనస్య యాః .
ఓం హయగ్రీవాసనస్య ఆగచ్ఛత చ దేవతాః .. 15..

ఆవాహ్య మండలే తాస్తు పూజయేత్స్వస్తికాదికే .
ద్వారే ధాతుర్విధాతుశ్చ పూజా కార్యా వృషధ్వజ .. 16..

సమస్తపరివారాయ అచ్యుతాయ నమ ఇతి .
అస్య మధ్యేఽర్చనం కార్యం ద్వారే గంగాంచ పూజయేత్ .. 17..

యమునాం చ మహాదేవీం శంఖపద్మనిధీ తథా .
గరుడం పూజయేదగ్రే మధ్యే శక్తించ పూజయేత్ .. 18..

ఆధారాఖ్యాం మహాదేవ తతః కూర్మం సమర్చయేత్ .
అనంతం పృథివీం పశ్చాద్ధర్మజ్ఞానౌ తతోఽచయేత్ .
వైరాగ్యమథ చైశ్వర్యమాగ్నేయాదిషు పూజయేత్ .. 19..

అధర్మాజ్ఞానావైరాగ్యానైశ్వర్యాదీంస్తు పూర్వతః .
సత్త్వం రజస్తమశ్చైవ మధ్యదేశేఽథ పూజయేత్ .. 20..

కందం నాలం చ పద్మం చ మధ్యే చైవ ప్రపూజయేత్ .
అర్కసోమాగ్నిసంజ్ఞానాం మండలానాం హి పూజనం .
మధ్యదేశే ప్రకర్తవ్యమితి రుద్ర ప్రకీర్తితం .. 21..

విమలోత్కర్షిణీ జ్ఞానా క్రియాయోగే వృషధ్వజ .
ప్రహ్వీ సత్యా తథేశానానుగ్రహాః శక్తయో హ్యమూః .. 22..

పూర్వాదిషు చ పత్రేషు పూజ్యాశ్చ విమలాదయః .
అనుగ్రహా కర్ణికాయాం పూజ్యా శ్రేయోఽర్థిభిర్నరైః .. 23..

ప్రణవాద్యైర్నమోఽన్తైశ్చ చతుర్థ్యంతైశ్చ నామభిః .
మంత్రైరేభిర్మహాదేవ ఆసనం పరిపూజయేత్ .. 24..

స్నానగంధప్రదానేన పుష్పధూపప్రదానతః .
దీపనైవేద్యదానేన ఆసనస్యార్చనం శుభం .. 25..

కర్తవ్యం విధినానేన ఇతి తే హర కీర్తితం .
తతశ్చావాహయేద్దేవం హయగ్రీవం సురేశ్వరం .. 26..

వామనాసాపుటేనైవ ఆగచ్ఛంతం విచింతయేత్ .
ఆగచ్ఛతః ప్రయోగేణ మూలమంత్రేణ శంకర .. 27..

ఆవాహనం ప్రకర్తవ్యం దేవదేవస్య శంఖినః .
ఆవాహ్య మండలే తస్య న్యాసం కుర్యాదతంద్రితః .. 28..

న్యాసం కృత్వా చ తత్రస్థం చింతయేత్పరమేశ్వరం .
హయగ్రీవం మహాదేవం సురాసురనమస్కృతం .. 29..

ఇంద్రాదిలోకపాలైశ్చ సంయుతం విష్ణుమవ్యయం .
ధ్యాత్వా ప్రదర్శయేన్ముద్రాః శంఖచక్రాదికాః శుభాః .. 30..

పాద్యార్ఘ్యాచమనీయాని తతో దద్యాచ్చ విష్ణవే .
స్నాపయేచ్చ తతో దేవం పద్మనాభమనామయం .. 31..

దేవం సంస్థాప్య విధివద్వస్త్రం దద్యాద్వృషధ్వజ .
తతో హ్యాచమనం దద్యాదుపవీతం తతః శుభం .. 32..

తతశ్చ మండలే రుద్రం ధ్యాయేద్దేవం పరేశ్వరం .
ధ్యాత్వా పాద్యాదికం భూయో దద్యాద్దేవాయ శంకర .. 33..

దద్యాద్భైరవదేవాయ మూలమంత్రేణ శంకర .
ఓం క్షాం హృదయాయ నమః అనేన హృదయం యజేత్ .. 34..

ఓం క్షీం శిరసే నమశ్చ శిరసః పూజనం భవేత్ .
ఓం క్షూం శిఖాయై నమశ్చ శిఖామేతేన పూజయేత్ .. 35..

ఓం క్షైం కవచాయ నమః కవచం పరిపూజయేత్ .
ఓం క్షౌం నేత్రాయ నమశ్చ నేత్రం చానేన పూజయేత్ .. 36..

ఓం క్షః అస్త్రాయ నమ ఇత్యస్త్రం చానేన పూజయేత్ .
హృదయం చ శిరశ్చైవ శిఖాం చ కవచం తథా .. 37..

పూర్వాదిషు ప్రదేశేషు హ్యేతాస్తు పరిపూజయేత్ .
కోణేష్వస్త్రం యజేద్రుద్ర నేత్రం మధ్యే ప్రపూజయేత్ .. 38..

పూజయేత్పరమాం దేవీం లక్ష్మీం లక్ష్మీప్రదాం శుభాం .
శంఖం పద్మం తథా చక్రం గదాం పూర్వాదితోఽర్చయేత్ .. 39..

ఖడ్గం చ ముసలం పాశమంకుశం సశరం ధనుః .
పూజయేత్పూర్వతో రుద్ర ఏభిర్మంత్రైః స్వనామకైః .. 40..

శ్రీవత్సం కౌస్తుభం మాలాం తథా పీతాంబరం శుభం .
పూజయేత్పూర్వతో రుద్ర శంఖచక్రగదాధరం .. 41..

బ్రహ్మాణం నారదం సిద్ధం గురుం పరగురుం తథా .
గురోశ్చ పాదుకే తద్వత్పరమస్య గురోస్తథా .. 42..

ఇంద్రం సవాహనం చాథ పరివారయుతం తథా .
అగ్నిం యమం నిరృతిం చ వరుణం వాయుమేవ చ .. 43..

సోమమీశాననాగాంశ్చ బ్రహ్మాణం పరిపూజయేత్ .
పూర్వాది చోర్ధ్వపర్యంతం పూజయేద్వృషభధ్వజ .. 44..

వజ్రం శక్తిం తథా దండం ఖడ్గం పాశం ధ్వజం గదాం .
త్రిశూలం చక్రపద్మే చ ఆయుధాన్యథ పూజయేత్ .. 45..

విష్వక్సేనం తతో దేవమైశాన్యాం దిశి పూజయేత్ .
ఏభిర్మంత్రైర్నమోఽన్తైశ్చ ప్రణవాద్యైర్వృషధ్వజ .. 46..

పూజా కార్యా మహాదేవ హ్యనంతస్య వృషధ్వజ .
దేవస్య మూలమంత్రేణ పూజా కార్యా వృషధ్వజ ..
గంధం పుష్పం తథా ధూపం దీపం నైవేద్యమేవ చ .. 47..

ప్రదక్షిణం నమస్కారం జప్యం తస్మై సమర్పయేత్ .
స్తువీత చానయా స్తుత్యా ప్రణవాద్యైర్వృషధ్వజ .. 48..

అథ స్తోత్రం

ఓం నమో హయశిరసే విద్యాధ్యక్షాయ వై నమః .
నమో విద్యాస్వరూపాయ విద్యాదాత్రే నమోనమః .. 49..

నమః శాంతాయ దేవాయ త్రిగుణాయాత్మనే నమః .
సురాసురనిహంత్రే చ సర్వదుష్టవినాశినే .. 50..

సర్వలోకాధిపతయే బ్రహ్మరూపాయ వై నమః .
నమశ్చేశ్వరవంద్యాయ శంఖచక్రధారయ చ .. 51..

నమ ఆద్యాయ దాంతాయ సర్వసత్త్వహితాయ చ .
త్రిగుణాయాగుణాయైవ బ్రహ్మవిష్ణుస్వరూపిణే ..
కర్త్రే హర్త్రే సురేశాయ సర్వగాయ నమోనమః .. 52..

ఇత్యేవం సంస్తవం కృత్వా దేవదేవం విచింతయేత్ .
హృత్పద్మే విమలే రుద్ర శంఖచక్రగదాధరం ..53..

సూర్యకోటిప్రతీకాశం సర్వావయవసుందరం .
హయగ్రీవం మహేశేశం పరమాత్మానమవ్యయం .54..

ఇతి తే కథితా పూజా హయగ్రీవస్య శంకర .
యఃపఠేత్పరయా భక్త్యా స గచ్ఛేత్పరమం పదం .55..

ఇతి శ్రీగారుడే మహాపురాణే పూర్వఖండే ప్రథమాంశాఖ్యే ఆచారకాండే
హయగ్రీవపూజావిధిర్నామ చతుస్త్రింశోఽధ్యాయః ..

జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము. ఈ హయగ్రీవావతారం కూడా మహావిష్ణువుదే. 

ఒకసారి ఓ రాక్షసుడు తన లాంటి వాడితోనే తనకు మరణం సంభవించాలని కోరుకుంటే ఆ దానవుడి కోరిక తీర్చటానికి మహావిష్ణువు హయగ్రీవావతారు డయ్యాడని ఓ కథనం. ఓ సారి మహా విష్ణువు దానవులతో పోరు సల్పి చాలా అలసిపోయ తన చేతిలోని ధనస్సునే ఆధారం చేసుకొని నిద్రపోయాడు. నిద్రాదేవి ఒడిలో సేదతీరుతున్న మహావిష్ణువును మేల్కొపడానికి ఏ హేతువు కన్పించక ఇంద్రాది దేవతలు చెదపురుగును ధనస్సుకున్న అల్లెత్రాడును కొరకమన్నారట. ఆ శబ్దం వల్ల మహావిష్ణువు మేల్కొంటాడన్న ఆశతో. కానిచెదపురుగు కొరు కుడు వల్ల మహావిష్ణువుకు నిద్రాభంగమేకాక కంఠం కూడా తెగిపోయంది.

రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది.అశ్వ ముఖంతో, మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భు జాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్త్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి హయగ్రీవావతారాన్ని చూచిన దేవతలందరూ చేతులెత్తి మొక్కారు. ఈ అవతారాన్ని కొలిచినవారికి జ్ఞానం అపారంగా కలుగుతుందని పురాణ వచనం. ఈ తండ్రిని కొలవడం వల్ల విద్యార్థులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది. భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించ బడుతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు.

హయగ్రీవ ప్రస్థావన

దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతినాడే ప్రారంభిస్తారు. విద్యార్థులందరూ ఈ రోజున హయగ్రీవుని అర్చించాలి. లౌకిక, పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన శీఘ్ఫ్రలకరం. హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి.హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. మరియు తెల్లపూవులతో పూజించాలి. మరీ ఎక్కువ వాసన కలిగించే పుష్పాలతో పూజించకూడదు. ఇలా శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది. సకలైశ్వర్యాలను కలిగించే హయగ్రీవ పూజ చేయడానికి స్త్రీపురుష తారతమ్యం లేదు.కానీ ఈ రోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి.

 సరస్వతికి గురువు

సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. అందుకే శుద్ధ పూర్ణిమనాడు హయగ్రీవారాధన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. హయగ్రీవోపాసన చేసిన వారికి సకలవిద్యలూ కరతలామలకం అవుతాయ. విశ్వశ్రేయోదాకమైన వేదాలను రాక్షసుల చేతిలో పడనీయక హరియే హయగ్రీవునిగా అవతరించిన ఈ రోజు మనం కూడా హయగ్రీవుని పూజించి ధర్మ సంస్థాపనకు మనవంతు చేయూతనిద్దాం.తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య - విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

స్వస్తి......
సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః

- Prasad Singh

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda